రక్తం పల్చబడడం - Blood Thinning in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 03, 2019

March 06, 2020

రక్తం పల్చబడడం
రక్తం పల్చబడడం

రక్తం పల్చబడడం అంటే ఏమిటి?

రక్తం పల్చబడడం వ్యాధి అంటే రక్తం గడ్డ కట్టకుండా పొయ్యే ఓ విపత్కర పరిస్థితి, ఇది రక్తస్రావం వ్యాధులకు దారితీస్తుంది. రక్తం సరిగా గడ్డకట్టకపోవడం అనేది రక్తంలోని వివిధ భాగాల్లోని లోటుపాట్ల కారణంగా లేక రక్తం గడ్డకట్టే కారకాలవల్ల జరుగుతుంది. పదమూడు రక్తం గడ్డకట్టే కారకాల్ని మన శరీరం ఉత్పత్తి చేస్తుంది. ఈ 13 కారకాల్లో ఏదైనా ఒక్క గడ్డ కట్టే కారకానికి ఏదైనా లోపం లేదా కొరత ఏర్పడితే రక్తం పల్చబడడం అనే వ్యాధి గుణమేర్పడి రక్తస్రావం వ్యాధులు దాపురిస్తాయి.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

రక్తస్రావం రుగ్మతలు ఉన్న వ్యక్తులలో క్రింది లక్షణాలను గమనించవచ్చు:

  • సులువుగా వివరించడానికి వీలు లేని ముక్కుస్రావాలు .
  • రక్తం కారే చిగుళ్ళు
  • చిన్న చిన్న కత్తి గాట్లకు, మరియు ఇంజక్షన్ సూది మందులు ఇచ్చిన తర్వాత అయ్యే గాయాల ద్వారా మామూలు కంటే ఎక్కువ సమయాలపాటు రక్తస్రావం కావడం.
  • శస్త్రచికిత్స సమయంలో మరియు తరువాత అధిక రక్తస్రావం.
  • దంత ప్రక్రియ తర్వాత సుదీర్ఘ కాలంపాటు రక్తస్రావం.
  • రక్తంలో ఏ గడ్డలు లేకుండా భారీ ఋతు రక్తస్రావం.

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

రక్తస్రావం వ్యాధులు దెబ్బతిన్న గడ్డకట్టే కారకాలు, రక్తంలో రక్తకణాల (ప్లేట్లెట్) గణన తగ్గడం, లేదా రక్తకణాల (ప్లేట్లెట్స్) యొక్క అక్రమ పనితీరు కారణంగా సంభవిస్తాయి. రక్తం పల్చబడడం అనే రుగ్మతలు వాటి అంతర్లీన కారణాల ఆధారంగా వర్గీకరించబడతాయి:

  • జన్యుపరమైన లేదా హేమోఫిలియా వంటి పొందిన వ్యాధి కారకాలవల్ల కారణాలు (వారసత్వంగా రక్తస్రావం).
  • రక్తహీనత, విటమిన్ K లోపం, మానవ రోగనిరోధక శక్తి వైరస్ (హెచ్.ఐ.వి) సంక్రమణ , కాలేయ సిర్రోసిస్, మరియు లుకేమియా వంటి కొన్ని ఇతర ఆరోగ్య పరిస్థితులు కారణంగా .
  • ఆస్పిరిన్, వార్ఫరిన్ మరియు హెపారిన్ వంటి కొన్ని మందుల దీర్ఘకాలవాడకం.

దీనిని నిర్ధారణ చేసేదెలా మరియు చికిత్స ఏంటి?

రక్తం పల్చబడడం అనే రుగ్మత నిర్ధారణను కింది పద్ధతిలో చేస్తారు:

  • పూర్తి వైద్య చరిత్ర యొక్క సమీక్ష.
  • శారీరక పరిక్ష.
  • బ్లడ్ కౌంట్ వంటి పూర్తి రక్త వివరాల్ని గుర్తించడానికి రక్త పరీక్ష.
  • రక్తం గడ్డ కట్టే సమయం గుర్తించడానికి పరీక్షలు.
  • ఏదైనా రక్త ప్రోటీన్ లోపం ఉన్నట్లయితే దాన్ని గుర్తించడానికి పరీక్షలు.

రక్తాన్ని పల్చబరచడమనే వ్యాధికి ఖచ్చితమైన చికిత్స అనేది వ్యాధి తత్త్వం మరియు తీవ్రతను బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని రక్తస్రావ రుగ్మతలలో, రక్తం పల్చబడకుండా నిరోధించడానికి చికిత్సగా రక్తాన్ని గడ్డ కట్టించే మూలకాలుగా కషాయాలను శరీరం లోనికి ఎక్కించడం (infusions గా) జరుగుతుంది. అయితే, ఇతర రుగ్మతల విషయంలో పైపూత మందులు మరియు నాసికా పిచికారీలు (nasal sprays) ఉపయోగించబడతాయి. రక్తస్రావం రుగ్మతలకు క్రింది చికిత్సల్ని డాక్టర్ సూచించవచ్చు:

  • విటమిన్ K ఇంజెక్షన్.
  • రక్త ప్లాస్మా లేదా ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్.
  • రక్తం గడ్డకట్టడానికి సహాయపడే మందులు.
  • రక్తకణాలకు (platelets) సంబంధించిన వైపరీత్యాలను నయం చేసేందుకు హైడ్రాక్సీయూరియా వంటి ఇతర మందులు.



వనరులు

  1. Salonia J. Common blood thinners: what are the differences?. J Emerg Nurs. 2008 Apr;34(2):174-6. PMID: 18358365
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Blood Thinners
  3. American Society of Clinical Oncology. Bleeding Problems. UK; [Internet]
  4. American Society of Hematology. Bleeding Disorders. Washington, DC; [Internet]
  5. National Hemophilia Foundation. What is a Bleeding Disorder?. New York; [Internet]