డిఫ్తీరియా లేదా అంగుడువాపుఅంటే ఏమిటి?
డిఫ్తీరియా లేక అంగుడువాపు అనేది సూక్ష్మక్రిములు సంబంధించిన అంటువ్యాధి (బ్యాక్టీరియల్ వ్యాధి)ని సూచిస్తుంది. ఇది “కోరినే బాక్టీరియం డిఫ్తీరియా” అనే సూక్ష్మజీవికారణంగా వస్తుంది. డిఫ్తీరియా సాధారణంగా 1-5 సంవత్సరాల వయస్సు మధ్య పిల్లలను బాధిస్తుంది మరియు శీతాకాలంలో మరింత సాధారణంగా పిల్లలకు వస్తూ ఉంటుంది. ఈ సంక్రమణం గొంతు వెనుక భాగంలో మందంపాటి పొర (లేక కవరింగ్) ఏర్పడటానికి కారకమవుతుంది. దానితో తినడానికి లేదా మింగడానికి చాలా కష్టంగా ఉంటుంది. బాక్టీరియం సాధారణంగా ముక్కు మరియు గొంతును బాధిస్తుంది, కొన్ని సందర్భాల్లో, ఇది చర్మాన్ని కూడా సంక్రమించి బాధించవచ్చు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణంగా, బ్యాక్టీరియా సోకిన 1 నుండి 7 రోజులలోపు వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. అంగుడువాపు (డిఫ్తీరియా)లో గుర్తించిన సాధారణ వ్యాధి లక్షణాలు:
- జ్వరం
- చలి
- నిరంతరం దగ్గు
- చొంగ కార్చడం(డ్రూలింగ్)
- గొంతులో నొప్పి
- మింగడంలో కష్టం కలగడం
- ముక్కు నుండి రక్తం లేదా నీరు ధారాపాతంగా కారడం.
- చర్మంపై గాయాలు
డిఫ్తీరియా రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి?
సూక్ష్మజీవుల కారణంగా వచ్చిన వ్యాధి అంగుడువాపు గనుక ఈ రుగ్మత కల్గిన వ్యక్తి దగ్గు లేదా తుమ్ముల ద్వారా బయటికి వెలువడే సంక్రమణ శ్వాసకోశపు చుక్కల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంద. శ్వాస మార్గము ద్వారా ఈ వ్యాధికారక సూక్ష్మజీవి (బాక్టీరియం) ప్రవేశిస్తుంది కాబట్టి, సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు గొంతు లేదా ముక్కులో ఉత్పత్తి అవుతాయి.
ఈవ్యాధికారక సూక్ష్మజీవులు (బ్యాక్టీరియా) చర్మ గాయాలు లేదా రోగి వాడిన బట్టలు, పాత్రలు వంటి వస్తువుల (fomites) ద్వారా కూడా సంభవించవచ్చు (వ్యాధి సోకిన వ్యక్తి ఉపయోగించినన వస్తువులు వ్యాధికారక సూక్ష్మజీవులతో మలినమై ఉంటాయి).
డిఫ్తీరియాను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
డిఫ్తీరియా లేక అంగుడువాపున ను భౌతిక పరీక్ష ద్వారా మొదట్లో నిర్ధారణ చేయబడుతుంది. గొంతు ప్రాంతంలో చనిపోయిన కణజాలం నలుపు లేదా బూడిద రంగులో పూత పూయడాన్ని (infection) డాక్టర్ గ్రహించడానికి భౌతిక పరీక్ష సహాయపడుతుంది.
- గొంతు శ్వాబ్ (throat swab)ను ఉపయోగించి వ్యాధి విశ్లేషణ
- పూర్తి రక్త గణన పరీక్ష వంటి రక్తపరీక్షలు మరియు రసవిజ్ఞానపరీక్షలు (serological tests), అంగుడువాపు రుగ్మతకు ప్రతిరక్షకాలు, అంగుడువాపు రుగ్మతకు రక్షకపదార్థ జనకం (diphtheria antigen) మొదలైనవి
ఈ వ్యాధికి సరి అయిన సమయంలో రోగనిర్ధారణ చేయడం చాలా అవసరం, ఎందుకంటే మనుగడను నిర్ధారించడానికి ప్రారంభదశలోనే చికిత్స కీలకమైనది.
అంగుడువాపు (డిఫ్తీరియా) చికిత్సకు బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి చేయబడిన (శరీర విషమునకు విరుగుడు) క్రిమినాశకాల (anti-toxins) ను ఉపయోగిస్తారు.
వ్యాధి-కలిగించే బాక్టీరియాను చంపడానికి యాంటిబయోటిక్స్ను మందులు ఉపయోగిస్తారు.
ఈ మందులతో పాటు, అంగుడువాపు రుగ్మత అసౌకర్యాన్ని తగ్గించేందుకు ఇతర చర్యలు తీసుకోవాలి. వీటితొ పాటు చర్యలేవంటే:
- నరాలకు ద్రవాల్ని (intravenous) సిరంజి ద్వారా ఎక్కించడం
- మంచంపై పూర్తి విశ్రాంతి (bedrest) పొందడం
- శ్వాస ట్యూబ్ ను ఉపయోగించడం
- శ్వాసకోశంలో అడ్డంకుల్ని తొలగించడం
అంగుడువాపు (డిఫ్తీరియా) రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తుల్ని సాధారణంగా ఒంటరిగా ఉంచుతారు, ఎందుకంటే వ్యాధి ఇతరులకు సోకకుండా ఉండేందుకు. అంగుడువాపు వ్యాధి సోకిన ఆ వ్యక్తి నుండి ఆ వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందదు అని డాక్టర్ నిర్ధారించేంతవరకూ ఈ రోగంతో బాధపడేవారిని వేరుగానే ఉంచుతారు.