కార్నియల్ పుండు అంటే ఏమిటి?
కేరాటైటిస్ అని కూడా పిలువబడే కార్నియల్ పుండు, కంటిలోని కార్నియా యొక్క వాపు. భారతదేశంలో దాని యొక్క ప్రాబల్యం గురించి తెలియదు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:
- కంటిలో ఎరుపుదనం
- కంటి నొప్పి మరియు సలుపు
- కంటి నుండి స్రావాలు కారడం లేదా చీము
- కంటిలో చికాకు
- కన్నీళ్లు కారడం
- కాంతి సున్నితత్వం (Light sensitivity)
- మసకగా కనిపించడం
- కనురెప్పల వాపు
- కార్నియా మీద తెల్లని మచ్చలు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కార్నియల్ పుండు ఈ కింది వాటి వలన సంభవించవచ్చు:
- బాక్టీరియల్ సంక్రమణ (ఇన్ఫెక్షన్):
- కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించే వారిలో, ముఖ్యంగా అధిక సమయంపాటు వాడేవారిలో సాధారణంగా కనిపిస్తుంది.
- వైరల్ సంక్రమణ (ఇన్ఫెక్షన్):
- ముఖ్యంగా, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ (herpes simplex virus) కోల్డ్ సోర్స్ (cold sores) కలిగించేది.
- ఒత్తిడి, బలహీనపడిన రోగనిరోధకత, మరియు ఎండకి బహిర్గతం కావడం ద్వారా ప్రేరేపించబడుతుంది.
- ఫంగల్ సంక్రమణ (ఇన్ఫెక్షన్):
- స్టెరాయిడ్ కంటి చుక్కల ఉపయోగం లేదా కాంటాక్ట్ లెన్సు తప్పుగా ఉపయోగించడం కార్నియా యొక్క ఫంగల్ సంక్రమణలకు కారణమవుతుంది.
- పరాన్నజీవి (Parasitic) సంక్రమణ:
- ఏకాంతామిబిక్ (acanthamoebic) సంక్రమణల కారణంగా.
- కంటికి కాలిన గాయం లేదా మాములు గాయాలు.
ప్రమాద కారకాలు:
- కాంటాక్ట్ లెన్సు ఉపయోగం.
- కోల్డ్ సోర్స్ లేదా పొంగు చల్లడం (చికెన్ పోక్స్) వలన.
- స్టెరాయిడ్లతో కూడిన కంటి చుక్కల ఉపయోగం.
- కనురెప్పల రుగ్మతలు.
- కార్నియాకు కాలిన గాయం లేదా మాములు గాయాలు.
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ప్రారంభంలో ఒక సాధారణ కంటి పరీక్ష నిర్వహించబడుతుంది, దానిలో ఆరోగ్య చరిత్ర, ఇటీవలి కంటి గాయాల గురించి, మరియు కాంటాక్ట్ లెన్సు యొక్క ఉపయోగం గురించి తెలుసుకోవడం వంటివి ఉంటాయి. తదుపరి పరిశోధన కోసం ఉపయోగించే పరీక్షలు:
- స్లిట్ లాంప్ పరీక్ష.
- ఫ్లోరోసైన్ స్టెయిన్ (Fluorescein stain): కార్నియాలోని దెబ్బని పరిశీలించడానికి.
- కంటి స్రావాల యొక్క సాగు: సంక్రమణ యొక్క రకాన్ని గుర్తించడానికి.
- కాన్ఫోకల్ సూక్ష్మదర్శిని (Confocal microscopy): కార్నియాలోని ప్రతి ఒక్క కణం యొక్క చిత్రాన్ని అందిస్తుంది.
- హై-డెఫినిషన్ ఫోటోగ్రఫీ (High-definition photography).
కార్నియల్ పుండ్ల కోసం చికిత్సలో యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్, లేదా యాంటివైరల్ కంటి చుక్కలు ఉపయోగిస్తారు. సంక్రమణ యొక్క ఉపశమనం తరువాత, స్టెరాయిడ్ కంటి చుక్కలను ఇవ్వవచ్చు. నొప్పిని తగ్గించడానికి ఏవైనా నొప్పినివరుణులు అందించబడతాయి.
చూపుని పునరుద్ధరించడానికి కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ (corneal transplant) అనే ఒక శస్త్రచికిత్సా విధానం ఉంటుంది.
స్వీయ సంరక్షణ చిట్కాలు:
- మరింత నస్టాన్ని తగ్గించడానికి కంటి రక్షిత కళ్ళజోళ్ళను ధరించాలి.
- నిద్రించే ముందు కాంటాక్ట్ లెన్సులను తొలగించాలి.
- సంక్రమణను నిరోధించడానికి చల్లని నీటితో తరచుగా కళ్ళు కడగాలి.
శాశ్వత చూపు నష్టం లేదా అంధత్వాన్ని నివారించడానికి వెంటనే వైద్యుడుని సంప్రదించాలి.