మూర్ఛలు (ఫిట్స్) - Epilepsy in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

December 24, 2018

March 06, 2020

మూర్ఛలు
మూర్ఛలు

సారాంశం

మూర్చ అనునది చాలా కాలం పాటు ఉన్న లేక దీర్ఘ-కాల మెదడు రుగ్మత, అసాధారణ మెదడు చర్య వలన ఏర్పడుతుంది, ఈ చర్య మూర్చలు, అసాధారణ అనుభూతులు మరియు స్పృహ కోల్పోవడం వంటి వాటికి దారితీస్తుంది. మూర్చ అనునది వయస్సు, లింగము, జాతి లేక జాతి నేపధ్యముతో సంబంధము లేకుండా ఎవరి పైన అయినా ప్రభావమును చూపిస్తుంది.  మూర్చ యొక్క లక్షణాలు అనునవి ప్రారంభములో స్వల్పముగా ఉంటాయి, నిదానముగా అవయవాల యొక్క హింసాత్మక కుదుపులకు దారితీస్తాయి.  తక్కువ-ఆదాయ మరియు మధ్య-అదాయ దేశాలలో 75% ప్రజలు తగినంత చికిత్సను పొందలేరు మరియు వీరు సామాజిక నిందకు గురవుతారు మరియు ప్రంపంచము లోని అనేక ప్రాంతాలలో దీనిపై వివక్ష ఉంది.  మూర్చ యొక్క చికిత్స యాంటిపైలెప్టిక్ మందులను కలిగి ఉంటుంది, మరియు 70% మంది ప్రజలు ఈ మందులకు సానుకూలముగా స్పందించారు.  మందులు ఉపశమనాన్ని అందివ్వడములో విఫలమయిన సందర్భాలలో, శస్త్ర చికిత్స అనునది మూర్చను నియంత్రించుటకు సహాయం చేస్తుంది.  కొంత మంది వ్యక్తులు జీవితకాల చికిత్సను తీసుకోవాలి, వాటితో పాటు ఈ ట్రిగ్గర్ల కారకాలు తొలగించాలి, వాటిలో మెరిసే కాంతులు, పెద్ద శబ్దలు, నిద్ర లేమి మరియు అదనపు ఒత్తిడి అనునవి అత్యంత సాధారణ కారకాలు.

మూర్ఛలు (ఫిట్స్) అంటే ఏమిటి? - What is Epilepsy in Telugu

మూర్చ అనునది ఒక సాధారణ నరాల రుగ్మత, ఇది ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తముగా 50 మిలియన్ల కంటే ఎక్కువ మంది జనాభాను ప్రభావితం చేస్తుంది.  మధ్య నుండి తక్కువ-ఆదాయము గల ప్రాంతాలలో ఉన్న ప్రజలలో 80% కంటే ఎక్కువ మంది ప్రజలు మూర్చ చేత ప్రభావితం చేయబడుతున్నారు.  ఇది ఈ విధముగా వర్గీకరించబడింది మూర్చలు, ఇది మొత్తం శరీరమును లేక శరీరము యొక్క కొంత భాగమును నియంత్రించలేని కుదుపులకు గురిచేస్తుంది, మరియు కొన్నిసార్లు స్పృహ కోల్పోవడం మరియు మూత్ర నాళము పైన నియంత్రణ కోల్పోవడం మరియు విరేచనాలు వంటి లక్షణాలను కలిగిఉంటుంది. మూర్చ అనునది మెదడు కణాలలోని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ యొక్క అదనపు విడుదల కారణముగా ఏర్పడుతుంది.  ఈ ఘటనలు సంభవించే అంతరము ఒక సంవత్సరములో ఒకటి లేదా రెండు సార్ల నుండి ఒక రోజులో అనేక సార్ల వరకూ చోటు చేసుకోవచ్చు. 

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

మూర్ఛలు (ఫిట్స్) యొక్క లక్షణాలు - Symptoms of Epilepsy in Telugu

లక్షణాలు అనునవి మూర్చ ఏర్పడుటకు కారణమైన మెదడు పాల్గొన్న ప్రాంతము పైన ఆధారపడుతుంది. లక్షణాలలో ఇవి ఉంటాయి: 

  • స్పృహ లేకపోవడం
  • అయోమయము
  • ఒక బిందువు వద్ద మొదలుపెట్టుట
  • చేతులు మరియు కాళ్ళ చలనముల కుదుపు
  • చూపు, వినికిడి మరియు రుచి కలిగించు ఇంద్రియాలలో ఇబ్బందులు
  • భయం మరియు ఉత్కంఠ వంటి భావనా మార్పులు.

మూర్ఛలు (ఫిట్స్) యొక్క చికిత్స - Treatment of Epilepsy in Telugu

మూర్చ యొక్క చికిత్స ప్రధానముగా వీటిని కలిగి ఉంటుంది:

యాంటీ-ఎపిలెప్టిక్ మందులు 

యాంటీ-ఎపిలెప్టిక్ మందులు అనునవి సాధారణముగా చికిత్స కొరకు ఎంపిక చేయబడినవి.  70% కేసుల కంటే ఎక్కువైన కేసులలో మూర్చలు లేక వాటి లక్షణాలను నియంత్రించడానికి లేక వాటి నుండి ఉపశమనమును పొందడానికి ఈ మందులు సహాయపడతాయని నివేదికలు చెబుతున్నాయి.  మెదడు ద్వారా విడుదలచేయబడిన రసాయనాల మొత్తమును మార్చడము ద్వారా మూర్చ యొక్క తీవ్రతను తగ్గించడానికి ఈ మందులు సహాయపడతాయి.  ఈ మందులు మూర్చను నయంచేయడానికి సహాయం చేయనప్పటికీ, ఇవి క్రమముగా తీసుకునే చికిత్స ఎపిసోడ్స్ యొక్క సంఖ్యను తగ్గించడానికి సహాయపడతాయి.  ఈ మందులు అనేక రూపాలలో లభిస్తాయి. చికిత్స యొక్క ప్రారంభములో తక్కువ డోసును తరచుగా ఇస్తారు మరియు ఈ డోసును ఎపిసోడ్స్ ముగిసేవరకు క్రమముగా పెంచుతారు.  గణనీయమైన మార్పు లేదా మెరుగుదల లేకుంటే డాక్టరు మందులను మార్చవచ్చు. మందుల యొక్క రకము అనునది మూర్చ యొక్క రకము పైన ఆధారపడుతుంది, మరియు ఈ మందులు ఫిజిషియన్ ద్వారా మాత్రమే సూచించబడతాయి.  ఒకవేళ వ్యక్తి గనక ఏవైనా ఇతర మందులు తీసుకుంటూ ఉంటే, ఆ విసషయాన్ని వైద్యుడికి తెలియజేయాలి.

ఈ మందుల యొక్క దుష్ప్రభావాలలో ఇవి చేరి ఉంటాయి:

ఒకవేళ అటువంటి దుష్ప్రభావాలు ఏవైనా ఉన్నట్లయితే, ఆ విసషయాన్ని వైద్యుడి దృష్టికి తీసుకురావాలి. అందువల్ల, సూచించబడిన మందులనే ఖచ్చితంగా తీసుకోవడం చాలా మంచిది. మోతాదులో ఎటువంటి మార్పు ఉన్నా, లేదా మందు యొక్క జనరిక్ వెర్షన్ సైతమూ అయినా దాని గురించి డాక్టరుతో మాట్లాడండి. వైద్యుడి అనుమతి లేనిదే మందులు తీసుకోవడం ఆపివేయవద్దు. ప్రవర్తన లేదా భావనలో ఏవైనా మార్పులు ఉన్న పక్షములో, వాటి గురించి తెలియజేయాలి. కాలం గడిచే కొద్దీ, అనేక యాంటీ-ఎపిలెప్టిక్ మందుల వాడకాన్ని ఆపివేయవచ్చు మరియు వ్యక్తి ఎటువంటి లక్షణాలు లేకుండా జీవించవచ్చు.

శస్త్ర చికిత్స

ఒకవేళ మందులు గనక తగినంత ఉపశమనము ఇవ్వకపోతే, లేదా అనేక దుష్ప్రభావాలను గనక కలిగిస్తే, శస్త్రచికిత్స సలహా ఇవ్వబడవచ్చు. ఆపరేషన్ సందర్భంగా మెదడు యొక్క ప్రభావిత ప్రాంతము తొలగించబడుతుంది. శస్త్ర చికిత్స అనునది, మెదడు యొక్క చిన్న ప్రాంతము ప్రభావితమయినప్పుడు మాత్రమే నిర్వహిస్తారు మరియు ఈ ప్రాంతము సాధారణ శరీర చర్యలపైన ఏ విధమైన ప్రభావమును చూపదు, అనగా స్పీచ్(మాట), వినడం, నడక, ఇతరుల మోటార్ యాక్టివిటీ.

జీవనశైలి యాజమాన్యము

మూర్ఛలను అదుపు చేయడం చాలా ముఖ్యము, ఎందుకంటే అవి ప్రమాదకరం కావచ్చు మరియు చిక్కులను సృష్టించవచ్చు. 

  • మందులను క్రమం తప్పకుండా తీసుకోండి. డాక్టరు గారి అనుమతి లేకుండా ఏ మోతాదునూ వదిలివేయవద్దు లేదా ఆపివేయవద్దు.
  • నిర్భందకాలు లేక మూర్చకి కారణమయ్యే ట్రిగ్గర్స్ లను గుర్తించాలి.  అధిక సాధారణముగా ఉపయోగించే ట్రిగ్గర్లు ఆల్కహాలు, నిద్రలేమి, ఒత్తిడి, అధిక కాంతి, పెద్ద శబ్దాలు మరియు మరికొన్నింటిని కలిగిఉంటాయి.
  • మూర్చ ఎపిసోడ్లకు సంబంధించి ఒక డైరీని నిర్వహించాలి, దాని తీవ్రత మరియు ఎపిసోడ్లు ప్రారంభించక ముందు మీరు చేయుచున్న చర్యల యొక్క వివరాలతో పాటు కాలవ్యవధి కూడా ఇందులో నిర్వహించబడుతుంది.
  • కారణమయ్యే అంశాలను ఇలా డీల్ చేయండి:
    • త్వరగా నిద్రించడానికి ప్రయత్నించుట.
    • తేలిక శ్వాస వ్యాయామాలను నిర్వర్తించుట. 
    • మద్యపానమును తగ్గించుకొనుట
  • ఒకవేళ మూర్చ అనునది తరచుగా వస్తుంటే, డ్రైవింగ్, స్విమ్మింగ్ మరియు వంటచేయడం వంటి చర్యలను తొలగించాలి, ఎందుకనగా ఈ చర్యలు చేస్తున్న సమయములో ఒక వేళ మూర్చ ఏర్పడితే అది ప్రమాదానికి దారితీస్తుంది.
  • ఇంటిలో స్మోక్ డిటెక్టర్లను నెలకొల్పండి.
  • మృదువైన అంచులు ఉండే ఫర్నిచర్ ని వాడండి.
  • స్నానము చేయునప్పుడు డోర్ లాక్ చేసుకోవద్దు.
  • మూర్చ వచ్చినప్పుడు మునిగిపోకుండా నివారించడానికి స్నానానికి బదులుగా షవర్లను తీసుకోవాలి.
  • ఈత కొట్టడానికి ఒక సహచరుడితో కలిసి వెళ్ళండి, మూర్ఛ వచ్చిన పక్షములో వారు మిమ్మల్ని కాపాడగలుగుతారు.
  • బయటి క్రీడలలో పాల్గొనేటప్పుడు హెల్మెట్ ధరించండి
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹495  ₹799  38% OFF
BUY NOW


వనరులు

  1. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Epilepsy.
  2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Types of Seizures
  3. Oguni H. Epilepsy and intellectual and developmental disabilities.. Journal of Policy and Practice in Intellectual Disabilities. 2013 Jun;10(2):89-92. [Internet]
  4. healthdirect Australia. Head injuries. Australian government: Department of Health
  5. healthdirect Australia. What causes epilepsy?. Australian government: Department of Health
  6. Silverman IE, Restrepo L, Mathews GC. Poststroke seizures. Archives of neurology. 2002 Feb 1;59(2):195-201. PMID: 11843689
  7. Senthil Amudhan, Gopalkrishna Gururaj, Parthasarathy Satishchandra. Epilepsy in India I: Epidemiology and public health. Ann Indian Acad Neurol. 2015 Jul-Sep; 18(3): 263–277. PMID: 26425001
  8. Ottman R, Barker-Cummings C, Leibson CL, Vasoli VM, Hauser WA, Buchhalter JR. Accuracy of family history information on epilepsy and other seizure disorders. Neurology. 2011 Jan 25;76(4):390-6. PMID: 21263140
  9. Ding K, Gupta PK, Diaz-Arrastia R. Epilepsy after Traumatic Brain Injury. In: Laskowitz D, Grant G, editors. Translational Research in Traumatic Brain Injury. Boca Raton (FL): CRC Press/Taylor and Francis Group; 2016. Chapter 14
  10. National Health Service [Internet]. UK; Epilepsy.
  11. Duman P, Varoglu AO, Kurum E. The long-term prognosis of epilepsy patients with medically treated over a period of eight years in Turkey. Pakistan journal of medical sciences. 2017 Jul;33(4):1007. PMID: 29067083
  12. National Institute of Neurological Disorders and Stroke [Internet] Maryland, United States; Epilepsy Information Page.

మూర్ఛలు (ఫిట్స్) వైద్యులు

Dr. Hemant Kumar Dr. Hemant Kumar Neurology
11 Years of Experience
Dr. Vinayak Jatale Dr. Vinayak Jatale Neurology
3 Years of Experience
Dr. Sameer Arora Dr. Sameer Arora Neurology
10 Years of Experience
Dr. Khursheed Kazmi Dr. Khursheed Kazmi Neurology
10 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

మూర్ఛలు (ఫిట్స్) కొరకు మందులు

Medicines listed below are available for మూర్ఛలు (ఫిట్స్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.