కంటి గాయం అంటే ఏమిటి?
కంటి గాయం, పేరు సూచిస్తున్నట్లుగా, ఒక వైద్యసంభందమైన లక్షణం, దీనిలో వివిధ కారణాల వలన కంటి యొక్క ఆకృతి మరియు పనితీరు భంగపడుతుంది/ మార్చబడుతుంది. ఇది కంటి ఏ భాగానికైనా సంభవించే గాయాలకి ఉపయోగించే ఒక సమగ్ర పదం. కంటి గాయం ఒక వైద్య అత్యవసరం, ఇది దృష్టిని (చూపుని) కోల్పోయే ప్రమాదానికి దారితీస్తుంది.
దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కంటి గాయం యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
- నిరంతర కంటి నొప్పి
- కనుపాప ఆకారంలో అసమానత
- దృష్టి (చూపు) తగ్గిపోవడం
- మసక
- కళ్ళు రక్తం రంగులో కనిపించడం
- కళ్ళు మంటలు
- కంటి నుంచి నీరు కారడం
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
వివిధ కారణాల వలన కంటి గాయం సంభవించవచ్చు. వినోద కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నపుడు ఉండే గందరగోళ పరిస్థితి ప్రమాదాన్ని పెంచుతుంది.
బాక్సింగ్, రెజ్లింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్, టెన్నిస్ లేదా బాడ్మింటన్ వంటి క్రీడలను ఆడుతున్నప్పుడు కంటికి హాని కలగచవచ్చు.
అయితే, సాధారణ కారణాలు వీటిని కలిగి ఉండవచ్చు,
- కంటిలో కమిలిన గాయాలు అకస్మాత్తుగా దెబ్బ తగిలినప్పుడు లేదా కనురెప్పకు కాటు (తెగినప్పుడు) కలిగినప్పుడు కానీ ఏర్పడతాయి.
- ప్రకాశవంతమైన వెలుతురు ఉండే రేడియేషన్ మూలంగా కంటికి కాలిన గాయాల వంటి గాయాలు కలుగవచ్చు. అందువలన, అటువంటి పరిస్థితులలో పనిచేయవలసి వచ్చినప్పుడు రక్షణ కాళ్ళ అద్దాలు ధరించాలి.
- అసిడ్స్ (acids) మరియు ఆల్కలీల (alkali) పదార్ధాలు వంటి రసాయనిక పదార్థాల ఉపయోగం వలన రసాయన గాయాలు సంభవిస్తాయి.
ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?
కంటికి గాయం అయినప్పుడు, పైన సూచించిన సంకేతాలు మరియు లక్షణాలు ఏవైనా గమనిస్తే వెంటనే కంటివైద్య నిపుణుడిని సంప్రదించాలి.
ఒక కంటి నిపుణులు లక్షణాలను తనిఖీ చేస్తారు. కంటికిని స్పష్టంగా చూడడనికి వైద్యులు కనుపాప వ్యాసాన్ని పెంచి చూపడానికి సహాయపడే డైలేటింగ్ చుక్కలను (dilating drops) ఉపయోగిస్తారు. ఇది వైద్యులు కంటి లోపలి భాగాలను పరిశీలించడానికి మరియు ఖచ్చితమైన రోగ నిర్ధారణకు సహకరిస్తుంది.
- కళ్ళలోకి బయటి వస్తువు ఏదైనా పడితే, వైద్యులు కాటన్ శ్వాబ్ ను ఉపయోగించి దాన్ని తీసివేయవచ్చు.
- సంక్రమణ వలన తీవ్ర గాయం సంభవించినట్లయితే, యాంటీబయాటిక్స్ సూచించబడవచ్చు.
- పూర్తి నయం అయ్యేంత వరకు, కంటి వైద్యుని సలహాలు తీసుకోవడం అవసరం
కంటి గాయాలు సంభవనాన్ని నివారించేందుకు జాగ్రత్తగా ఉండాలి మరియు కొన్ని సాధారణ జాగ్రత్త చర్యలు ఈ విధంగా ఉంటాయి:
- కళ్ళను ప్రభావితం చేసే రసాయనాలతో పని చేస్తుంటే , మీరు సంరక్షణా కళ్ళ అద్దాలు ధరించాలి.
- పదునైన వస్తువుల నుండి దూరంగా ఉండాలి, వాటిని ప్రత్యక్షంగా తాకడాన్ని కూడా నివారించాలి.