సారాంశం
మెదడు వాపు అనేది మెదడులోని కణాల యొక్క అసాధారణ పెరుగుదల. ఈ గడ్డలు హాని చేయనివిగా (నిరపాయమైన) లేదా కాన్సర్ కారకమైనవి కావచ్చు (ప్రాణాంతక). మెదదులోనే ఏర్పడే గడ్డలను ప్రాధమిక మెదడు వాపు అంటారు. మరోపక్క, ఉపరి మెదడు వాపు లేదా మెటాస్టాటిక్ మెదడు వాపు అనేవి ఇతర శరీర భాగాల్లో కాన్సర్ ద్వారా ఏర్పడి మెదడు వరకు చేరేవి. మెదడు వాపు వ్యాధి లక్షణాలు కణితి పరిమాణము, కణితి పెరిగే వేగము మరియు కణితి ఉన్న ప్రదేశం వంటి వాటి మీద ఆధారపడతాయి. కొన్ని త్వరిత మరియు సాధారణమైన మెదడు వాపు లక్షణాల్లో మారుతూ ఉండే తలనొప్పి తీరు, తరచూ మరియు తీవ్రంగా వచ్చే తలనొప్పులు, మాట్లాడుటలో ఇబ్బందులు మరియు సమతౌల్యతలో ఇబ్బందులు వంటివి కూడా ఉంటాయి. మెదడు వాపు చికిత్స మెదడు వాపు రకమే కాకుండా కణితి యొక్క పరిమాణము మరియు అది ఉన్న ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది.