గ్యాస్ట్రోఇంటస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్స్ అంటే ఏమిటి?
గ్యాస్ట్రోఇంటస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్స్ (GIST లు) అనేవి జీర్ణాశయ కణాలలోని ఏర్పడే అరుదైన కణితులు. ఇవి కనక్టీవ్ టిష్యూ (connective tissue) యొక్క కణితులు. అవి ప్రాణాంతకమైన ([malignant], క్యాన్సరు) లేదా నిరపాయమైన ([benign] క్యాన్సర్ కాని) కణుతులు కావచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- కణితి ప్రధానంగా జీర్ణశయా ప్రేగుల నుండి రక్తంస్రావాన్ని చూపుతుంది. రక్తస్రావం కారణంగా రోగి రక్తహీనతని కూడా అభివృద్ధి చేయవచ్చు.
- సాధారణంగా కణితి కడుపు లేదా చిన్న ప్రేగులలో మొదలవుతుంది.
- ఇది కడుపు నొప్పి మరియు తిమ్మిరితో పాటు అధికమైన బరువు తగ్గుదలకు కారణమవుతుంది.
- వికారం మరియు తరచూ వాంతులతో పాటు మింగడంలో కష్టం కూడా ఉంటుంది .
- కణితి పరిమాణం పెరిగి, రోగికి పొత్తికడుపు భారీగా పెరుగుతున్న అనుభూతిని కలిగిస్తుంది. ఇది వ్యాపిస్తే, కాలేయం వంటి ఇతర అవయవాలు కూడా ప్రభావితమవుతాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- గ్యాస్ట్రోఇంటస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్స్ (GIST లు) సార్కోమాల (sarcomas) వర్గంలోకి వస్తాయి, అనగా అవి కనక్టీవ్ టిష్యూ యొక్క కణుతులు.
- GIS కణితులు (గ్యాస్ట్రోఇంటస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్స్) వారసత్వంగా సంక్రమించవచ్చు అటువంటి సందర్భాలలో, ఇతర తీవ్రమైన సమస్యలతో ముడిపడి ఉంటాయి.
- జన్యు మార్పులు (మ్యుటేషన్స్) కూడా GIST లకు కారణం కావచ్చు. GIS ట్యూమర్స్ యొక్క జన్యుపరమైన కారణాల గురించి చాలా పరిశోధన కొనసాగుతున్నది.
- చాలా సందర్భాలలో, ఈ కణితి యొక్క కారణం తెలియదు.
- పెద్ద వయసు వారిలో GIST లు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఈ కణుతుల ప్రమాదం వయసుతో పాటు పెరుగుతుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ముందుగా, వైద్యులు రోగి ఆరోగ్య చరిత్ర మరియు ప్రస్తుత సంకేతాలు, లక్షణాలను గురించి రాసుకుంటారు (తెలుసుకుంటారు). రోగ నిర్ధారణలోని దశలు ఈ విధంగా ఉంటాయి:
- నోరు, జీర్ణవ్యవస్థ మరియు ఉదరం యొక్క పరీక్షలు చాలా ముఖ్యమైనవి. GISTని అనుమానించినట్లైతే, మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి.
- కణితి యొక్క ఖచ్చితమైన స్థానం, పరిమాణం మరియు పరిస్థితిని తెలుసుకోవడం కోసం అల్ట్రాసౌండ్ తో పాటు జీర్ణశయా ప్రేగుల యొక్క ఎండోస్కోపీ సహాయపడతాయి.
- ట్యూమర్ యొక్క తుది నిర్ధారణ కోసం, ట్యూమర్ కణజాలంలోని చిన్న భాగాన్ని తీసి జీవాణుపరీక్ష (biopsy) నిర్వహిస్తారు.
- ట్యూమర్ చికిత్సలో, శస్త్రచికిత్స ద్వారా కడుపులోని కణితిని తొలగించడం జరుగుతుంది లేదా లాప్రోస్కోపీని (laparoscopy) ఉపయోగించవచ్చు.
- అయితే, పెద్ద పరిమాణంలో కణితులను శస్త్రచికిత్స ద్వారా తొలగించటం కష్టం కావచ్చు.
- కీమోథెరపీలో భాగంగా కణితి పరిమాణాన్ని తగ్గించడానికి మరియు వ్యాప్తిని నిరోధించడానికి మందులు ఇవ్వబడతాయి.
- పెద్ద పరిమాణంలో ఉన్న కణితులను శస్త్రచికిత్స ద్వారా తొలగించలేకపోతే రేడియేషన్ ను ఉపయోగించవచ్చు.