రక్త విరేచనాలు అంటే ఏమిటి?
రక్త విరేచనాల రుగ్మతలో పెద్దప్రేగులు శోథను (వాపు, మంట) కలిగి ఉంటాయి, ఇది చీము (శ్లేష్మం) మరియు రక్తంతో కూడుకున్న విరేచనాలకు (మలవిసర్జనకు) కారణమవుతుంది. ఈ విరేచనాలు రెండు రకాలు: బాక్టీరియా విరేచనాలు మరియు అమోబిక్ విరేచనాలు. షిగెల్లా లేదా ఇషీరిచియా కోలి ( ఈ. కోలి ) వంటి క్రిములవల్ల బాక్టీరియా విరేచనాలు సంభవిస్తాయి. అమోబియా రక్తవిరేచనాల్లో వ్యాధికారక సూక్ష్మజీవి ప్రోటోజోవన్ ఎంటమోబా హిస్టోలిటికి- E. హిస్టోలిటికా (protozoan Entamoeba histolytica).
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చీము రక్తంతో కూడిన విరేచనాలు సాధారణంగా అనాగ్యవాతావరణంలో లేదా తక్కువ పారిశుధ్య పరిస్థితులలో సంభవిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ భారతదేశం మరియు దేశం యొక్క పట్టణ మురికివాడలలో రక్తవిరేచనాలు సంభవిస్తుంటాయి. ఈ వ్యాధిలో అడపాదడపా (విడిచి విడిచి పడే మలబద్దకం) మలబద్ధకం మరియు నీళ్ల విరేచనాలు ఉంటాయి. దీనివల్ల సాధారణంగా అనుభవించే లక్షణాలు ఇలా ఉంటాయి
- మలవిసర్జనలో నీళ్ల విరేచనాలు లేదా పేలవంగా ఉండే మలం
- మలంలో చీము మరియు రక్తం పడడం
- మలవిసర్జన సమయంలో నొప్పి
- జ్వరం
- వికారం
- ఎక్కువసార్లు మలవిసర్జన కావడం లేదా భేదులు
రక్త విరేచనాల వ్యాధిని తరచుగా అతిసారం (నీళ్ళ విరేచనాల) వ్యాధితో ముడిపెట్టే పొరబాటు జరుగుతూ గందరగోళం సృష్టి అవడం జరుగుతుంది. ఏది ఏమయినప్పటికీ, అతిసారం అనేది కొన్ని సంక్రమణకారక (ఇన్ఫెక్టివ్) ఏజెంట్ల నుండి విడుదలయ్యే జీవాణువిషాల (టాక్సిన్స్) వల్ల కలుగుతుంది, మరియు రోగులు రెండు వ్యాధులలోనూ పేలవంగా ఏర్పడే మలాన్ని విసర్జిస్తున్నప్పటికీ మలం పూర్తిగా చీము రక్తంతో కూడుకుని ఉండదు.
ఈ రక్త విరేచనాల వ్యాధికి చికిత్స చేయకపోతే, పెద్దప్రేగులో వచ్చే పూతలకు దారితీసే పెద్దప్రేగుపుండ్లకు (ulcers) దారితీయడం కొందరు రోగుల విషయంలో గమనించవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ రక్తవిరేచనాల వ్యాధి ఈవ్యాధికారక సూక్ష్మజీవులు సోకిన నీరు మరియు ఆహారాన్ని సేవించడంవల్ల సంభవిస్తుంది. మనం తీసుకునే ఆహారం వ్యాధికారక సూక్ష్మజీవులను కలిగి ఉన్న మలపదార్థాలతో కలుషితమవుతుంది, అందుకే రక్తవిరేచనాలు కలుగుతాయి. ఈ కలుషితాన్ని బట్టి, విరేచనాలు రెండు రకాలుగా ఉంటాయి:
- బ్యాక్టీరియా విరేచనాలు - ఇది బాక్టీరియా E.coli లేదా షిగెల్లా యొక్క నాలుగు వేర్వేరు జాతుల వలన సంభవించింది
- అమోబిక్ లేదా అమోబియా రక్త విరేచనాలు - ఇది ప్రోటోజోవన్ E. హిస్టోలిటికా వలన సంభవిస్తుంది. (మరింత సమాచారం: అమీబియాసిస్ చికిత్స)
ఈ రెండు రకాలైన రక్తవిరేచనాల వ్యాధులలో, సంక్రమణ కింది కారకాల వల్ల వ్యాపిస్తుంది
- సంక్రమణ సోకిన తాగునీరు
- తినడానికి ముందు పరిశుభ్రతను పాటించకపోవడం
- సంక్రమణ సోకిన ఆహారం తినడం
- రక్తవిరేచనాల వ్యాధి సోకిన వ్యక్తితో నోటి-సంబంధమైన లైంగికచర్య లేదా ఆసన సంబంధమైన సంభోగం జరపడంవల్ల
దీన్నిఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ఈ రక్తవిరేచనాల వ్యాధి కింద పేర్కొన్న కొన్ని సాధారణ ప్రయోగశాల పరీక్షలచే నిర్ధారణ చేయబడుతుంది
- స్టూల్ పరీక్ష మరియు దాని సూక్ష్మజీవుల సాగు (microbial culture)
- ఇమ్యునోక్రోమాటోగ్రాఫిక్ డిప్స్టిక్ టెక్నిక్
- ఒకవేళ మలంలో రక్తం పడడం కొనసాగుతూనే ఉంటే ఎండోస్కోపీ పరీక్ష
భారతదేశంలో మే నుండి అక్టోబర్ నెలలలో వచ్చే వర్షాకాలంలో సర్వత్ర వ్యాపించే అంటువ్యాధిగా రక్తవిరేచనాలు సంభవిస్తూండడంతో ఈ వ్యాధి చికిత్సకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టమైన మార్గదర్శకాలను అందించింది:
- పునః జలీకరణము (rehydration) ద్వారా వ్యాధివల్ల కోల్పోయిన నీరు మరియు ఎలెక్ట్రోలైట్స్ ను రోగగ్రస్తులకందించడం. (మరింత సమాచారం: రోజులో ఎంత నీరు త్రాగాలి)
- బాక్టీరియాను తొలగించడానికి యాంటిబయోటిక్ చికిత్స
- ప్రోటోజోవా సంక్రమణను నివారించడానికి యాంటీప్రోటోజోల్స్ చికిత్స
సాధారణంగా, 5-8 రోజుల చికిత్స వ్యాధి లక్షణాలను నిర్వహించడానికి సరిపోతుంది. వైద్యుని సలహా లేకుండా యాంటీబయాటిక్స్ ను దీర్ఘకాలంపాటు ఉపయోగించడం ఔషధ నిరోధకతకు దారి తీస్తుంది. ఇందుకుపయోగించే మందులు ఖరీదైనవి కాదు మరియు చికిత్స కూడా నొప్పితో కూడుకొన్నదేం కాదు. కొన్ని స్వీయ రక్షణ చిట్కాలు మరియు నివారణ చిట్కాలు రక్తవిరేచనాలు పునరావృతం కావడాన్ని నివారించడానికి సహాయపడుతుంది:
- ఆరోగ్యకరమైన ఆహారసేవన అలవాట్లను పాటించడం
- భోజనం చేసేందుకు ముందు చేతులు శుభ్రపరచుకోవడం
- బహిరంగ మలవిసర్జనను (open defecation) నివారించడం
- వేడి చేసి చల్లార్చిన నీటిని తాగడం
రక్త విరేచనాలు, సాధారణంగా సంభవించే వ్యాధే అయినప్పటికీ, పరిశుభ్రమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు సరైన ఔషధాల ద్వారా నియంత్రించవచ్చునని నిష్కర్షగా చెప్పవచ్చు.