పొడి దగ్గు అంటే ఏమిటి?
విసుగు, చికాకు కలిగించే మరియు ఎటువంటి కఫం (phlegm) లేదా శ్లేష్మం (mucus) ఉత్పత్తి అవ్వని రకమైన దగ్గును పొడి దగ్గుగా పిలుస్తారు. ఇది సాధారణంగా గొంతులో ఒక గిలిగింత సంచలనాన్ని/అనుభూతిని కలిగించే విధంగా ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
పొడి దగ్గుకు ముడిపడి ఉన్న సంకేతాలు మరియు లక్షణాలు:
- శ్వాస ఆడకపోవుట
- జ్వరం మరియు చలి
- గొంతు నొప్పి
- రాత్రుళ్లు చెమటలు పట్టడం
- బరువు తగ్గడం
- వ్యాయామ సామర్ధత తగ్గిపోవడం (సులభంగా అలసిపోవడం)
- శ్వాస తీసుకునే సమయంలో ఈల శబ్దం
- గుండెల్లో మంట
- మింగడం లో కష్టం
దాని ప్రధాన కారణాలు ఏమిటి?
పొడి దగ్గు ప్రధానంగా ఈ క్రింది కారణాల వలన కలుగుతుంది:
- వైరల్ అనారోగ్యం (జలుబు, ఫ్లూ [ఇన్ఫ్లుఎంజా] లేదా వైరల్ సంక్రమణ తరువాత వచ్చే దగ్గు [వైరల్ అనారోగ్యం తరువాత కొన్ని వారాల పాటు దగ్గుఉంటుంది ])
- ఆస్తమా
- కోోరింత దగ్గు
- స్వరపేటిక యొక్క వాపు (స్వరపేటిక వాపు ) లేదా కొన్ని రకాల ఊపిరితిత్తుల వ్యాధులు (మధ్యంతర ఊపిరితిత్తుల వ్యాధి,interstitial lung disease)
- ధూమపానం
- అలెర్జీ రినైటిస్ (పెంపుడు జంతువుల చర్మం, పుప్పొడి లేదా దుమ్ము వంటి అలెర్జీ కారకాలను పీల్చడం వలన వచ్చే గవత జ్వరం) లేదా ఏదైనా బయటి పదర్థం పీల్చడం, ఇది చిన్న పిల్లలు మరియు శిశువులలో చాలా సాధారణం
- ఔషధ దుష్ప్రభావాలు (అధిక రక్తపోటుకు ఉపయోగించే యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్-ఎంజైమ్ [angiotensin-converting-enzyme,ACE] నిరోధకాలు)
- గ్యాస్ట్రో-ఎసిసోఫేగల్ రెఫ్లాక్స్ (Gastro-oesophageal reflux) లేదా పోస్ట్-నాసల్ డ్రిప్ (post-nasal drip, ముక్కు నుండి గొంతులోకి శ్లేష్మ స్రావాలు వెనుకకు వెళ్లడం)
- గురక మరియు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (నిద్రలో శ్వాస అందకపోవడం)
పొడి దగ్గు కొన్ని అసాధారణ కారణాలు:
- గుండె వైఫల్యాలు
- ఊపిరితిత్తుల క్యాన్సర్
- ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం (పల్మోనరీ ఎంబోలిజం)
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటీ?
ముందుగా, వైద్యులు దగ్గు మరియు ఏవైనా ఇతర లక్షణాల యొక్క వివరణాత్మక చరిత్రను గురించి తెలుసుకుంటారు, దాని తరువాత శారీరక పరీక్ష నిర్వహించబడుతుంది. వ్యక్తి యొక్క ఆరోగ్య చరిత్ర, వయస్సు మరియు శారీరక పరీక్షలో కనుగొన్న విషయాల పై ఆధారపడి, వైద్యులు ఈ క్రింది పరీక్షలను సూచిస్తారు:
- అలెర్జీ పరీక్షలు
- ఛాతీ ఎక్స్-రే
- గొంతు స్విబ్ ( గొంతు లోపలి నుండి ఒక నమూనాను సేకరించి, మరియు ఆ నమూనాను ఇన్ఫెక్షన్ల కోసం పరీక్షిస్తారు)
- పల్మనరీ ఫంక్షన్ పరీక్షలు (Pulmonary function tests)
పొడి దగ్గు చికిత్స దాని కారణం మీద ఆధారపడి ఉంటుంది (ఉదా., వైరల్ సంక్రమణ వలన దగ్గు సంభవిస్తే అది ఒక వారం లేదా రెండు వారాలలోపు దానికదే తగ్గిపోతుంది). పొడి దగ్గు ఉపశమనానికి వివిధ నివారణ చర్యలు ఉన్నాయి:
స్వీయ రక్షణ
- తేనె గొంతులో ఒక మృదువైన పూతలా (పొర) ఏర్పడి, పొడి దగ్గును ప్రేరేపించే, చికాకు నుండి ఉపశమనానికి సహాయపడుతుంది
- పుష్కలంగా ద్రవాలను సేవించాలి (వెచ్చని నీళ్లు, టీ, మొదలైనవి)
- ఉప్పు నీటితో నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి మరియు పొడి దగ్గును తగ్గించడంలో అది సహాయపడుతుంది
- పొడి దగ్గును ప్రేరేపించే కొన్ని మందుల వాడకాన్ని (ఏసిఇ నిరోధకాలు [ACE inhibitors], బీటా బ్లాకర్లు) ఆపివేయాలి. వైద్యున్ని సంప్రదించి వాటికి ప్రత్యామ్నాయ మందులను తీసుకోవాలి.
- నీటిని కొంచెం కొంచెముగా తాగడం అనేది దగ్గు కోరికను తగ్గిస్తుంది
- యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగిన మాత్రలు లేదా టానిక్లు లేదా లేహ్యల రూపంలో దగ్గుకు అణిచివేతలు [Cough suppressants] అందుబాటులో ఉన్నాయి, అవి వీటిని కలిగి ఉంటాయి:
- ఫోల్కొడైన్ (Pholcodine)
- డెక్స్ట్రోమిథోర్ఫాన్ (Dextromethorphan)
- కొడైన్ (Codeine)
- డైహైడ్రోకొడైన్ (Dihydrocodeine)
- పెంటాక్సీవిరైన్ (Pentoxyverine)
- జలుబు మరియు ఫ్లూ యొక్క కలయిక మందులు సాధారణంగా క్రింది వాటిని కలిగి ఉంటాయి:
- యాంటిహిస్టామైన్ (antihistamine)
- ఒక డికాంగిస్టెంట్ (decongestant, అడ్డంకులు ఉన్న లేదా ముకుసుపోయిన ముక్కు నుంచి ఉపశమనం పొందడం కోసం)
- పారాసెటమాల్ (Paracetamol)
- అలెర్జీ రినైటిస్ లేదా పోస్ట్ నాసల్ డ్రిప్ వలన సంభవించిన పొడి దగ్గుకు నాసల్ స్ప్రేలు మరియు ఇన్హేలర్లు ఉన్నాయి, అవి:
- సెలైన్ లేదా కార్టికోస్టెరాయిడ్ నాసల్ స్ప్రే
- కోర్టికోస్టెరాయిడ్ ఇన్హేలర్ ( నోటి ద్వారా ఔషధం పీల్చబడుతుంది)
- గ్యాస్ట్రో-ఓసోఫ్యాగల్ రిఫ్లక్స్ (gastro-oesophageal reflux) వ్యాధి ఉన్న వ్యక్తులకు ఇచ్చే రిఫ్లక్స్ చికిత్స, వీటిని కలిగి ఉంటుంది:
- ఆమ్ల స్రావాన్ని నిరోధించే మందులతో చికిత్స (ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ల వంటివి)
- నిద్రపోయే ముందు తినకపోవడం మరియు పడుకున్నప్పుడు తలను పైకి పెట్టడం వంటి స్వీయ-సంరక్షణ చర్యలు పాటించడం