సారాంశం
చెడు శ్వాస అనేది శ్వాస తీసుకొనే సమయంలో నోటి నుండి వెలువడే ఒక అసహ్యకరమైన వాసనగా చెప్పవచ్చు. వైద్య పరిభాషలో చెడు శ్వాసను హాలీటోసిస్ లేదా ఓరల్ మలడార్ అని అంటారు. దాని మూలాలు (నోరు లేదా శరీరం) తో సంబంధం లేకుండా శరీరం నుండి వచ్చే అసహ్యకరమైన వాసన కూడా హాలిటోసిస్గా పిలువబడుతుంది. కానీ నోటి దుర్వాసన అనేది ముఖ్యంగా నోటి నుండి వచ్చే చెడు శ్వాసను సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చెడు శ్వాస ప్రభావం చూపుతుందని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఇది తరచుగా నిర్లక్ష్యం చేయబడుతుంది మరియు చెడు శ్వాసతో బాధపడుతున్న ప్రజలు ముఖ్యమైన మానసిక మరియు సామాజిక వైకల్యతకు లోనవుతారు. చెడు శ్వాసకు అతి సాధారణ కారణం ఏమిటంటే జిగురు వంటి సూక్ష్మజీవులు సాధారణంగా మన పంటి చిగుళ్ళు మరియు నాలుకలో ఒక పొరను ఏర్పరుస్తాయి. మంచి సూచన ఏమిటంటే నోటిని పరిశుభ్రత చేసుకోవడం మరియు ఒక వైద్యుడు సూచించిన కొన్ని మందులు సాధారణంగా నోటి వాసన నుండి పూర్తిగా కోలుకోవడంలో సహాయ పడుతుంది.
మీకు తెలుసా?
దీర్ఘకాలిక చెడు శ్వాస అనేది ప్రపంచ జనాభాలో దాదాపు 25% జనాభాను ప్రభావితం చేసే తీవ్రమైన పరిస్థితి. పురుషులు మరియు మహిళలు సమాన నిష్పత్తిలో చెడు శ్వాసను ఎదుర్కొంటారు కానీ పురుషులు కంటే మహిళలు వేగవంతమైన సహాయం మరియు చికిత్స కోరుకుంటారు అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చెడు శ్వాసకు తరచుగా కనీస వైద్యప్రమేయంతో ఉపశమనం పొందవచ్చు అని వైద్యులు పేర్కొoటున్నారు. అయితే కొన్ని మూలాధార వైద్య పరిస్థితుల కారణంగా అసహ్యకరమైన వాసన మరియు చెడు శ్వాస సంభవించవచ్చు. అందువల్ల దీన్ని విస్మరించవద్దు, మీకు 15 రోజుల కన్నా ఎక్కువ రోజులు నిరంతరంగా ఈ సమస్య ఉన్నట్లయితే దంతవైద్యుని లేదా ఇ.ఎన్.టి నిపుణుని సంప్రదించండి.