కుషింగ్స్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
కుషింగ్స్ సిండ్రోమ్ అనేది హార్మోనల్ రుగ్మత, ఇది శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ అసమతుల్యత (సాధారణ కర్టిసోల్ స్థాయిలు కంటే ఎక్కువ) వలన సంభవిస్తుంది. ఒత్తిడిగా ఉండే సమయాలలో కార్టిసాల్ స్థాయిల పెరుగుతాయి అందువలన దానిని "ఒత్తిడి హార్మోన్" అని పిలుస్తారు. ఇది అంతర్గతంగా (అంతర్గత కారకాలు వలన) లేదా బాహ్యపరంగా (బాహ్య కారకాలు వలన) ఏర్పడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కుషింగ్స్ సిండ్రోమ్ తో ఒక మిలియన్ కు 40 నుండి 70 మంది వ్యక్తులు ప్రభావితమవుతున్నారని అంచనాలు సూచిస్తున్నాయి. జనాభా అధ్యయనాల ప్రకారం భారతదేశంలో దీని సాంభావ్యత సంవత్సరంలో ఒక మిలియన్ కు 0.7 నుండి 2.4 వ్యక్తుల వరకు ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
లక్షణాలు మారుతూ ఉండవచ్చు మరియు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి:
- ఊబకాయం, ఎక్కువగా పై శరీరంలో కనిపిస్తుంది
- చంద్రాకార ముఖం (Moon face)
- వీపు మీద బఫెలో హంప్ (Buffalo hump)
- క్రమరహిత రుతుస్రావం
- తగ్గిన శృంగార పటుత్వం
- కుంగుబాటు
- సైకోసిస్ ( ఒక తీవ్రమైన మానసిక రుగ్మత)
- మేధస్సులో రుగ్మతలు
- బలహీనమైన కండరాలు
- ఎముక పగుళ్లు
- పిల్లలలో పెరుగుదల సర్రిగా లేకపోవడం
పెద్దలలో, కుషింగ్స్ సిండ్రోమ్ సాధారణంగా 30 నుంచి 50 ఏళ్ల మధ్య సంభవిస్తుంది, ఐతే ఇది పిల్లలలో కూడా సంభవిస్తుంది. పురుషుల కన్నా మహిళల్లో కుషింగ్స్ సిండ్రోమ్ అధికంగా సంభవిస్తుంది (స్త్రీ పురుష నిష్పత్తి 3: 1 గా ఉంది). అసాధారణంగా కనిపించే లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి:
- సంక్రమణలు (ఇన్ఫెక్షన్)
- నిద్రలేమి
- చర్మం పలచబడి మరియు సాగిన గుర్తుల (stretch marks) కనిపిస్తాయి
- మహిళలలో బట్టతల
ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న ఇతర వ్యాధులు (అవకలన (differential) నిర్ధారణ):
- పాలిసిస్టిక్ అండాశయ సిండ్రోమ్ (PCOD).
- మెటబోలిక్ సిండ్రోమ్ (గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచే సమస్యల సంగ్రహం).
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ సిండ్రోమ్ పెరుగుదలకి ప్రధాన కారణం అధిక మోతాదు కార్టిసాల్, ముఖ్యంగా గ్లూకోకార్టికాయిడ్స్ (glucocorticoids) ను తరచుగా ఉపయోగించడం. కార్టిసాల్ ఈ కింది విధులను నిర్వహించడంలో ఉపయోగకరంగా ఉంటుంది:
- రక్తపోటు మరియు రక్త గ్లూకోజ్ స్థాయిలు నిర్వహింస్తుంది
- వాపు సమస్యలను తగ్గిస్తుంది
- శరీరంలో ఆహారాన్ని ఉపయోగపడే శక్తి లోకి మారుస్తుంది
ఏదేమైనా, అసమతుల్యత అనేది అసాధారణమైన కార్టిసోల్ స్థాయికి కారణమవుతుంది, ఇది దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది. ఇది అంతర్గతంగా లేదా బాహ్యపరంగా ఉంటుంది (సుదీర్ఘకాలం నోటి ద్వారా కార్టికోస్టెరాయిడ్స్ యొక్క ఉపయోగం).
ఇతర కారణాలు:
- పిట్యూటరీ గ్రంధిలో కణితులు
- ఏసిటిహెచ్(ACTH) హార్మోన్ను ఉత్పత్తి చేసే ఎక్టోపిక్ (Ectopic) కణితులు
- అడ్రినల్ గ్రంధిలో కణితులు
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
రోగనిర్ధారణ ప్రధానంగా వీటిని కలిగి ఉండవచ్చు:
- ఆరోగ్య చరిత్ర.
- శారీరక పరిక్ష.
- ల్యాబ్ పరీక్షలు.
గ్లూకోకార్టికాయిడ్లు ప్రధానంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆటోఇమ్యూన్ మరియు నియోప్లాస్టిక్ (కణుతుల) వ్యాధులకు ఉపయోగిస్తారు. అందువలన, రోగి యొక్క సరైన ఆరోగ్య చరిత్రను మరియు ముందు ఉపయోగించిన మందుల గురించి తెలుసుకోవడం అవసరం. ఇతర విశ్లేషణ పరీక్షలు కూడా నిర్వహించవచ్చు అవి:
- 24-గంటల కార్టిసోల్ రహిత మూత్ర ( A 24-hour urinary free cortisol, UFC).
- బాగా రాత్రి అయిన తర్వాత లాలాజల కర్టిసోల్ పరీక్ష (Late night-salivary cortisol).
- తక్కువ మోతాదు డెక్సామెథసోన్ అణిచివేత పరీక్ష (Low-dose dexamethasone suppression test, LDDST).
- పూర్తి రాత్రి డెక్సామెథసోన్ అణచివేత పరీక్ష (Overnight dexamethasone suppression test, ONDST).
- అడ్రినల్ గ్రంధుల యొక్క సిటి (CT) స్కాన్.
కుషింగ్ సిండ్రోమ్ కి కారణమైన అంతర్లీన సమస్యని విశ్లేషించడానికీ పరీక్షలు ఉన్నాయి అవి:
- కోర్టికోట్రోపిన్-రిలీజింగ్ హార్మోన్ టెస్ట్ (Corticotropin-releasing hormone test,CRH).
- హై-డోస్ డెక్మెమెథసోన్ అణిచివేత పరీక్ష (High-dose dexamethasone suppression test, HDDST).
- బైలాటరల్ ఇంఫిరియార్ పోట్రోసల్ సైనస్ శాంప్లింగ్ (Bilateral inferior petrosal sinus sampling, BIPSS).
కుషింగ్స్ సిండ్రోమ్ కొరకు చికిత్స ప్రణాళిక ఈ విధంగా ఉంటుంది:
- మందుల ద్వారా చికిత్స: ఈ సిండ్రోమ్ యొక్క అంతర్లీన కారణం పై ఆధారపడి మందులు ఈ క్రింది విధంగా ఇవ్వబడతాయి.
- స్టెరాయిడ్ ఉత్పత్తిని నిరోధించడం.
- గ్లూకోకోర్టికోయిడ్ రిసెప్టర్ ఇన్హిబిటర్స్ (Glucocorticoid receptor inhibitors).
- ఏసిటిహెచ్ (ACTH) విడుదలను సవరించడం.
- అడ్రినోలిటిక్ (Adrenolytic) మందులు.
- ఒకవేళ వ్యక్తి కర్టిసోల్ను గనుక తీసుకుంటుంటే, లక్షణాలు తగ్గించడానికి తక్కువ మోతాదు సూచించబడుతుంది.
- శస్త్ర చికిత్స:
- కణితి యొక్క శస్త్రచికిత్స లేదా అడ్రినల్ గ్రంధుల తొలగింపు సూచించబడవచ్చు.
- పిట్యూటరీ రేడియోథెరపీ (Pituitary radiotherapy).
స్వీయ సంరక్షణ చిట్కాలు:
- వైద్యులు సూచించిన ఔషధ నియమాన్ని పాటించాలి.
- మద్యం మరియు ధూమపాన వినియోగాన్ని మానుకోవాలి, ఎందుకంటే ఆ వ్యసనాలు మరింత హాని కలిగించవచ్చు మరియు సమస్యలకు దారి తీయవచ్చు.
- మంచి సమతుల్య ఆహార విధానాన్ని అనుసరించాలి లేదా ఒక ఆహార నిపుణుడిని సంప్రదించాలి.
- రోజూ తక్కువ తీవ్రత ఉండే వ్యాయామాలు చేయాలి, ఎందుకంటే అధిక తీవ్రత ఉండే వ్యాయామాలు లేదా క్రీడలను ఆడేటప్పుడు పగుళ్లు (fractures) ఏర్పడే ప్రమాదం ఉండవచ్చు.
- ఒత్తిడిని నివారించాలి అందువల్ల కార్టిసాల్ యొక్క అధిక ఉత్పత్తి తగ్గిపోతుంది.
పైన పేర్కొన్న చర్యలను క్రమంతప్పకుండా నేర్పుగా అనుసరిస్తూ మరియు అవసరమైనప్పుడు వైద్యుడికి సంప్రదిస్తూ ఉంటే కుషింగ్స్ సిండ్రోమ్ను నిర్వహించవచ్చు.