సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి?
సెప్టిక్ ఆర్థరైటిస్ (SA), లేదా ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్, కీళ్ల యొక్క ద్రవం (fluid) మరియు కణజాలాల (tissues) సంక్రమణ (infection). ఇది ప్రధానంగా రక్తప్రవాహం ద్వారా లేదా గాయాల ద్వారా గాని సూక్ష్మ జీవులు (germs) కీళ్ళలోకి చేరుకుంటే ఈ ఇన్ఫెక్షియస్/ సెప్టిక్ ఆర్థరైటిస్ సంభవిస్తుంది. ఇది అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేసే తీవ్రమైన సమస్య. శిశువుల్లో, ఇది సాధారణంగా వారి సహజముగా లోపంతో కూడిన రక్షణ యంత్రాంగాల (defence mechanisms) వలన సంభవిస్తుంది. భారతదేశంలో జన్మించిన శిశువులలో దాని సంభవం 1500 లో 1.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మోకాలు మరియు తుంటిలో వచ్చే సెప్టిక్ ఆర్థరైటిస్ సాధారణంగా పెద్ద పిల్లలు మరియు పెద్దలలో కనిపిస్తుంది, తుంటి మరియు భుజంలో వచ్చే సెప్టిక్ ఆర్థరైటిస్ నవజాత శిశువులలో సాధారణం. అత్యంత సాధారణ లక్షణాలు నొప్పి, జ్వరం, వాపు, సున్నితత్వం, ఎరుపు మరియు నొప్పితో కుంటడం వంటివి. లక్షణాలు వయసుతో పాటు మారుతుంటాయి. సాధారణంగా, ఒక కీలు దెబ్బతింటుంది, కానీ అరుదైన సందర్భాలలో, చాలా కీళ్ళు ప్రభావితం కావచ్చు. కీళ్ల నొప్పి ప్రభావితమైన కీళ్లలో మరింత తీవ్రంగా లేదా కదిలించలేని విధంగా చేస్తుంది. శరీరం యొక్క వివిధ ప్రాంతాలలో సంక్రమణ వలన రియాక్టివ్ ఆర్థరైటిస్ (Reactive arthritis) కూడా సంభవించవచ్చు.
శిశువులు మరియు అప్పుడే పుట్టినవారు ఈ క్రింది లక్షణాలను చూపిస్తారు:
- ప్రభావితమైన కీలు కదిలించినప్పుడు ఏడవడం
- జ్వరం
- ఇన్ఫెక్షన్ సోకిన కీలును కదిలించలేకపోవడం
- పీకులాట (Fussiness)
ప్రధాన కారణాలు ఏమిటి?
ఇది ప్రధానంగా బ్యాక్టీరియా వలన మరియు అరుదుగా శిలీంధ్రాలు(fungus) లేదా వైరస్ల ద్వారా సంభవిస్తుంది.
సాధారణంగా సెప్టిక్ ఆర్థరైటిస్ కారణమయ్యే జీవులు:
- స్టెఫలోకోకి (Staphylococci)
- హెమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా (Haemophilus influenza)
- గ్రామ్ -నెగటివ్ బాసిల్లి (Gram-negative bacilli)
- స్ట్రెప్టోకోకి (Streptococci)
కీలు ప్రదేశంలోకి బాక్టీరియా యొక్క ప్రవేశం వీటి ద్వారా ఉంటుంది:
- శరీరం యొక్క ఇతర భాగాల నుండి అంతర్లీన సంక్రమణ (infection) ద్వారా
- వ్యాపించిన పుండ్లు
- చర్మంలోకి చొచ్చుకొనే పగుళ్లు
- విదేశీ క్రిమి చర్మంలోకి చొచ్చుకొనిపోయినప్పుడు
- గాయాలు
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్సఏమిటి?
వైద్యులు సాధారణంగా పూర్తి ఆరోగ్య చరిత్రను తీసుకొని, శారీరక పరీక్షలను నిర్వహించడం మరియు ప్రయోగశాల పరీక్షలను నిర్వహించడం ద్వారా సెప్టిక్ ఆర్థరైటిస్ని నిర్ధారిస్తారు. ఈ క్రింది పరీక్షలు సిఫారసు చేయబడవచ్చు:
- కీళ్ల ద్రవం విశ్లేషణ: కీళ్ల ద్రవంలో అంటువ్యాధిని గుర్తించడానికి.
- రక్త పరీక్షలు: సంక్రమణ (infection) తీవ్రత మరియు రోగనిరోధక ప్రతిచర్యలను తనిఖీ చేయడానికి, ఏదైనా ఉంటే.
- సూక్ష్మజీవ విశ్లేషణ: శరీరంలో బాక్టీరియా / ఫంగస్ / వైరస్ల రకం గుర్తించడానికి.
- ఇమేజింగ్ పరీక్షలు: X- కిరణాలు, అల్ట్రాసౌండ్ మరియు ప్రభావిత కీలు యొక్కMRI.
సెప్టిక్ ఆర్థరైటిస్ చికిత్స ప్రధానంగా అంటువ్యాధిని కలుగజేసే జీవి పై ప్రయోగించే మరియు రోగి తట్టుకునే యాంటీబయాటిక్స్ యొక్క సరైన ఎంపికపై దృష్టి పెడుతుంది. చికిత్స రెండు నుండి ఆరు వారాల పాటు ఉండవచ్చు. యాంటీబయాటిక్స్ పని చేయడానికి సూది లేదా ఆర్త్రోస్కోపీ (arthroscopy) ఉపయోగించి కీళ్ల పారుదల (Joint drainage) తరచుగా జరుగుతుంది. పారుదల (drainage) కష్టంగా ఉండే కీళ్ల కోసం ఓపెన్ సర్జరీ కూడా చేయవచ్చు. కీళ్ల పారుదల సంక్రమణను (infection) నిర్మూలించటానికి సహాయపడుతుంది, నొప్పి ఉపశమనం మరియు కోలుకొనుట వేగవంతం చేస్తుంది.
ఇతర ప్రభావవంతమైన చికిత్సలు:
- నొప్పి మరియు జ్వరం ఉపశమనం మందులు.
- కండరాల బలం మరియు కీళ్ల కదలిక శ్రేణిని నిర్వహించడానికి భౌతిక చికిత్స.
- కీళ్ల నొప్పి నుండి ఉపశమనానికి బద్దకట్టుట (splints).
- కీళ్ల యొక్క అనవసరమైన కదలికను పరిమితం చేయడం.
సొంత రక్షణ చిట్కాలు:
- బాహ్య ఒత్తిడి లేదా హాని నుండి బాధిత కీలుని రక్షించడానికి విశ్రాంతి చాలా ముఖ్యం.
- గుండె స్థాయి పైకి కీలుని ఎత్తిపెట్టి మరియు చల్ల నీటి కాపడం ఉపయోగించడం వలన నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
- కోలుకున్న తర్వాత, కండరాల బలం మరియు చలన శ్రేణులను తిరిగి పొందడానికి సున్నితమైన వ్యాయామాలు చేయాలి.
- ఒమేగా -3 ఫ్యాట్లు అధికంగా ఉన్న ఆహారాలు వాపును తగ్గిస్తాయి మరియు చికిత్సలో సహాయం చేస్తాయి. అవి:
- సాల్మోన్ మరియు సార్డినెస్ వంటి నూనెగల చేపలు
- అవిసె గింజలు
- అక్రోటుకాయలు