అతికాయత్వం అంటే ఏమిటి?
చేతులు, కాళ్ళు వంటి అంగాలు విడ్డూరమనిపించేలా విపరీతంగా పెరగడాన్నే “అతికాయత్వం” (Acromegaly) అంటారు. ‘అక్రోమెగలి’ (Acromegaly) అనేది ‘అక్రోన్+మెగల్’ అనే రెండు పదాల సముదాయం. ఇది గ్రీకు పదం 'అక్రోన్' నుండి వచ్చింది. 'అక్రోన్' అంటే చివరలు అని అర్థం. 'మెగల్' అనగా చాలా పెద్ద అని అర్థం. శరీరంలో పెరుగుదలకు తోడ్పడే “గ్రోత్ హార్మోన్” (GH) యొక్క అధిక ఉత్పత్తి కారణంగా చేతులు మరియు కాళ్ళు విపరీతంగా పెరిగిన లక్షణాన్ని కలిగి ఉంటుంది.
ఇది సాధారణంగా మధ్య వయస్కులైన వ్యక్తులలో కనిపిస్తుంది, మరియు ఈ పరిస్థితి దాపురించిన వ్యక్తి చాలాకాలం వరకు తనకీ అవలక్షణం వచ్చిందనే విషయాన్నే గుర్తించకపోవడం జరుగుతుంది. అతికాయత్వం అరుదైనది, కాని చికిత్స చేయని పక్షంలో ఇది ప్రాణాంతకమైన సమస్యలను కలిగిస్తుంది.
అతికాయత్వం ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణ లక్షణాలు
- చేతులు, పాదాలు పుర్రె మరియు ముఖం యొక్క ఎముకలు సాధారణం కంటే ఎక్కువగా పెరిగి ఉంటాయి. ఇదే ఈ వ్యాధి ప్రధాన లక్షణం. చేతివేళ్లకు పట్టని ఉంగరాలు ద్వారా, లేదా సరిపోని బూట్లు ద్వారా ఈ అవలక్షణ పరిస్థితిని సాధారణంగా గమనించవచ్చు.
- అతికాయత్వం యొక్క మరో లక్షణం ఏమంటే దవడ యొక్క ఎముకల పరిమాణం పెరగడంతో, ముఖం ఉండాల్సినంత పరిమాణంలో కాకుండా పెద్దగా విడ్డూరంగా కనబడడం, పెరిగిన దవడ ఎముకల కారణంగా అవి ముఖం వెలుపల కనిపిస్తూ విడ్డూరంగా అగుపిస్తాయి.
ఇతర లక్షణాలు
- వ్యాకోచం చెందిన విస్తృత స్వర తంత్రుల (vocal cords) కారణంగా ఆ వ్యక్తి రాసుకుపోయిన (husky) స్వరాన్ని కల్గి ఉంటాడు.
- చర్మం వదులుగా, మందమైనదిగా , మరియు జిడ్డుగాడుతూ ఉంటుంది.
- కీళ్ళ నొప్పి మరియు శ్వాస సమస్యలతో పాటు కండరాల బలహీనత మరియు అలసట కూడా సంభవించవచ్చు.
- మహిళల ఋతు చక్రాలు లో నియమరాహిత్యం చూపించవచ్చు, పురుషుల్లో అయితే అంగస్తంభన సమస్య రావచ్చు.
ప్రధాన కారణాలు ఏమిటి?
- హార్మోన్ల అసమతౌల్యం (Hormonal Imbalance)
సేవించిన ఆహారం, ఒత్తిడి, జీవనశైలి మార్పులు లేదా నిద్ర నమూనాలు కారణంగా, హార్మోన్ల పెరుగుదల (GH) లో ఏదైనా అసమతుల్యత లేదా ఇన్సులిన్-లాంటి పదార్ధం పెరుగుదల కారకం (IGF) వల్ల అతికాయత్వం కల్గుతుంది. - పిట్యూటరీ గడ్డలు Pituitary Tumours
అడెనోమా అని పిలువబడే పిట్యూటరీ కణితి ఫలితంగా కూడా హార్మోన్ల పెరుగుదల (GH) లోపెరిగిన స్రావం ఫలితంగా అతికాయత్వం దాపురించొచ్చు. - నాన్-పిట్యూటరీ గడ్డలు (ట్యూమర్స్) (Non-Pituitary Tumours)
మెదడు, ఊపిరితిత్తులు, అడ్రినల్ గ్రంధులు లేదా క్లోమము వంటి ఇతర ముఖ్యమైన అవయవాలలో కణితి కొన్నిసార్లు హార్మోన్ల పెరుగుదల (GH) దారితీస్తుంది, తద్వారా అతికాయత్వం కల్గుతుంది.
అతికాయత్వం నిర్ధారణ ఎలా జరుగుతుంది, దీనికి చికిత్స ఎలా జరుగుతుంది?
అతికాయత్వం, ఒకేసారి పొడజూపకుండా, క్రమక్రమమైన లక్షణాలతో దాపురిస్తుంది కాబట్టి, దీన్ని ఇది తరచూ గుర్తించడం జరగకపోవడంతో, సమస్యలకు దారితీస్తుంది. ఈ రుగ్మత నిర్ధారణకు ఉపయోగించే వివిధ పద్ధతులు ఇలా ఉన్నాయి:
- రక్త పరిశోధనలు
హార్మోన్ల పెరుగుదల (GH) మరియు ఇన్సులిన్-లాంటి పదార్ధం పెరుగుదల కారకాల (IGF) స్థాయిలను కేవలం ఒక్కసారి కాకుండా కాలక్రమేణా అంచనా వేస్తారు. హార్మోన్ల పెరుగుదల (GH) అణిచివేత పరీక్ష (growth hormone suppression tes)ఫలితంగా ఒక నిశ్చయాత్మక రోగ నిర్ధారణ అవుతుంది. - ఇమేజింగ్
ఎముకల్లో కల్గిన మార్పులను చూడటానికి X- రే స్కాన్లు ఒక ఉపయోగకరమైన సాధనం. మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) లేదా కంప్యూటైజ్డ్ టోమోగ్రఫీ (CT) స్కాన్ కణితి యొక్క స్థానాన్ని మరియు పరిమాణాన్ని నిర్ణయిస్తుంది.
అతికాయత్వం చికిత్స యొక్క లక్ష్యం హార్మోన్ల పెరుగుదల (GH) స్థాయిలను నియంత్రించడం, కణితి పరిమాణాన్ని తగ్గించడం మరియు ఇతర వ్యాధి లక్షణాలను నియంత్రించడం. అతికాయత్వానికి చేసే చికిత్స ఆ వ్యాధి కారణం, లక్షణాలు, వయస్సు మరియు వ్యక్తి యొక్క జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది.
- మందులు
అసమతుల్యతకు బాధ్యత వహించే హార్మోన్ను బట్టి, మీ ఎండోక్రినాలజిస్ట్ (హార్మోన్-ఉత్పత్తి గ్రంధులలో మరియు సంబంధిత వ్యాధులలో నైపుణ్యం కలిగిన ఒక వైద్యుడు) GH లేదా IGF-I స్థాయిలను తీసుకురావడానికి మందులను సూచించవచ్చు. ఇందున కలిగే దుష్ప్రభావాలు వికారం, వాంతులు మరియు అతిసారం. - శస్త్ర చికిత్స/సర్జరీ
ఈ శస్త్ర చికిత్స ప్రక్రియ కణితి ఉన్న వ్యక్తులకు ఉపయోగించబడుతుంది. పిట్యుటరీ గ్రంధికి నష్టం మరియు హార్మోన్ స్రావానికి వైకల్యమేర్పడుతుంది. - రేడియేషన్
కొంతమందిలో, శస్త్రచికిత్స ద్వారా అతికాయత్వాన్ని తగినంతగా తొలగించలేకపోవడం జరుగుతుంది. అటువంటి సందర్భాలలో, హార్మోన్ల పెరుగుదల (GH) స్థాయిలను తగ్గించడానికి రేడియేషన్ థెరపీని ఉపయోగిస్తారు. రేడియేషన్కు చాలా నెలలు అవసరమవుతాయి మరియు దృష్టి బలహీనత మరియు మెదడు గాయం వంటి దుష్ప్రభావాలకు ఈ రేడియేషన్ కారణమవుతుంది.
డయాబెటిస్, రక్తపోటు, మరియు నిద్రలో శ్వాస సమస్య (స్లీప్ అప్నియా) వంటి సంక్లిష్టతలను నివారించడానికి సరైన సమయంలో అతికాయత్వానికి వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స చాలా అవసరం.