మెదడు సంక్రమణ (infection) అంటే ఏమిటి?
మెదడు యొక్క వివిధ భాగాలను బాధించే అంటువ్యాధులను వర్ణించేందుకు ఉపయోగించే సాధారణ పదం మెదడు సంక్రమణ లేక “బ్రెయిన్ ఇన్ఫెక్షన్”. మెదడు సంక్రమణ వ్యాధి మెదడు మజ్జ రోగం (meningitis), మెదడు కురుపు (brain abscess) మరియు మెదడు వాపు వ్యాధికి దారి తీస్తుంది. మెదడు మజ్జ రోగం మెదడును కప్పి ఉండే పొరల యొక్క వాపు (వాపు). మెదడు కణజాలం యొక్క వాపును మెదడు వాపు వ్యాధిగా వ్యవహరించడం జరుగుతోంది. మెదడు కురుపు (brain abscess) వ్యాధి అంటే మెదడులో చీముతో కూడిన ఓ తిత్తి లాంటి కురుపు, ఇది మెదడు కణజాల విచ్ఛేదనం ఫలితంగా మెదడులో దాపురిస్తుంది. .
మెదడు సంక్రమణ ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మెదడు సంక్రమణలో కనిపించే సాధారణ లక్షణాలు:
- జ్వరం
- తలనొప్పి
- వాంతులు
- మెడ బిరుసుదనం
- మూర్ఛ
- బలహీనత
- ప్రవర్తనలో మార్పిడి
- కంటి చూపులో అవాంతరాలు.
- మాట్లాడడంలో, నేర్చుకోవడం లేక అభ్యాసం చేయడంలో, జ్ఞాపకశక్తిలో మరియు ఏకాగ్రతలో అశక్తత.
మెదడు సంక్రమణకు ప్రధాన కారణాలు ఏమిటి?
మెదడు సంక్రమణ వ్యాధి సూక్ష్మజీవులు, వైరస్, శిలీంధ్రాలు లేదా పరాన్నజీవులవల్ల కలుగుతుంది. సూక్ష్మజీవులు క్రింది మార్గాలలో మెదడును చేరుకుని మనకు హాని చేస్తాయి.
- రక్తం ద్వారా - ఊపిరితిత్తుల, గుండె మరియు దంత సంక్రమణంవల్ల రక్తం ద్వారా ఈ సూక్ష్మజీవులు మెదడు మరియు దాని నిర్మాణాలను చేరుకోగలవు. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగినవారు లేదా ప్రతిరక్షా నిరోధక (immunosuppressant) మందుల్ని సేవిస్తున్న వారు ఈ మెదడు సంక్రమణ వ్యాధికి గురయ్యే ప్రమాదముంది.
- నేరుగా లేదా ప్రత్యక్ష పరిచయం ద్వారా- సూక్ష్మజీవులు శస్త్రచికిత్స సమయంలో లేదా తలపై బహిర్గతమైన గాయం / పుండు ద్వారా మెదడులోకి ప్రవేశించవచ్చు.
- మధ్య చెవి సంక్రమణ, చెవి వెనుక ఉండే ఎముక వాపు (మాస్టాయియిటిస్) మరియు ముక్కుపొరల్లో (membrane) వాపు (sinusitis) సైనసిటిస్ వంటి మెదడుకు దగ్గరగా ఉండే భాగాలకు కల్గిన ఇన్ఫెక్షన్ ద్వారా సూక్ష్మజీవులు మెదడును చేరుకుంటాయి.
మెదడు సంక్రమణకు కారణమయ్యే సాధారణ సూక్ష్మజీవులు క్రింది విధంగా ఉన్నాయి:
- టి. గోండి (T.gondii) , టి. సోలియం (T.solium) మరియు ఆస్పెరిల్లస్ వంటి శిలీంధ్రాలు .
- ఎన్. మెనింజిటైడ్స్ (N.meningitides), S. న్యుమోనియే , H. ఇన్ఫ్లూయెంజా మరియు ఇతర బాక్టీరియా సూక్ష్మజీవులు
- చికున్గున్యా (chikungunya) వైరస్, హెర్పెస్ జోస్టర్ మరియు సింప్లెక్స్ సైటోమెగాలోవైరస్కి మరియు వెస్ట్ నైల్ ల వంటి వైరస్లు .
మెదడు సంక్రమణని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మీరు అనుభవించిన సంకేతాలు మరియు లక్షణాల ఆధారంగా, మీ డాక్టర్ మెదడులో లేదా దాని కప్పుల్లో వాపు ఉనికిని గుర్తించడానికి MRI లేదా CT స్కాన్ వంటి డయాగ్నొస్టిక్ ఇమేజింగ్ పరీక్షలు ద్వారా సంపూర్ణ భౌతిక పరీక్ష చేస్తారు. ఓ సంక్రమణను నిర్ధారించడానికి, సెరెబ్రోస్పానియల్ ద్రవం (CSF) విశ్లేషణ (కణితి పంక్చర్) జరుగుతుంది, ఇక్కడ CSF ను దిగువ వెన్ను (వెన్నెముక కాలమ్ యొక్క కటి ప్రాంతం) నుండి తీసుకోబడుతుంది మరియు సూక్ష్మజీవుల ఉనికి కోసం విశ్లేషించబడుతుంది. సాధారణ రక్త పరీక్షలను కూడా వ్యాధి-కలిగించే సూక్ష్మక్రిముల్ని గుర్తించడం కోసం జరుగుతుంది.
మెదడులో ఉనికిని ఏర్పరచుకున్న హానికారక సూక్ష్మజీవుల ఆధారంగా, యాంటీబయాటిక్స్, యాంటీ వైరల్, లేదా శిలీంధ్రసూక్షజీవుల్ని సంహరించే మందుల్ని మెదడు సంక్రమణ వ్యాధిని నయం చేయడానికి వైద్యుడు సూచిస్తాడు. ఔషధజీవన వ్యవధి వ్యాధి కారకం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వ్యాధి ప్రాణాంతకమైన స్థితికి చేరి ఉంటే గనుక శస్త్రచికిత్స చేయబడుతుంది.