కార్సినోడ్ సిండ్రోమ్ - Carcinoid Syndrome in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 29, 2018

March 06, 2020

కార్సినోడ్ సిండ్రోమ్
కార్సినోడ్ సిండ్రోమ్

కార్సినోడ్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

న్యూరోఎండోక్రైన్ (neuroendocrine) అనే అసాధారణ నాడీ కణాలే కార్సినోడ్ గడ్డకురుపులు (కణితి). నరంలాంటి నాడీకణాలనుంచే కార్సినోడ్ గడ్డకురుపులు పుడతాయి. ఇవి  సర్వసాధారణంగా జీర్ణవ్యవస్థలో కనిపిస్తాయి. కొన్నిసార్లు, క్యాన్సర్ కార్సినోడ్ కణితులు గల్గిన వ్యక్తులు వారి వ్యాధికి సంబంధం లేని క్లిష్ట పరిస్థితులు మరియు లక్షణాలను ఎదుర్కొంటారు. ఈ పరిస్థితినే తరచూ “కార్సినోడ్ సిండ్రోమ్” గా  వివరించబడుతుంది - క్యాన్సినోడ్ కణితుల నుండి రసాయనాల స్రావం ఫలితంగా ఏర్పడే ఒక పరిస్థితి ఇది. కార్సినోడ్ సిండ్రోమ్ వ్యాధి లక్షణాలు శరీరంలోని వివిధ భాగాలలో, వివిధ రకాల వ్యక్తీకరణలతో సంభవించవచ్చు.

కార్సినోడ్ సిండ్రోమ్ ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కణితి ఎక్కడ ఉందో, మరియు దాని ద్వారా స్రవిరించబడిన రసాయనాల రకాన్ని బట్టి కార్సినోడ్ సిండ్రోమ్ లక్షణాలు  మారుతుంటాయి . దీని సాధారణ లక్షణాలు ఇలా ఉంటాయి.

కార్సినోడ్ సిండ్రోమ్ ప్రధాన కారణాలు ఏమిటి?

“కార్సినోడ్ కణితి” అనేది కార్సినోడ్ సిండ్రోమ్ యొక్క అన్ని లక్షణాలు మరియు ఈ సిండ్రోమ్కు కారణం. క్యాన్సర్ అంత్య దశలో ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది, అయితే కాన్సర్ యొక్క మునుపటి దశల్లో కూడా కార్సినోడ్ సిండ్రోమ్ సంభవించిన కేసులు కూడా ఉన్నాయి.

కార్సినోయిడ్ కణితులు సాధారణంగా పురీషనాళం, పెద్దప్రేగు, ప్రేగు, కడుపు లేదా ఆహారనాళం (జీర్ణవ్యవస్థ)లో కనిపిస్తాయి. ఈ కణితులు రసాయనాల్ని స్రవిస్తాయి, ఇది, క్రమంగా, కార్సినోడ్ సిండ్రోమ్ లక్షణాలకు కారణమవుతుంది. అన్ని కార్సినోడ్ కణితులు సిండ్రోమ్కు కారణం కావు, ఎందుకంటే వాటిలో అన్నీ రసాయనాల్ని స్రవించవు కాబట్టి.

తరచుగా, రసాయనాలు రక్తాన్ని చేరుకోవడానికి ముందే కాలేయం ద్వారా తటస్థీకరించబడతాయి, అటుపై రుగ్మత లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో, రసాయనాల తటస్థీకరణకు కణితి నుండి చాలా దూరం ఉండవచ్చు, లేదా కణితి కాలేయంలో ఉండవచ్చు లేదా దానికి (liver) వ్యాప్తి చెంది ఉండవచ్చు, దీనివల్ల  రసాయనాలు రక్తప్రవాహంలోకి చేరడం మరియు కార్సినోడ్ సిండ్రోమ్ లక్షణాలను కలిగించడం జరుగుతుంది.

కార్సినోడ్ సిండ్రోమ్ ను నిర్ధారించేదెలా మరియు దీనికి చికిత్స ఏమిటి ?

ఈ క్యాన్సర్ చికిత్సకు వైద్యం చేసే చాలా మంది నిపుణులు రోగి యొక్క చరిత్రను తెల్సుకుని చాలా కష్టం లేకుండా ఈ  సిండ్రోమ్ను నిర్ధారించగలరు. అయినప్పటికీ, అతిసారం వంటి కడుపుకు సంబంధించిన ఇతర సమస్యలెవీ లేదని నిర్ధారించుకోవడానికి కొన్ని పరీక్షలు నిర్వహించవచ్చు. ఆ నిర్ధారణగా పరీక్షలు ఇలా ఉంటాయి:

  • కార్సినోయిడ్ కణితుల ద్వారా విడుదలయ్యే సెరోటోనిన్ ఉనికిని పరీక్షించడానికి మూత్ర పరీక్ష
  • కార్సినోయిడ్ రసాయనమైన “క్రోమోగ్రానిన్ ఎ” ని గుర్తించేందుకు రక్త పరీక్ష
  • కణితిని గుర్తించడానికి CT స్కాన్లు మరియు ఇమేజింగ్ పరీక్షలు, దీనిద్వారా వ్యాధి  వ్యాప్తిని తనిఖీ చేయడం జరుగుతుంది.

ఈ సిండ్రోమ్కు నిజమైన చికిత్స లేదు, దానికి బదులుగా, క్యాన్సర్ కు చికిత్సఉంది. ఇందుకు ఎంచుకున్న పద్ధతులు ఇలా ఉన్నాయి:

  • శస్త్రచికిత్స ద్వారా తొలగింపు
  • చర్మం వేడెక్కడాన్ని, మరియు అతిసారం తగ్గించడానికి ఆక్క్ట్రియోడ్ మరియు లాన్రెయోటిడ్ వంటి సూది మందులను రోగికి ఎక్కించడం జరుగుతుంది, తద్వారా, గడ్డ పెరుగుదల వేగం తగ్గుతుంది.  
  • క్యాన్సర్ కణాలకు రక్తం సరఫరాను నిరోధించే “హెపాటిక్ ఆర్టరీ ఎంబోలేజేషన్” ద్వారా కాలేయానికి రక్తం సరఫరాను ఆపు చేయడం
  • కాలేయంలోని క్యాన్సర్ కణాల్నిశీతలీకరించి స్తంభింపజేయడానికి ‘క్రయోథెరపీ’ శీతల వైద్య చికిత్సను ఉపయోగించడం మరియు వాటిని వేడి ద్వారా చంపడానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ను ఉపయోగించడం
  • ఇంటర్ఫెరోన్ అల్ఫా ఉపయోగించి రోగనిరోధక వ్యవస్థను పెంచడం, ఇది కణితుల పెరుగుదలను తగ్గిస్తుంది మరియు వ్యాధి లక్షణాల నుండి రోగికి ఉపశమనాన్ని కల్గిస్తుంది.
  • క్యాన్సర్ వ్యాధికి కెమోథెరపీ



వనరులు

  1. Niederhuber JE, et al., eds. Cancer of the endocrine system. In: Abeloff's Clinical Oncology. 5th ed. Philadelphia, Pa.: Churchill Livingstone Elsevier; 2014
  2. Feldman M, et al. Neuroendocrine tumors. In: Sleisenger and Fordtran's Gastrointestinal and Liver Disease: Pathophysiology, Diagnosis, Management. 10th ed. Philadelphia, Pa.: Saunders Elsevier; 2016.
  3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Carcinoid syndrome
  4. Pandit S, Bhusal K. Carcinoid Syndrome. [Updated 2019 Apr 8]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
  5. National Institutes of Health [Internet]. U.S. Department of Health & Human Services; Carcinoid tumor.

కార్సినోడ్ సిండ్రోమ్ కొరకు మందులు

Medicines listed below are available for కార్సినోడ్ సిండ్రోమ్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.