నిస్సత్తువ వ్యాధి అంటే ఏమిటి?
నిస్సత్తువ వ్యాధి (ఎడిసన్ వ్యాధి) అనేది వినాళ గ్రంథి (ఎండోక్రైన్) లేదా హార్మోన్ల-ఉత్పత్తి వ్యవస్థ యొక్క అరుదైన రుగ్మత. అధిమూత్ర కృత్క గ్రంధుల (అడ్రినల్ గ్రంధుల) నుండి కార్టిసోల్ మరియు అల్డోస్టెరోన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి తగినంతగా ఉత్పత్తి కాకపోవడం వల్ల ఇది సాధారణంగా “అడ్రినల్ లేమి” లేదా “అడ్రినల్ ఇన్సఫిసియెన్సీ”గా పిలువబడుతుంది. నిస్సత్తువ వ్యాధి వివిధ వయసుల వ్యక్తులకు సంభవిస్తుంది మరియు ఆడవారికి, మగవారికి కూడా సమానంగా దాపురిస్తుంది.
నిస్సత్తువ వ్యాధి ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఆడిసన్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు సాధారణంగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి మరియు కింద పేర్కొన్న వ్యాధి లక్షణాలను కలిగి ఉండవచ్చు:
- తీవ్రమైన అలసట.
- బరువు నష్టం.
- తగ్గిన ఆకలి.
- ఉప్పు తినాలన్న కోరిక.
- అల్ప రక్తపోటు.
- తక్కువ రక్త-చక్కెర.
- వికారం లేదా వాంతులు.
- చర్మం నల్లబడడం లేదా హైపెర్పిగ్మెంటేషన్.
- కుంగుబాటు (డిప్రెషన్).
- పొత్తి కడుపు నొప్పి.
- కండరాలు నొప్పి లేదా కీళ్ళు లో నొప్పి.
- కొన్ని సందర్భాల్లో మూర్ఛ
- మహిళల్లో లైంగిక అసమర్థత.
ప్రధాన కారణాలు ఏమిటి?
కార్డిసోల్ మరియు ఆల్డోస్టెరోన్ వంటి హార్మోన్లు తగినంతగా ఉత్పత్తి కాకపోవడంవల్ల నిస్సత్తువ వ్యాధి కలుగుతుంది. అడ్రినల్ గ్రంథులు (మూత్రపిండాలు పైన ఉన్న గ్రంథులు) యొక్క వల్కలం దెబ్బతింటున్నప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది మరియు అందువలన ‘ప్రాధమిక అడ్రినల్ లోపం’ అని పిలువబడుతుంది.
అడ్రినల్ గ్రంథి వైఫల్యం యొక్క అత్యంత సాధారణ కారణాలు:
- అడ్రినల్ గ్రంధులలో రక్తస్రావం.
- అడ్రినల్ గ్రంధులకు క్యాన్సర్ వ్యాప్తి.
- క్షయ.
- అడ్రినల్ గ్రంథులకొచ్చే కొన్ని అంటురోగాలు శిలీంధ్రాలు, వైరస్లు, పరాన్న జీవులు మరియు బాక్టీరియా వంటి కొన్ని ఎజెంట్ల కారణంగా సంభవిస్తాయి.
నిస్సత్తువ వ్యాధిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స?
సాధారణంగా, నిస్సత్తువ వ్యాధిని తొలి దశల్లో నిర్ధారించడం కష్టం. అయితే, మీ లక్షణాలు మరియు మీ వైద్య చరిత్ర ఆధారంగా, డాక్టర్ మొదట మిమ్మల్ని భౌతికంగా పరీక్షిస్తారు.
దీని తరువాత, వైద్యుడు/వైద్యురాలు వివిధ హార్మోన్ల స్థాయిలను గుర్తించడానికి కొన్ని జీవరసాయనిక ప్రయోగశాల పరీక్షలను సూచించవచ్చు. మీలోని కాల్షియం నిల్వల్ని తనిఖీ చేయడానికి ఉదరం మరియు కటి ప్రాంతాల X-రే తీసుకొమ్మని వైద్యుడు మీకు సూచించవచ్చు. మీ అడ్రినల్ గ్రంధులు (అధివృక్కగ్రంధులు) పని చేస్తున్నాయా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి మిమ్మల్ని “అడ్రెనొకోర్టికోట్రోఫిక్ హార్మోన్” (adrenocorticotrophic hormone (ACTH) స్టిములేషన్ పరీక్ష చేయించుకొమ్మని డాక్టర్ మిమ్మల్ని అడగొచ్చు. ఈ పరీక్షలో ACTH ఇంజక్షన్ ఇచ్చి కార్టిసోల్ ఉత్పత్తిని వైద్యుడు పరిశీలిస్తాడు.
నిస్సత్తువ వ్యాధికి చికిత్స విస్తృతంగా ఉండి, క్రింది ఔషధీయ పద్ధతుల్ని (regimens) కలిగి ఉంటుంది:
- ఓరల్ హార్మోన్ల చికిత్స, ఈ చికిత్సలో మింగేందుకు ఇచ్చే ఔషధాలు అడ్రినల్ గ్రంధులు ఉత్పత్తి చేసే హార్మోన్లను భర్తీ చేస్తాయి. మీకు హైడ్రోకార్టిసోనే మాత్రలు లేదా మినెరలోకోర్టికాయిడ్లును మీకు వైద్యుడిచే సూచించబడవచ్చు.
- నిస్సత్తువ నుండి మీరు వేగవంతంగా బయటపడి కోలుకోవడానికి హైడ్రోకార్టిసోనే యొక్క ఇంట్రావీనస్ (సిరల్లోకి సూది మందును ఇంజెక్ట్ చేయడం) ఇంజెక్షన్లు తీసుకోవడానికి వైద్యుడిచే మీకు సూచించబడవచ్చు.