పిల్లల్లో డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) అంటే ఏమిటి?
శరీరంలో తగినన్ని ద్రవాలు లేకపోవడం అనే ఒక స్థితి డీహైడ్రేషన్ లేదా నిర్జలీకరాణాన్ని సూచిస్తుంది.పిల్లలో డీహైడ్రేషన్ లేదా నిర్జలీకరణము చాలా సాధారణం ఎందుకంటే వారు శరీరం నుండి ద్రవాలను త్వరితంగా కోల్పోయే పరిస్థితిని కలిగి ఉంటారు. అంతేకాక, పిల్లలు కొన్నిసార్లు దాహం లేదా డీహైడ్రేషన్ సంకేతాలను గుర్తించడంలో విఫలమవుతారు, లేదా వారు ఆ సంకేతాలను పట్టించుకోరు. ఆటలు ఆడుతున్నప్పుడు ఎక్కువగా చెమట పోవడం లేదా తరచూ మూత్రవిసర్జన కూడా డీహైడ్రేషన్ కు కారణం కావచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పిల్లల్లో డీహైడ్రేషన్ యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
- నెమ్మదితనం లేదా బద్ధకం
- చిరాకు
- మూత్రవిసర్జన తగ్గుదల
- ఏడుస్తున్నపుడు కన్నీరు లేకపోవడం, కళ్ళు పొడిగా మారడం
- శిశువుల తల పై గుంటలా ఏర్పడిన ఒక సున్నితమైన మచ్చ
- లోపలి పోయిన కళ్ళు
- నోటి యొక్క శ్లేష్మ (mucous) పొరలో జిగురు లేదా పొడిబారడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పిల్లలలో డీహైడ్రేషన్ లేదా నిర్జలీకరణం అనేది అనేక కారణాలు వల్ల ఉండవచ్చు. వీటిలో కొన్ని:
- ఆటలు ఆడుతున్నప్పుడు అధికంగా చెమట పట్టడం లేదా వేడి వాతావరణం
- వాంతులు, జ్వరం మరియు / లేదా అతిసారం
- నోటి పూతల లేదా పుళ్ళు, ఇవి తినడానికి లేదా త్రాగడానికి కష్టంగా చేస్తాయి
- సాల్మోనెల్లా (salmonella) వంటి బాక్టీరియల్ అంటువ్యాధులు లేదా జియార్డియాసిస్ (giardiasis) వంటి పరాన్నజీవి సంక్రమణలు (parasitic infections)
- సిస్టిక్ ఫైబ్రోసిస్ (cystic fibrosis) లేదా సియోలియాక్ (coeliac)వ్యాధి
- తరచూ మూత్రవిసర్జన - తరచుగా మధుమేహం వలన కానీ, మూత్ర నాళ సంక్రమణ వలన కానీ, మూత్రపిండాల రాళ్ళు కారణంగా కానీ
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యుల ద్వారా శారీరక పరీక్ష సాధారణంగా పిల్లలలో డీహైడ్రేషన్ లేదా నిర్జలీకరాణాన్ని నిర్ధారించడానికి సరిపోతుంది. అయినప్పటికీ, వైద్యులు ఏ రకమైన అంటువ్యాధులను లేదా ఎలెక్ట్రోలైట్ అసాధారణతలను తనిఖీ చేయడానికి మరియు మూత్రవిసర్జన తరచుగా ఉంటే రక్త చక్కెర స్థాయిలను పరిశీలించడానికకీ రక్త పరీక్షలను కూడా సూచించవచ్చు. మూత్ర నమూనాలను సేకరించి మూత్రాశయ అంటువ్యాధులు మరియు మధుమేహం కోసం తనిఖీ చేయవచ్చు. ఛాతీ ఎక్స్-రే, మల సాగు (stool culture) లేదా రోటవైరస్ పరీక్ష కూడా ఆదేశించవచ్చు.
డీహైడ్రేషన్ కు ప్రధానమైన చికిత్స శరీరాన్ని మళ్ళి హైడ్రేట్ చెయ్యడం. శిశువుల్లో, తల్లులు తక్కువ వ్యవధితో తరచుగా పాలు ఇవ్వవసిందిగా సిఫార్సు చేయబడుతుంది. తేలికపాటి డీహైడ్రేషన్ సందర్భాలలో, వైద్యులు సాధారణంగా నోటి రీహైడ్రేషన్ని (oral rehydration) సిఫార్సు చేస్తారు, ఇవి ఇంటిలో నిర్వహించవచ్చు అలాగే బ్రెట్ ఆహారవిధానం (BRAT diet, అరటిపండు, అన్నం, ఆపిల్ మరియు బ్రెడ్ ఉంటాయి) వంటి కొన్ని స్వీయ-సంరక్షణ సూచనలు ఉంటాయి. కొబ్బరి నీరు, నిమ్మరసం, రసాలను, మజ్జిగ మరియు నీరు వంటి ద్రవ పదార్ధాలను తీసుకోవడం ప్రథమ చికిత్సగా అవసరం. బిడ్డకు ప్రతి కొన్ని నిముషాలకి నెమ్మది నెమ్మదిగా ద్రవములు ఇవ్వాలి.
మధ్యస్థ డీహైడ్రేషన్ కేసుల విషయంలో, 5 నుంచి 10 శాతం వరకు శరీర బరువును కోల్పోతారు, రీహైడ్రేట్ చేయడానికి వైద్యులు, నరాలలోకి (IV) ద్రవ పదార్ధాలను ఎక్కిస్తారు, మరియు అతను / ఆమె నోటి ద్వారా ద్రవాలను తీసుకోగలిగితే వారిని ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, శరీర బరువులో 15 శాతానికి పైగా బరువును కోల్పోతారు, పిల్లలను పరిశీలించడం కోసం సాధారణంగా ఆసుపత్రిలో ఉంచుతారు, IV ద్రవాలను ఎక్కిస్తారు మరియు వారిపై తరువాతి పరిశోధనలు చేయడం జరుగుతుంది.