శాంక్రోయిడ్ అంటే ఏమిటి?
శాంక్రోయిడ్ అనేది జననేంద్రియాలలో పుండ్లు ఏర్పడడానికి కారణమయ్యే ఒక అత్యంత వేగంగా సంక్రమించే ఒక అంటువ్యాధి వ్యాధి. హేమోఫిలస్ డ్యూక్రియి (Haemophilus ducreyi) అని పిలవబడే బ్యాక్టీరియా శాంక్రోయిడ్ కారణమవుతుంది. ఇది లైంగిక పరంగా లేదా లైంగిక పరంగా కాకుండా కానీ వ్యాపిస్తుంది. సున్తీ చేయించుకున్న పురుషులు మరియు స్త్రీల కంటే సున్తీ చేయించుకోని పురుషులలో ఇది సర్వసాధారణం మరియు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో సెక్స్ వర్కర్లలో సాధారణంగా ఇది కనిపిస్తుంది. హ్యూమన్ ఇమ్మ్యునోడైఫిసియన్సీ వైరస్ (హెచ్ఐవి) వ్యాప్తి చెందే ప్రమాద కారకాలలో శాంక్రోయిడ్ ఒకటి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
శాంక్రోయిడ్ యొక్క లక్షణాలు వ్యాధికారక బాక్టీరియా సోకిన నాలుగు రోజుల లోపు కనిపిస్తాయి, కానీ అరుదుగా మూడు రోజుల లోపు కూడా లక్షణాలు బయటపడతాయి. చీముతో నిండిన ఎర్రటి గడ్డను సంక్రమణ యొక్క ప్రాంతంలో గుర్తించవచ్చు, అది జననేంద్రియ ప్రాంతం లేదా పాయువు ప్రాంతంలో కావచ్చు. అప్పుడు ఆ గడ్డ తెరవబడ్డ పుండులా మారి, అంచులలో ఒరిసిపోతుంది మరియు ఆ పుండు మెత్తగా ఉంటుంది. తరచుగా ఈ పుండు మహిళలలో ఏ లక్షణాలను చూపడు, కానీ పురుషులలో చాలా బాధాకరమైనదిగా ఉంటుంది. పురుషులు నొప్పి మరియు వాపును గజ్జలలో చుట్టూ ఉండే శోషరస కణుపుల (lymph nodes) మీద కూడా అనుభవిస్తారు, సాధారణంగా ఒక వైపు మాత్రమే ఉంటుంది కానీ కొన్నిసార్లు రెండు వైపులా సంభవించవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
శాంక్రోయిడ్ ఈ క్రింది వాటి వలన కలుగుతుంది:
- శాంక్రోయిడ్ యొక్క తెరిచి ఉన్న పుండ్లను సూటిగా చర్మం ద్వారా తాకడం (Direct skin contact)
- ఒక శాంక్రోయిడ్లోని చీమును సూటిగా తాకడం
- వాణిజ్యపరమైన (commercial) సెక్స్ వర్కర్ల వంటి అధిక-ప్రమాదకరమైన వ్యక్తులతో శృంగారం
- బహుళ భాగస్వాములు ఉండడం
- శాంక్రోయిడ్ ఉన్న వ్యక్తి తో యోని, అంగ, లేదా నోటి సెక్స్
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స?
శాంక్రోయిడ్ను సాధారణంగా పుండు ప్రాంతం మరియు రక్తం నుండి నమూనాలను సేకరించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు. సేకరించిన నమూనాలను అప్పుడు శాంక్రోయిడ్ కలిగించే బాక్టీరియా యొక్క ఉనికిని కోసం పరీక్షలు నిర్వహిస్తారు. క్లినికల్ నిర్ధారణలో ఉండే ఖచ్చితమైన దశలు:
- జననేంద్రియ పుండు యొక్క ఉనికి కోసం శారీరక పరీక్ష
- శోషక కణుపుల (lymph nodes) వాపు, సాధారణంగా ఇది శాంక్రోయిడ్ లో కనిపిస్తుంది
- సిఫిలిస్ (syphilis) లేకపోవడం
- హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ పాలిమరెస్ చైన్ రియాక్షన్ (HSV PCR) టెస్ట్ ప్రతికూలంగా (negative) ఉంటుంది
ఒక అనుకూలమైన చికిత్స లక్షణాల యొక్క ఉపశమనం మరియు వ్యాధి వ్యాప్తిని నిరోధిస్తుంది. చికిత్సలో యాంటిబయోటిక్ థెరపీ ఉంటుంది, ఇది సంక్రమణను పూర్తిగా శుభ్రం చేస్తుంది. వైద్యులు అందించిన చికిత్స కోర్సును పూర్తిగా అనుసరించాలి. రోగి భాగస్వామికి కూడా చికిత్స అవసరం కావచ్చు. చికిత్స సమయం మరియు పుండు తగ్గడం అనేది పుండు యొక్క పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సున్తి పొందిన లేదా HIV- నెగటివ్ పురుషులలో కంటే సున్నతి లేని లేదా HIV- పాజిటివ్ పురుషులలో చికిత్స సమయం అనేది ఎక్కువగా ఉంటుంది.