చెవి వ్యాధి అంటే ఏమిటి?
చెవి వ్యాధి అంటే చెవిలో నొప్పి మరియు అసౌకర్యం నుండి పూర్తిగా వినికిడి శక్తిని కోల్పోవడం వరకూ ఎలాంటి చెవివ్యాధి లక్షణాలున్నా దాన్ని చెవివ్యాధిగా చెప్పవచ్చు. మన చెవులు మూడు భాగాలను కలిగి ఉంటాయి. అవి బాహ్య చెవి, మధ్య చెవి మరియు అంతర్గత చెవి. ఈ చెవి భాగాల ప్రధాన విధులు వినడం మరియు శరీరం యొక్క సంతులనాన్ని నిర్వహించడం. సాధారణంగా మనం ఎదుర్కొనే చెవి వ్యాధులు ఏవంటే చెవి వాపు లేదా మంట (otitis), చెవిలో హోరు లేక రింగింగ్ శబ్దం (tinnitus), చెవి మూసుకుపోవడం లేక చెవిలో మైనం, గులిమి లేక గుబిలి పేరుకుపోవడం, మెనియర్స్ వ్యాధి ( vertigo and tinnitus), చెవి యొక్క బూజు వ్యాధి లేక ఫంగల్ ఇన్ఫెక్షన్ (otomycosis), గాలి పీడనంలో కలిగే మార్పు వల్ల చెవికి గాయం (barotrauma), వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కంఠపు నరము యొక్క వాపు (vestibular neuritis), వృద్ధాప్యం వల్ల వినికిడి శక్తి నష్టం (presbycusis) మరియు చెవిలో అసాధారణమైన పెరుగుదల (cholesteatoma).
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చెవి వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు వ్యాధి లక్షణాల అధ్యయనాన్ని బట్టి మరియు చెవిలో వ్యాధి సోకిన భాగాన్ని బట్టి మారుతుంటాయి. ప్రధాన సాధారణ లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:
- చెవిలో నొప్పి కొన్నిసార్లు తలకు పాకుతుంది.
- ఎరుపుడెలడం మరియు వాపు ఏర్పడడం .
- చెవి నుండి ఉత్సర్గ, చీము కావచ్చు.
- మైకము మరియు సంతులనం నష్టం.
- చెవిలో హోరుమనే రింగింగ్ శబ్దం లేక జోరీగలాగా కొనసాగే ధ్వని.
- వినికిడి నష్టం.
- వికారం మరియు వాంతులు.
దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?
వివిధ చెవి వ్యాధులకు ప్రధాన కారణాలు క్రింది విధంగా ఉంటాయి:
- బాక్టీరియల్ , ఫంగల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు.
- గాలి మరియు నీటి ఒత్తిడివల్ల ఆకస్మిక మార్పులు కారణంగా చెవికి గాయం కావడం.
- లోపలి చెవిలో కాల్షియం స్ఫటికాల యొక్క కదలికల కారణంగా సంతులన నష్టం.
- వినికిడిశక్తి నష్టం:పెద్ద ధ్వనులకు చెవులు నిరంతరంగా బహిర్గతమవడం, వయస్సు లేదా కొన్ని క్యాన్సర్ వృద్ధి కారణంగా కర్ణభేరి (లేదా చెవిగూబ) బలహీనపడటంవల్ల వినికిడి శక్తి నష్టం.
- కొన్ని మందులు చెవులలో హోరుమనే (ringing) శబ్దాన్ని కలిగిస్తాయి.
చెవి వ్యాధిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
చాలా చెవి వ్యాధుల సంకేతాలు మరియు లక్షణాలు సాధారణంగానే ఉంటాయి మరియు చెవి వ్యాధికి ఖచ్చితమైన రోగ నిర్ధారణ పొందడానికి, ENT (చెవి, ముక్కు మరియు గొంతు) నిపుణుడ్ని సంప్రదించి సలహా తీసుకోవాలి. ఇందుకు క్రింది రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు:
- నుమాటిక్ ఓటోస్కోప్ ఉపయోగించి చెవి పరీక్ష.
- చెవి ఉత్సర్గ పరీక్ష (చెవి నుండి కారే చీమును పరీక్షించడం).
- ఎకౌస్టిక్ రిఫ్లెక్టోమెట్రీ - కొన్ని శబ్ద పౌనఃపున్యాలను (sound frequencies) ఉపయోగించి మధ్య చెవి నుండి కారే చీము లేదా ఇతర ద్రవాన్ని గుర్తించడం.
- టింపనోమెట్రీ - వివిధ గాలి పీడనాలను ఉపయోగించి మధ్య చెవి మరియు కర్ణభేరి యొక్క పరిస్థితిని అంచనా వేయడం.
- ట్యూనింగ్ ఫోర్క్ పరీక్ష.
- ఆడియోమెట్రిక్ పరీక్ష .- ఈ పరీక్ష వినికిడి సామర్థ్యంను అంచనా వేయడానికి చేస్తారు.
- టిష్యూ బయాప్సీ
చెవి వ్యాధి యొక్క సరైన మరియు సమయానుసార రోగనిర్ధారణ చేసుకున్న పిమ్మట మీ ENT స్పెషలిస్ట్ మీ కోసం ఒక చికిత్స నియమాన్ని ఏర్పాటు చేస్తారు. చికిత్స సాధారణ మందుల నుండి కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స వరకు కూడా ఉంటుంది. కింద పేర్కొన్న సాధారణ చికిత్స ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
- చెవిలో పేరుకున్న గులిమి (గుబిలి) లేదా మైనం (Earwax) తొలగింపు
చూషణ (suction) ఉపయోగించి చెవిలో అడ్డుగా ఉండేదాన్ని తొలగించడం. - మందులు
సంక్రమణ వ్యాధిని మాన్పడానికి యాంటీ బాక్టీరియల్ చెవి చుక్కల మందు లేదా కడుపులోకి మింగించే (నోటి ద్వారా తీసుకునే) యాంటీబయాటిక్స్ మందులు. చెవి నొప్పిని నియంత్రించడానికి నొప్పి నివారణా మందులు (అనాల్జెసిక్స్). వికారం మరియు వాంతులను నిర్వహించడం కోసం యాంటీ-ఎమిటిక్స్ మందులు. - వినికిడికి ఉపకరణాలు
వినికిడి శక్తి నష్టాన్ని నిర్వహించడానికి వినికిడిశక్తిలో సహాయం చేసే హియరింగ్ ఎయిడ్ల ఉపయోగం. - శాస్త్ర చికిత్స (సర్జరీ)
శస్త్రచికిత్స సాయంతో క్యాన్సర్ పెరుగుదలను తొలగించడం. - కోక్లీయర్ ఇంప్లాంట్తీ
వ్రమైన వినికిడిశక్తి నష్టం చికిత్స కోసం కోక్లీయర్ ఇంప్లాంట్ ను ఉపయోగించడం. - వ్యాయామాలు
తల తిప్పుడు (vertigo or dizziness) సమస్యకు (repositioning) పునఃసృష్టి వ్యాయామాలు.
వాతావరణాది ఒత్తిడి వలన ఏర్పడిన చేవిగాయం లేదా పుండు (బారోట్రూమా) నుండి ఉపశమనం కోసం నమిలే జిగురుబంకల్ని (chewing gums) నమలడం లేదా ఆవలించడం వంటి సాధారణ పద్ధతులను అవలంభించడం.
స్నానం లేదా ఈత (swimming) తర్వాత చెవిని ఎండబెట్టడం వంటి కొన్ని సాధారణ నివారణ చర్యలు చెవి ఇన్ఫెక్షన్లు మరియు చెవిలో నొప్పి వంటి సమస్యల నుండి కాపాడుతుంది. చెవులు హోరెత్తించే బిగ్గరగ శబ్దాల్ని వినకపోవడం లేదా రక్షిత ప్లగ్లను (protective plugs) చెవికి పెట్టుకోవడంవల్ల వినికిడి నష్టం నుండి మిమ్మల్ని రక్షించగలదు. చెవికి సంబంధించిన ఎలాంటి సమస్య లేదా రుగ్మత మీకు ఎదురైనా దయచేసి గృహసంబంధమైన పరిష్కారాలను ప్రయత్నించకుండా, మీ వైద్యుడిని సంప్రదించి సంబంధిత రుగ్మతలకు సలహాలను చికిత్సను పొందండి.