బులిమియా నెర్వోసా అంటే ఏమిటి?
బులిమియా నెర్వోసా రుగ్మత లేక అధికంగా తినే రుగ్మత అనేది ‘తినడం-విసర్జించడం’ అనే పునరావృత కాలాలతో కూడుకున్న పరిస్థితి. ఇదో మానసిక పరిస్థితి. ఇది పురుషులు మరియు స్త్రీలు ఇద్దరిలోనూ సాధారణం కానీ టీనేజ్ యువతుల్లోచాలా తరచుగా జరుగుతుందిది. వ్యక్తి అధికంగా తినాలనుకోవచ్చు (అతి కొద్ధిసమయంలో పెద్ద మొత్తంలో ఆహారాన్ని దూకుడుగా తినడం), అది కూడా ఎప్పుడుపడితే అప్పుడు తినడం, తినడంపై నియంత్రణ కోల్పోయి అధికంగా తినేయడం,అంతలోనే, అకస్మాత్తుగా సిగ్గుపడటంతో, ఆ వ్యక్తి యొక్క స్వీయ-ప్రేరిత వాంతి-భేది ద్వారా తిన్నది విసర్జించేయాలని కోరుకుంటారు. ఈదిశలోనే వ్యక్తి బరువు కోల్పోయే మందులు ఉపయోగిస్తారు, భేది మందులు మరియు మూత్రకారక మందుల్ని తీసుకోవడం జరుగుతుంది, అధిక-వ్యాయామం చేస్తారు మరియు ఉపవాసం చేయడం వంటివీ చేస్తారు. ఈ ప్రక్రియలన్నీ, అప్పుడప్పుడు, ప్రాణాంతకమయ్యే ప్రమాదానికి దారి తీస్తుంది.
దీని చిహ్నాలు మరియు లక్షణాలు ఏమిటి?
దీని ముఖ్యమైన సంకేతాలు మరియు లక్షణాలు ఇలా ఉన్నాయి
- మితం లేకుండా తినడం, బహిరంగంగా తినడానికి ఇష్టపడక పోవటం
- శరీరం ఆకారం మరియు బరువు గురించి చాలా క్లిష్టమైన ధ్యాస.
- మనోస్థితిలో డోలాయమానం, ఆందోళన , మరియు నిరాశ
- భోజనం తర్వాత తరచుగా విసర్జనార్థం బాత్రూమ్ సందర్శనలు
- వాంతి వాసన (వాంతి వచ్చినట్లుండడం)
- అధిక వ్యాయామం
- భేదిమందు, మూత్రవిసర్జన కారక మందులు, మరియు బరువు కోల్పోయేందుకు మాత్రలు ఉపయోగించడం.
- బరువులో హెచ్చుతగ్గులు (ఫ్లూక్యువేషన్స్), కానీ వ్యక్తి సాధారణంగా సమానమైన బరువును నిర్వహిస్తుంటారు. తరచుగా వైద్యులు మరియు కొందరు ఏమనుకుంటారంటే బులీమియాకు గురైన వాళ్ళు బరువు తక్కువగా ఉంటారని. ఇది బులీమియాను గుర్తించకుండా ఉండేట్టు చేయవచ్చు లేదా గుర్తించేందుకు ఎక్కువ సమయం పట్టేలా చేయచ్చు.
- చేతులు మరియు కాళ్ళ వాపు
- మెడల మీద మచ్చలు లేదా పుళ్ళు
- దంతాల వివర్ణీకరణ మరియు చిగుళ్ళకు దెబ్బ
- ఆహారం మరియు ఖచ్చితమైన ఆహార నియంత్రణలో అయిష్టత
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
బులీమియా యొక్క ఖచ్చితమైన కారణం తెలియదు. జన్యుపరమైన కారణాలు, కుటుంబ చరిత్ర, శరీర బరువు మరియు శరీర ఆకృతి గురించిన ఆందోళన, తక్కువ స్వీయ-గౌరవం, ఖచ్చితత్వం కోరుకునే వ్యక్తిత్వం లేదా పరిపూర్ణత్వ వ్యక్తిత్వం లేక పరిపూర్ణత్వం కోరుకునే స్వభావం, ఆందోళన మరియు కుంగుబాటుకు సంబంధించిన కొన్ని కారణాలు కావచ్చు.
దీనిని ఎలా నిర్ధారిస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
పైన పేర్కొన్న సంకేతాలు మరియు లక్షణాల ఆధారంగా, వైద్యుడు బోలీమియాను ఇలా నిర్ధారణ చేయవచ్చు
- ఆహారపు అలవాట్లు, బరువు నష్టం పద్ధతులు మరియు శారీరక లక్షణాల గురించి ప్రశ్నించడం
- గుండె పనితీరును అంచనా వేయడానికి రక్త, మూత్రం మరియు ఎలెక్ట్రాకార్డియోగ్రామ్ వంటి ప్రాథమిక పరీక్షలు
- రోగనిర్ధారణను ధ్రువపరచుకోవడానికి రోగనిర్ణయకారి మరియు గణాంక మోడల్ -5 (DSM-5) సాధనాన్నిఉపయోగించడం
బులీమియా చికిత్సకు మనోరోగ వైద్యుడు, వైద్యుడు మరియు ఆహార నిపుణుడుతో సహా ఓ నిపుణుల బృందం అవసరం. మానసిక సలహా సమావేశంతో కూడిన చికిత్స మొదలవుతుంది, కాని లక్షణాల తీవ్రతను బట్టి, మందులు, వ్యాకులతా నివారిణులు (యాంటీ డిప్రెసంట్స్) వంటివి సూచించబడతాయి. అమెరికా ఆహార, ఔషధ నిర్వహణా సంస్థ-FDA చే ఆమోదించబడిన వ్యాకులతా నివారిణి ఫ్లూక్సెటైన్ (Fluoxetine) మందు. ఇందుకు ఇతర రకాలైన చికిత్సల్లో భాగంగా కుంగుబాటును తగ్గించే “నడవడికకు సంబంధించిన మానసిక సలహా-సంప్రదింపుల చికిత్స (కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ), కుటుంబ-ఆధారిత చికిత్స, ఇంటర్పర్సనల్ మానసిక చికిత్స, పోషకాహార విద్య, మరియు ఆసుపత్రిలో ఉంచి ఇవ్వదగ్గ మానసికాది తదితర చికిత్సలు ఉన్నాయి.
బులీమియాను అధిగమించటానికి ఆహారాన్ని క్రమబద్ధంగా తినడం మరియు ఆహారసేవనాన్నినియంత్రించడం చాలా ముఖ్యం. కొన్ని సహాయ బృందాలు అందుబాటులో ఉన్నాయి, రోగి యొక్క ఇష్టము, ఎంపిక ప్రకారం ఈ బృందాల్లో చేరవచ్చు. చికిత్సకు సమయం పడుతుంది, కానీ బులీమియా పూర్తిగా నయమవుతుంది.