ఎముకలు విరగడం (ఫ్రాక్చర్) అంటే ఏమిటి?
ఎముకలలో పగుళ్లు లేదా బీటలు ఏర్పడితే వాటిని ఎముకలు విరగడం అని సూచిస్తారు. ఫ్రాక్చర్ (విరగడం) అనేది ఏ ఎముకనైనా ప్రభావితం చేయగలదు, అది పూర్తిగా లేదా పాక్షికంగా కావచ్చు. పరిసర కణజాలానికి హాని చేయని ఒక ఫ్రాక్చర్ ను క్లోజ్డ్ ఫ్రాక్చర్ (మూసి ఉన్న పగుళ్లు) అని పిలుస్తారు మరియు పరిసర కణజాలానికి నష్టం కలిగించి మరియు చర్మాన్ని దెబ్బతీసే వాటిని ఓపెన్ ఫ్రాక్చర్ (బహిరంగ పగుళ్లుగా) అని పిలుస్తారు.
ఇతర రకాల ఫ్రాక్చర్లు:
-
స్థిరమైన ఫ్రాక్చర్ (Stable fracture) - ఎముక యొక్క చివరలు ఎక్కువగా ఒకే చోట ఉంటాయి.
-
ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్ (Transverse fracture) - సమాంతర ఫ్రాక్చర్ రేఖ.
-
ఆబ్లిక్ ఫ్రాక్చర్ (Oblique fracture) - కోణ ఫ్రాక్చర్ రేఖ.
-
కోమిన్యూటెడ్ ఫ్రాక్చర్(Comminuted fracture) - ఎముకలు అనేక ముక్కలుగా విరిగిపోతాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఎముక ఫ్రాక్చర్ల యొక్క మూడు సాధారణ లక్షణాలు
- నొప్పి
ఎముక యొక్క అంచులు( పెరియోస్టియం, periosteum) నరాలతో సమృద్ధిగా ఉంటాయి., ఈ నరముల యొక్క వాపు తీవ్ర నొప్పికి కారణమవుతుంది. విరిగిపోయిన ఎముక భాగంలోని రక్త స్రావం, ఎముకల అంచుల మీద పేరుకుపోతుంది. - వాపు
రక్తం పేరుకుపోవడం మరియు గాయం ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ యొక్క ప్రతిచర్య కారణంగా వాపు ఏర్పడుతుంది. - అంగవికృతి (Deformity)
విరిగిన భాగం (ఎముక) యొక్క స్థానభంగం కారణంగా ఇది సంభవించవచ్చు. - సమీపంలోని ధమనికి (ఆర్టరీ) నష్టం కలిగితే, ఆ ప్రాంతం చల్లగా మరియు పేలవంగా మారుతుంది. నరముకు హాని కలిగితే, ఫ్రాక్చర్ ప్రాంతంలో తిమ్మిరి ఏర్పడుతుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఎముకల విరగడానికి సాధారణ కారణాలు:
- పడిపోయినప్పుడు కానీ , ప్రమాదం లేదా ఫుట్ బాల్ వంటి క్రీడలను ఆడుతున్నప్పుడు కానీ ఎముకకు గరిష్ట ఒత్తిడి కలిగినప్పుడు ఎముకలు విరగడం జరుగుతుంది.
- బోలు ఎముకల వ్యాధి (osteoporosis) వంటి వ్యాధుల విషయంలో బలహీనమైన ఎముకల కారణంగా ఫ్రాక్చర్లు ఎక్కువగా సంభవించవచ్చు. ఎముకల నుండి కాల్షియం రక్తప్రవాహంలోకి చేరిపోవడం వలన ఎముక సాంద్రత తగ్గిపోతుంది.
- ఒక నిర్దిష్ట (ఒకే) ఎముకను అధికంగా వాడినప్పుడు ఒత్తిడి ఫ్రాక్చర్లు (Stress fractures) ఏర్పడతాయి. అనేక సార్లు కదలడం వలన కండరాలకు అలసటను కలిగిస్తుంది, అది ఎముకలపై ఒత్తిడిని పెంచుతుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వైద్యులు ప్రభావిత ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలిస్తాడు మరియు ప్రభావిత శరీర భాగం యొక్క కదలిక మరియు వాపు తీవ్రతను తనిఖీ చేస్తారు. వైద్యులు రోగి ఆరోగ్య చరిత్రను గురించి, ఎలా గాయం సంభవించిందని మరియు లక్షణాలు గురించి రాసి పెట్టుకుంటారు. ఎక్స్-రే లు ఫ్రాక్చర్ల కోసం ఉత్తమ నిర్దారణా సాధనాలు, ఇవి ఫ్రాక్చర్ రకం, దాని ఖచ్చితమైన స్థానం మరియు ఫ్రాక్చర్ తీవ్రతను చూపుతాయి/తెలుపుతాయి.
కాస్ట్ ఇమ్మొబిలైసెషన్ ( కాస్ట్ ను ఉపయోగించి విరిగిన ఎముక పైన కింద ఉండే ఎముకల కదలికలను నివారించడం), ట్రాక్షన్ (traction, విరిగిన ముక్కలలు తిరిగి వాటి స్థానంలోకి చేర్చడం), ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ (external fixation), ఫంక్షనల్ కాస్ట్ (functional cast, కొన్ని కదలికలను అనుమతించే కాస్ట్), మెటల్ పిన్నులను ఉపయోగించి ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ (external fixation with metal pins), స్క్రూలు మరియు ఇంటర్నల్ ఫిక్సేషన్ (విగిగిన ఎముక ముక్కలని వాటి స్థానంలో పట్టిఉంచే ఒక వస్తువుని [device] లోపల పెడతారు) వంటివి విరిగిన ఎముకల చికిత్సకు ఉపయోగించే విధానాలు.
ఫ్రాక్చర్ యొక్క తీవ్రతను బట్టి అది తగ్గడానికి కొన్ని వారాల నుండి కొన్ని నెలల వరకు పడుతుంది. ఫిజియోథెరపీ సహాయంతో ప్రత్యేక వ్యాయామాలు ఫ్రాక్చర్ చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి అవసరమవుతాయి.