గర్భధారణలో రక్తపోటు అంటే ఏమిటి?
గర్భధారణ సమయంలో రక్తపోటు అంటే గర్భిణీ స్త్రీలల్లో అధిక రక్తపోటు, అయితే వారి మూత్రంలో ప్రోటీన్లు లేకుండానే ఉంటాయి.(రక్తపోటు: 140/90 mm Hg కంటే ఎక్కువగా ఉండే రక్తం యొక్క ఒత్తిడి. అది కూడా 20 వారాల గర్భానికి ముందు ఉండే రక్తం యొక్క ఒత్తిడి). 20 వారాల గర్భధారణ తరువాత, రక్తపోటుతో పాటు, గర్భవతుల మూత్రంలో ప్రోటీన్ కూడా ఉంటే-ఈ పరిస్థితినే “ప్రీఎక్లంప్సియా” అని పిలుస్తారు.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గర్భధారణలో రక్తపోటు యొక్క సంకేతాలు మరియు లక్షణాలు వేర్వేరు గర్భిణీ స్త్రీలలో వైవిధ్యభరితంగా ఉన్నప్పటికీ, వాటిలో చాలా సాధారణమైనవి ఇలా ఉంటాయి:
- ఆకస్మికంగా బరువు పెరుగుట
- వాపు (వాపు)
- దీర్ఘకాలం తలనొప్పి
- వాంతులు లేదా వికారం
- తక్కువ మూత్ర ఉత్పత్తి
- మీ కడుపులో లేదా కడుపు ఎగువన కుడి వైపున నొప్పి
- అస్పష్టమైన చూపు లేదా ద్వంద్వ దృష్టి (డబుల్ దృష్టి)ని కలిగి ఉన్న దృష్టి ఆటంకాలు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
గర్భధారణ రక్తపోటుకు కారకాలు:
- మునుపటి గర్భధారణలో లేదా గర్భం దాల్చక మునుపు వ్యక్తిలో రక్తపోటు చరిత్ర.
- గర్భధారణ రక్తపోటుతో పాటుగా మధుమేహం లేదా మూత్రపిండ వ్యాధి.
- ఆఫ్రికన్-అమెరికన్ జాతికి చెంది ఉండడం లేదా 20 ఏళ్ల కంటే తక్కువ వయస్సు లేదా 40 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు.
- కవలలు లేదా ముగ్గురు లేదా అంటకంటే ఎక్కువ శిశువులతో గర్భవతిగా ఉండటం.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వైద్యుడు మొదట మీ వ్యాధిలక్షణాల యొక్క వివరణాత్మక చరిత్రను తీసుకుంటాడు, తర్వాత రక్తపోటును కొలుస్తారు. రక్తపోటు యొక్క కారణాన్ని తెలుసుకోవడానికి క్రింది పరీక్షలు నిర్వహిస్తారు:
- తరచూ బరువును పరిశీలించడం మరియు వాపు కోసం తనిఖీ చేయడం
- రక్తం గడ్డ కట్టడాన్ని పరిశీలించే పరీక్షలు
- మూత్రంలో ప్రోటీన్లను గుర్తించడానికి మూత్రం పరీక్ష నిర్వహిస్తారు (మూత్రంలో ప్రోటీన్ల ఉనికి మూత్రపిండాల పనితీరులో సమస్యలను సూచిస్తుంది).
- కాలేయం మరియు మూత్రపిండాల పనితీరు పరీక్షలు
పిండం యొక్క ఆరోగ్య స్థితిని తనిఖీ చేయడానికి, పిండం పర్యవేక్షణ జరుగుతుంది, ఆ పర్యవేక్షణా చర్యలు కిందివిధంగా ఉంటాయి:
- పిండంరూపంలోని శిశువు కాళ్లతో తన్నడం (కిక్స్) మరియు కదలికలను పర్యవేక్షించడానికి ‘పిండం కదలిక లెక్కింపు అనే పరీక్ష జరుపబడుతుంది.
- ‘నాన్-స్ట్రెస్ టెస్టింగ్’ (NST) పరీక్షలో గర్భం లోపలి శిశువు కదలికలకు ప్రతిస్పందనగా శిశువు యొక్క హృదయ స్పందన రేటును కొలవడానికి ఉపయోగిస్తారు.
- గర్భస్థ శిశువు యొక్క పెరుగుదలను గమనించడానికి సహాయపడే ఆల్ట్రాసౌండ్ను పరీక్షించటానికి ఒక బయోఫిజికల్ ప్రొఫైల్ రూపొందించబడుతుంది.
- డాప్లర్ ప్రవాహ అల్ట్రాసౌండ్ అనేది రక్తం నాళాల ద్వారా రక్త ప్రవాహాన్ని కొలవడానికి సహాయపడే అల్ట్రాసౌండ్ పరీక్ష.
గర్భధారణ రక్తపోటు చికిత్స కింద సూచించినవిధంగా ఉంటుంది:
రోగి యొక్క మొత్తం ఆరోగ్యం మరియు వైద్య చరిత్రను పరిగణనలోకి తీసుకున్న తరువాత వైద్యుడు చికిత్స ప్రణాళికను తయారు చేస్తారు. చికిత్స యొక్క ప్రాధమిక ఉద్దేశ్యం రోగి పరిస్థితి మరింతగా దిగజారిపోకుండా నివారించడం మరియు సమస్యలను నివారించడం. గర్భధారణ రక్తపోటు కోసం క్రింది చికిత్స చర్యలను ఉపయోగించవచ్చు:
- శయన (బెడ్) విశ్రాంతి (ఇంట్లో లేదా ఆస్పత్రిలో).
- తీవ్ర రక్తపోటు ఉన్న గర్భధారణ వ్యక్తులకు మెగ్నీషియం సల్ఫేట్ లేదా ఇతర యాంటీహైపెర్టెన్సివ్ ఔషధాలసేవనను నిర్వహించడం.
- గర్భధారణలో రక్తపోటు వ్యాధి ముదరడం లేదా వ్యాధి ప్రీఎక్లంప్సియాకు పురోగతి చెందిన విషయంలో, మూత్రం యొక్క ప్రయోగశాల పరీక్ష మరియు రక్తపరీక్షలు జరుగుతాయి.
- ఊపిరితిత్తుల అపరిపక్వత అపరిపక్వ (premature) శిశువులతో ఒక ప్రధాన సమస్యగా ఉంటుంది గనుక, కార్టికోస్టెరాయిడ్ మందులను ఊపిరితిత్తుల పరిపక్వతను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు.