చర్మవాపు (డెర్మటైటిస్) - Dermatitis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 01, 2018

March 06, 2020

చర్మవాపు
చర్మవాపు

చర్మవాపు (డెర్మటైటిస్) అంటే ఏమిటి?

చర్మవాపు అనేది చర్మం యొక్క వాపు, ఇది కొన్ని సమస్యల సమూహముల వలన సంభవిస్తుంది. ఇది ఎక్కువగా పిల్లలను ప్రభావితం చేస్తుంది (ప్రపంచవ్యాప్తంగా 15% -23% కేసులు). అయితే, భారతదేశ పిల్లలలో దాని ప్రాబల్యం మరియు సంభవం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

అత్యంత సాధారణమైన చర్మవాపు రకాలు:

  • అటోపిక్ చర్మవాపు (Atopic dermatitis)
  • కాంటాక్ట్ చర్మవాపు (Contact dermatitis)
  • సెబోర్రిక్  చర్మవాపు (Seborrheic dermatitis)

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణ లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:

నిర్దిష్ట లక్షణాలు:

  • అటోపిక్ చర్మవాపు: శిశువుల్లో చూడవచ్చు, ముఖ్యంగా మోచేయి మరియు మోకాళ్ల యొక్క చర్మపు మడతలలో గమనించవచ్చు.
  • కాంటాక్ట్ చర్మవాపు: చర్మం యొక్క మంట లేదా చికాకు ఉంటుంది, చర్మ దద్దుర్లు కాలిన గాయల లాగా కనిపిస్తాయి, సలుపుతో కూడిన దురద ఉండవచ్చు.
  • సెబోర్రిక్  చర్మవాపు: చర్మం పొలుసుల వంటి మచ్చలతో ఎర్రగా మారుతుంది మరియు చుండ్రు కూడా సంభవించవచ్చు. శిశువుల్లో, ఇది తల మీద  కనిపిస్తుంది మరియు దానిని క్రేడిల్ క్యాప్(cradle cap) అని పిలుస్తారు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఏదైనా జన్యు అంశాలు, అలెర్జీలు, వివిధ రకాల అంతర్లీన ఆరోగ్య సమస్యలు లేదా చర్మవ్యాధి కారణమయ్యే ఏదైనా బాహ్య ఇరిటెంట్స్ (చికాకు పెట్టె పదార్దాలు) కారణం కావొచ్చు.

వివిధ రకాలైన చర్మవాపులు వాటి కారణాలతో ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • అటోపిక్ చర్మవాపు  జన్యు కారకాలు, రోగనిరోధకశక్తి  పనిచేయకపోవడం, బ్యాక్టీరియా దాడి లేదా బాహ్య కారకాలు వలన సంభవించవచ్చు.
  • పాయిజన్ ఐవీ, నికిల్ (nickel) ఉండే ఆభరణాలు, శుభ్రపరిచే ఎజెంట్లు, బలమైన వాసన కలిగిన సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు, మరియు సంరక్షణకారులు (preservatives) వంటి చికాకు పదార్ధాలు నేరుగా చర్మానికి తగిలినా కాంటాక్ట్ చర్మవాపుకు దారి తీయవచ్చు.
  • ఒత్తిడి, చల్లని మరియు పొడి వాతావరణం, వ్యక్తి చర్మం పై ఈస్ట్ ఉండడం వంటి అనేక కారణాల వల్ల సెబోర్రిక్  చర్మవాపు ఏర్పడుతుంది.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు సంకేతాలు మరియు లక్షణాల గురించి అడగవచ్చు. అలెర్జీ ప్యాచ్ పరీక్ష(allergic patch test) అనేది ఏ రకమైన అలెర్జీని గుర్తించడానికైనా  ఉపయోగపడే ప్రధాన విశ్లేషణ సాధనం. ఈ క్రింది పరీక్షల ను నిర్వహిస్తారు:

  • ప్రిక్ (Prick) లేదా రేడియోఆల్గోరోసర్బెంట్ (radioallergosorbent, RAST) పరీక్షలు.
  • చర్మ శ్వాబ్ సూక్షమజీవుల సాగు పరీక్ష కోసం (culture testing).
  • చర్మ  జీవాణుపరీక్ష (బయాప్సీ).

చికిత్స చర్మ వాపు /లక్షణాల యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది.

  • సమయోచిత స్టెరాయిడ్ క్రీమ్లు సాధారణంగా సూచించబడతాయి.
  • రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే సమయోచిత క్రీమ్లు కూడా సూచించబడవచ్చు.
  • కాంతి చికిత్స లేదా ఫోటోథెరపీ ఉపయోగించబడుతుంది.

స్వీయ సంరక్షణ చిట్కాలు:

  • సూచించని మందులు లేదా దురద వ్యతిరేక (anti-itch)  ఉత్పత్తులు జాగ్రత్తగా ఉపయోగించాలి.
  • చల్లని లేదా తడి కాపడం అనేది చర్మానికి ఉపశమనం కలిగించవచ్చు.
  • వేడినీటి స్నానం కూడా లక్షణాలను తగ్గించవచ్చు.
  • వాపు ఉన్న చర్మ ప్రాంతాన్ని గోకడం లేదా రుద్దడం మానుకోవాలి.

చర్మం అనేక పదార్థములను తరుచుగా స్మృసిస్తూ ఉండడం వల్ల చర్మవాపు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ప్రారంభ దశలోనే సరైన సంరక్షణ మరియు చికిత్స చేసినట్లయితే గరిష్ట ప్రయోజనాన్ని పొందవచ్చు.



వనరులు

  1. Yasha Upendra et al. The clinico-epidemiological profile of atopic dermatitis in residential schoolchildren: A study from South Chhattisgarh, India. Department of Dermatology; Year : 2017 Volume : 18 Issue : 4 Page : 281-285
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Eczema
  3. Australasian College of Dermatologists. Dermatitis/Eczema. Australia; [Internet]
  4. American Academy of Dermatology. Rosemont (IL), US; Atopic dermatitis
  5. National Eczema Association. Contact Dermatitis. San Marin Drive; [Internet]

చర్మవాపు (డెర్మటైటిస్) వైద్యులు

Dr. Deepak Argal Dr. Deepak Argal Dermatology
10 Years of Experience
Dr. Sneha Hiware Dr. Sneha Hiware Dermatology
6 Years of Experience
Dr. Ravikumar Bavariya Dr. Ravikumar Bavariya Dermatology
7 Years of Experience
Dr. Rashmi Nandwana Dr. Rashmi Nandwana Dermatology
14 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

చర్మవాపు (డెర్మటైటిస్) కొరకు మందులు

Medicines listed below are available for చర్మవాపు (డెర్మటైటిస్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.