బర్డ్ ఫ్లూ - Bird Flu in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

November 28, 2018

January 06, 2021

బర్డ్ ఫ్లూ
బర్డ్ ఫ్లూ

బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి?

ఏవియన్ ఇన్ఫ్లుఎంజ(avian influenza) అని వైద్య పరిభాషలో సూచించబడే బర్డ్ ఫ్లూ మానవులలో ఒక అరుదైన సంక్రమణం (infection). పేరులో సూచించినట్లు, ఇది పక్షులలో కనిపించే ఒక వైరల్ సంక్రమణ(infection). అయినప్పటికీ, ఇది మానవులకు కూడా హాని కలిగించవచ్చు. ఒక వ్యాధి సోకిన వ్యక్తి అనేక ఫ్లూ లాంటి లక్షణాలు కలిగి ఉంటాడు మరియు చికిత్స అవసరం. భారతదేశంలో, బర్డ్ ఫ్లూ కేసులు ఇంచుమించు నాలుగువేల కంటే తక్కువగా నమోదవుతున్నాయి.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు ఇన్ఫ్లుఎంజా మాదిరిగానే ఉంటాయి. సాధారణ లక్షణాలు:

అప్పుడప్పుడు, రోగులు కూడా వికారం మరియు వాంతులను కూడా అనుభవిస్తారు. ప్రత్యామ్నాయంగా, రోగులు ఏ ఇతర లక్షణాలు లేకుండా, కేవలం కంటి సంక్రమణ (infection) కలిగి ఉండవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

రెండురకాల బర్డ్ ఫ్లూ వైరస్లు ఉన్నాయి, మానవులలో అత్యంత సాధారణ రకం H5N1. మానవులలో, ఈ సంక్రమణ (infection) పక్షుల ద్వారా ప్రధానంగా ఈ క్రింది మార్గాలలో ఒకదాని ద్వారా వ్యాపిస్తుంది:

పౌల్ట్రీను (కోళ్ల సాగు) నిర్వహించడం

  • బహిరంగ బజారులలో పక్షి గుడ్లు మరియు పౌల్ట్రీలను విక్రయించేటప్పుడు గాలిలో వ్యాపించే పదార్థాలను పీల్చడం
  • వ్యాధి సోకిన పక్షులను తాకడం
  • వ్యాధి సోకిన పక్షుల స్రావాల చుక్కలు పడిన నీటిలో స్నానం

సరిగ్గా ఉడకని వ్యాధి సోకిన పక్షుల మాంసం మరియు గుడ్లు సంక్రమణను (infection) వ్యాపిస్తాయి. పూర్తిగా ఉడికించిన మాంసం లేదా గుడ్లు తినడం మానవులకు సురక్షితం. ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపించదు.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

బర్డ్ ఫ్లూ కోసం ప్రత్యేక పరీక్ష అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉండనందున, సాధారణ ల్యాబ్ పరిశోధనల ద్వారా సంక్రమణ (infection) ను నిర్ధారణ చేయవచ్చు.

  • ముక్కు మరియు గొంతు నుండి వచ్చే ద్రవం నమూనాలను పరిశీలించడం అనేది వైరస్ ను తనిఖీ చేయడానికి సహాయపడుతుంది.
  • ఒక పూర్తి రక్త గణన (complete blood count) శరీరంలో ఒక సంక్రమణ యొక్క ఉనికిని నిర్ధారిస్తుంది.
  • ఛాతీ ఎక్స్-రే (X- రే) ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి సహాయపడుతుంది.

బర్డ్ ఫ్లూ యొక్క ప్రామాణిక చికిత్స యాంటీ వైరల్ మందులు కలిగి ఉంటుంది.

  • లక్షణాలు కనిపించిన తొలి 48 గంటలలోనే మందులను తీసుకోవడం చాలా ముఖ్యం.
  • మానవులలో ఈ వైరస్, సాధారణమైన వైరస్ వ్యతిరేక మందులకు నిరోధకతను అభివృద్ధి చేస్తుంది, అందువలన ప్రత్యామ్నాయ మందులు సూచించబడవచ్చు.
  • నివారణ చర్యగా, రోగి యొక్క కుటుంబ సభ్యులందరిలోను ఈ వైరస్ కోసం తనిఖీ చేయబడవచ్చు మరియు వ్యాధికి బహిర్గతం చేయగల అవకాశాల నుండి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు.
  • కొన్ని సందర్భాల్లో, సంక్రమణ వ్యాప్తి అవకాశాలను తొలగించడానికి రోగిని వేరుగా ఉంచవచ్చు.



వనరులు

  1. Direct (Elsevier) [Internet]; CTL epitopes for influenza A including the H5N1 bird flu; genome-, pathogen-, and HLA-wide screening
  2. Ron A. M et al. Avian influenza A virus (H7N7) associated with human conjunctivitis and a fatal case of acute respiratory distress syndrome. Proceedings of the National Academy of Sciences Feb 2004, 101 (5) 1356-1361
  3. Looi FY et al. Creating Disease Resistant Chickens: A Viable Solution to Avian Influenza?. Viruses. 2018 Oct 15;10(10). pii: E561.PMID: 30326625
  4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Information on Avian Influenza
  5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Avian Influenza in Birds