కాంటాక్ట్ డెర్మటైటిస్ (చర్మవాపు) అంటే ఏమిటి?
స్పర్శతో కలిగే చర్మవ్యాధి లేక కాంటాక్ట్ డెర్మటైటిస్ ప్రపంచంలోని 15% నుంచి 20% మందిని బాధిస్తున్న చర్మ రోగ సమస్య. ప్రధానంగా ఇది దద్దుర్లు మరియు తీవ్రమైన దురదతో కూడుకుని శరీరం మొత్తం లేదా శరీరంలో కొన్ని భాగాలను బాధిస్తుంది. వాతావరణంలో మీకు దుష్ప్రభావం (ఎలర్జీ) కల్గించే పదార్థంతో మీ చర్మానికి స్పర్శ కలిగినపుడు ప్రతిచర్య ఏర్పడి దురద, ఎరుపుదేలిన దద్దుర్లు వస్తాయి, దీన్నే “స్పర్శతో కలిగే చర్మవ్యాధి” లేదా కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. ఈ చర్మవ్యాధి విషయంలో దేశ దేశానికి వైరుధ్యముంటుంది. ఆయా దేశ ప్రజల ఆచార వ్యవహారాలు, అలవాట్లు మరియు చుట్టుపక్కల పర్యావరణం మీద ఈ చర్మవ్యాధి ఆధారపడి ఉంటుంది. ఈ చర్మరోగం ఓ దుష్ప్రభావం (అలెర్జీ) లేదా మంట రేపేటువంటి ప్రకోపనకారి పదార్ధం కారణంగా వస్తుంది. రెండు రకాలైన కాంటాక్ట్ డెర్మటైటిస్ చర్మవ్యాధుల్లో అత్యంత సాధారణమైన చర్మవ్యాధి “ప్రకోపకారి స్పర్శ చర్మవ్యాధి” (Irritant contact dermatitis) అనేది ఒకటి (80%).
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణంగా అలెర్జీని కల్గించే అలెర్జీ కారకాలు లేదా మంట కల్గించే పదార్థాలు మన శరీర భాగాలకు నేరుగా తాకినప్పుడు “స్పర్శతో కలిగే చర్మవ్యాధి” (contact dermititis) వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడేందుకు కొన్ని నిమిషాలు లేదా కొన్ని గంటలు పడుతుంది. అలా వచ్చిన చర్మం మంట లేదా దురద రెండు నుండి నాలుగు వారాల వరకు ఉంటుంది. అలెర్జీ చర్మవ్యాధి రకం “స్పర్శతో కలిగే చర్మవ్యాధి” లేదా కాంటాక్ట్ డెర్మటైటిస్ (contact dermatitis) కింది వ్యాధి లక్షణాలను ప్రధానంగా కల్గి ఉంటుంది:
మంట రకం చర్మవ్యాధిలో కనిపించే వ్యాధి లక్షణాలు:
- కఠోరమైన సలుపు లేదా మండుతున్న బాధ
- చర్మం ఎర్రబడటం (erythema)
- చర్మం వాపు లేదా చర్మంపై పొట్టు ఊడిరావడం
“స్పర్శ దద్దుర్లు”గా పిలువబడే చర్మవ్యాధినే “హైవ్స్” అని కూడా అంటారు, ఇది తక్కువ సాధారణ చర్మవ్యాధి రూపం.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
రోజువారీ కార్యకలాపాల కారణంగా చర్మంపై చాలా ఒత్తిడి కలగడం వల్ల మంటతో కూడిన డెర్మటైటిస్ (dermititis) లేదా చర్మశోథ (చర్మవ్యాధి) వస్తుంది. దీనికి గల ఇతర కారణాలు:
- సబ్బులు, డిటర్జెంట్లు, ఆమ్లాలు, లేదా క్షారాలతో స్పర్శ కలిగినపుడు మంటతో కూడిన చర్మశోథలు మరింత తీవ్రమవుతాయి.
- అలెర్జీ-రకం అనేది జన్యుపరంగా ముడిపడి ఉంటుంది లేదా అంతకు ముందు ఒక అలెర్జీ కారకానికి బహిర్గతం కావడమో లేదా స్పర్శ ఏర్పడడం వలన సంభవించవచ్చు. ప్రధాన కారకాల్లో సౌందర్య ఉత్పత్తులు, మందులు, కొన్ని బట్టలు, ఆహారం, మొక్కలు, రబ్బరు మరియు విషంతో కూడిన తీగ మొక్క (పాయిజన్ ఐవీ) ఉన్నాయి.
- లోహాలు, సువాసనల వస్తువులు, యాంటిబాక్టీరియల్ మందులను మరియు ఫార్మాల్డిహైడ్, కొకమిడోప్రైపిల్ బీటాన్ మరియు పార్పెనిలిడిండియాన్ వంటి కొన్ని రసాయనాలతో సంపర్కం/స్పర్శ ఏర్పడడం చర్మశోథలకు కారణం కావచ్చు.
దీనిని ఎలా నిర్ధారణ చేసేద మరియు దీనికి చికిత్సఏమిటి?
కింది వాటి నుండి వ్యాధి నిర్ధారణ చేయబడుతుంది:
- వైద్య చరిత్ర: మంట కారకానికి బహిర్గతం అయిన సమయం మరియు వ్యవధి.
- భౌతిక పరీక్ష: వ్యాధి లక్షణాల యొక్క సాధారణ అంచనా మరియు దద్దుర్లు యొక్క నమూనాను కలిగి ఉంటుంది.
- ల్యాబ్ పరీక్షలు: సంక్రమణల్ని (ఇన్ఫెక్షన్ల) తనిఖీ చేయడానికి.
- సున్నితత్వాన్ని అంచనా వేయడానికి ప్యాచ్ పరీక్షలు జరుగుతాయి.
చికిత్సలు:
- పూతమందుగా ఉపయోగించే స్టెరాయిడ్లు- వాపు మరియు మంటను నియంత్రించడానికి
- యాంటీ-హిస్టామిన్స్- దురదను నియంత్రించడానికి
- పూతమందుగా ఉపయోగించే ఇమ్మ్యూనోమోడ్యులేటర్లు - రోగనిరోధక ప్రతిచర్యను నియంత్రించడానికి
- పూతమందుగా ఉపయోగించే యాంటీబయాటిక్స్
- దైహిక స్టెరాయిడ్స్ - స్థానిక స్టెరాయిడ్స్ పని చేయకపోతే మంట నియంత్రణకు ఇవి పని చేస్తాయి.
- ఫోటో థెరపీ అంటే, చర్మం ఒక నిర్దిష్ట తరంగదైర్ఘ్యం యొక్క వెలుగుకి బహిర్గతం అవటంవల్ల చర్మవ్యాధి సోకిన ప్రాంతం యొక్క వాపును తగ్గిస్తుంది.
స్వీయ రక్షణ చిట్కాలు ఉన్నాయి:
- తీవ్రమైన లక్షణాలతో కూడిన చర్మశోథకు ఒక చల్లని కాపడం వల్ల దురద నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.
- తేమ-నిలబెట్టుకోవడానికి లభించే లోషన్లు లేదా క్రీములు (సారాంశాలు) ఉపయోగించడం కూడా ఉపకరిస్తుంది.
- దురద లేదా మంట కలిగించే వస్తువు (ఏజెంట్) ను ఉపయోగించడం మానుకోండి.
- గోకడం నివారించడం ఉత్తమం.
- ఒక సౌకర్యవంతమైన చల్లని స్నానం చేయడంవల్ల దురద మరియు మంట నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.
- మంట కలిగించని బట్టతో చేసిన రక్షక చేతి తొడుగులు (protective hand gloves) మరియు దుస్తులను ధరించడం.
- వ్యాధి లక్షణాల్ని తీవ్రం చేసేవి మరియు చర్మం యొక్క రంగును మార్చేసేటు వంటి ఉపకరణాలను (accessories) ధరించడం మానుకోండి.----
జీవనశైలి మార్పులు త్వరిత పునరుద్ధరణలో ప్రయోజనం కల్గిస్తాయి మరియు సహాయపడతాయి:
- ధ్యానం
- యోగ
- విశ్రాంతి ప్రక్రియలు (Relaxation techniques)
(మరింత సమాచారం: చర్మ లోపాలు కారణాలు మరియు చికిత్స)