కలరా అంటే ఏమిటి?
కలరా అనేది ఓ బాక్టీరియా (సూక్ష్మక్రిములు) సంక్రమణం. ఇది ముఖ్యంగా కలుషితమైన ఆహారం లేదా నీరు సేవించడం ద్వారా సంభవిస్తుంది. కలరా వస్తే అది ఆరోగ్యం పట్ల ఆందోళన పడాల్సిన సంగతే. మరియు ఇదొక ప్రధాన సామాజిక అభివృద్ధికి చెందిన సమస్య. శుభ్రమైన నీరు అందుబాటులో లేకపోవడం మరియు పారిశుద్ధ్య సౌకర్యాలలేమికి నెలవైన ప్రాంతాలు కలరా వ్యాప్తికి కారణమవుతాయి. కలరా అన్ని వయసులవారిని బాధిస్తుంది. ప్రతి సంవత్సరం 1.3 మిలియన్ల నుండి 4.0 మిలియన్ కలరా కేసులు సంభవిస్తాయి అని అధ్యయనాలు చెబుతున్నాయి.
కలరా ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కలుషితమైన ఆహారం లేదా పానీయం తీసుకొన్న తర్వాత 12 గంటల నుండి 15 రోజుల లోగా కలరా సూచనలు బయటకు కనబడ్డం జరుగుతుంది. కలరా సోకిన వ్యక్తి 1 నుండి 10 రోజుల వరకూ తన మలంలో ఈ వ్యాధికారక బ్యాక్టీరియాను కూడా విసర్జిస్తూండడం జరుగుతుంది, తద్వారా, కలరా ఇతరులకు కూడా సంక్రమించడం జరుగుతుంది. కలరా ప్రధాన లక్షణాలు:
- నీళ్ల అతిసారం (విరేచనాలు, వాటర్ డయేరియా)
- వికారం మరియు వాంతులు
- నిర్జలీకరణము (డిహైడ్రాషన్)
- ఎలక్ట్రోలైట్ (విద్యుద్వాహక లవణము) అసమతుల్యత
- కండరాల నొప్పి
- షాక్
చికిత్స చేయకపోతే, ఇది తీవ్రమైన నిర్జలీకరణానికి కారణమవుతుంది, తద్వారా ప్రాణాంతకం కూడా అవుతుందని ఈ వ్యాధి నిరూపించగలదు.
కలరా వచ్చిన పిల్లలలో, క్రింది లక్షణాలను చూడవచ్చు:
- స్పృహ లో మార్పు
- మూర్ఛలు (ఎపిలెప్టిక్ ఫిట్స్)
- కోమా
కలరా ప్రధాన కారణాలు ఏమిటి?
కలరా అనేది జీర్ణవ్యవస్థకు సంబంధించిన సంక్రమణం. “విబ్రియో కలరాయే” అనే సూక్ష్మ విషక్రిమి కారణంగా సంభవించేదే కలరా వ్యాధి. కలరా కారణంగా తీవ్రమైన భేదులు తడవలు తడవలుగా అవడం, తద్వారా శరీరంలో నిర్జలీకరణము చోటు చేసుకుని హాని కలగడం జరుగుతుంది. కాలరావల్ల కలిగే హానికర ప్రభావం చిన్న ప్రేగులలోని బ్యాక్టీరియా ఉత్పత్తి చేసిన జీవ విషాల వలన కల్గుతుంది. ఈ జీవ విషం (టాక్సిన్) సాధారణ సోడియం మరియు క్లోరైడ్ ప్రవాహం యొక్క బలహీనతకు కారణమవుతుంది, ఇది శరీరం నుండి నీటిని భారీగా స్రవింపజేసి, తద్వారా శరీరానికి ఏంతో అవసరమైన లవణాలు మరియు ద్రవాల వేగవంతమైన నష్టానికి దారితీస్తుంది.
ప్రమాద కారకాలు:
- పారిశుద్ధ్య సౌకర్యాలలేమితో కూడిన పరిస్థితులు
- కడుపులో ఆమ్లాలు (యాసిడ్ లు) తగ్గిపోతాయి లేదా పూర్తిగా అంతరించి పోతాయి.
- కలరా సోకిన వ్యక్తులతో నివసించడం
- ‘ఓ’ రకం రక్తం (Blood type O)
- వండని ఆహారాలు, శుభ్రపరచని ముడి ఆహార పదార్థాల సేవనం
కలరాని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
లక్షణాల తీవ్రతను బట్టి క్రింది పరీక్షలు చేయించుకోవటానికి మీ వైద్యుడు మీకు సలహా ఇస్తారు:
- రక్త పరీక్షలు: కృత్రిమ తెల్ల రక్త కణాలు, మరియు ఎలెక్ట్రోలైట్ స్థాయిలు తనిఖీకి.
- బ్లడ్ గ్లూకోజ్: గ్లూకోజ్ స్థాయిలు తీవ్రంగా తగ్గిపోవచ్చు, అందువల్ల దీర్ఘకాలిక అనారోగ్యం దాపరించొచ్చు.
- స్టూల్ స్పెసిమెన్: స్టూల్ స్పెసిమెన్లో విబ్రియో కోల్లెరను వేరుచేయడానికి మరియు గుర్తించడానికి.
- మూత్రపిండాల పనితీరు పరీక్షలు: మూత్రపిండాల పనితీరులో ఏవైనా సమస్యల తనిఖీకి
చికిత్స కిందివాటిని కలిగి ఉంటుంది:
- ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్: శరీరంలో కోల్పోయిన పోషకాలను మరియు నీటిని తిరిగి భర్తీ చేస్తుంది మరియు ద్రవం-విద్యుద్విశ్లేష్య సంతులనాన్ని పునరుద్ధరిస్తుంది.
- ఇంట్రావీనస్ ద్రవాలు: ద్రవం మరియు ఎలక్ట్రోలైట్ నష్టం యొక్క భర్తీకి.
- యాంటిబయోటిక్స్: తీవ్ర కలరా సందర్భాల్లో, అనారోగ్యం యొక్క వ్యవధిని తగ్గించడానికి మరియు భేది (మలం) పరిమాణాన్ని తగ్గించడానికి.
- జింక్ సప్లిమెంట్స్: వ్యాధి లక్షణాల్ని మెరుగుపర్చడానికి సూచింపబడుతుంది.
- టీకా: కలరా విషయంలో టీకా మందుల్నిఎక్కువగా ప్రయాణికులు, ఆరోగ్యశాఖ మరియు మానవతావాది కార్మికులకు, వ్యాధినిరోధకతకొరవడిన (ఇమ్యునోకాంప్రోమైజ్డ్) వ్యక్తులు మరియు తక్కువ కడుపు ఆమ్ల స్రావం కలిగిన వ్యక్తులకు ఇవ్వబడుతుంది.
స్వీయ రక్షణ చిట్కాలు ఇలా ఉంటాయి:
- తినడానికి ముందు మీ చేతులను కడగండి.
- మీరు బయటికి వచ్చినప్పుడల్లా, మీ చేతులను శుభ్రం చేయడానికి మీతోపాటు ఒక శానీటైసర్ ఉంచుకుని ఉపయోగించండి.
- వేడి నీరు మాత్రమే త్రాగాలి మరియు వేడిగా ఉండే ఆహారం, బాగా వండిన ఆహారాలు తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
- ముడి ఆహార పదార్ధాలను తినడం నివారించండి, ముఖ్యంగా వండని మాంసం లేదా చేపలు తినకండి .
- కలుషితమైన పాడి ఉత్పత్తులను తినకండి/సేవించకండి .
చురుకైన మరియు సరైన నిర్వహణతో కలరాకారక మరణాలు గణనీయంగా తగ్గినాయి.