పంటి చిగురు వాపు అంటే ఏమిటి?
పండ్ల మీద పాచి పేరుకుపోవడంవల్ల పండ్ల చిగుర్లు వాచీ “పంటి చిగురు వాపు” (Gingivitis) అనే రుగ్మత సంభవిస్తుంది. దంతాల పాచి లేక దంత ఫలకం (dental plaque) అనేది దంతాలపై పేరుకుపోయే బ్యాక్టీరియాతో కూడిన, రంగులేని, బంకగుణంకల్గిన (sticky film) పారదర్శక పదార్ధం(బయోఫీల్మ్). ఈ పాచి లేదా ఫలకము పళ్ళు మధ్య కూడా పెరగొచ్చు. సరైన జాగ్రత్త తీసుకోకపోతే, ఈ పరిస్థితి తీవ్రమైన చిగుళ్ల నష్టం మరియు దంత నష్టం కలిగిస్తుంది.
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మీరు ఈ క్రింది వ్యాధిలక్షణాలను అనుభవిస్తే మీరు “పంటిచిగురు వాపు”ను కలిగి ఉండవచ్చు:
- ఎరుపుదేలిన మరియు వాపెక్కిన చిగుళ్ళు
- పంటి చిగుళ్ళ నుండి రక్తస్రావం
- పంటి చిగుళ్ల నొప్పి
- నోటి శ్వాసలో దుర్వాసన (మరింత చదువు: చెడు శ్వాస కారణాలు)
- చల్లని లేదా వేడి ఆహార వస్తువులకు మరియు పానీయాలకు సున్నితత్వం (మరింత చదువు: పంటి సున్నితత్వం చికిత్స)
- ఊగులాడే దంతాలు (loosening of teeth)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
పంటి చిగురు వాపుకు ప్రధాన కారణం దంతాలపైనా చిగుళ్ల పైనా పాచి లేక ఫలకం పేరుకుపోవడం. ఇలా పేరుకుపోయిన పాచిలో (ఫలకంలో) ఉన్న బాక్టీరియా చిగుళ్లను బాధిస్తుంది మరియు వాపు మరియు రక్తస్రావం కలిగిస్తుంది. దంతాలపై పేరుకుపోయిన పాచితో కూడిన ఫలకం కఠినంగా తయారవుతుంది మరియు దంతచక్కర లేక దంతశర్కర అని పిలువబడే పదార్ధాన్ని ఏర్పరుస్తుంది, ఇది పాచికంటే గట్టిగా ఉంటుంది.
పంటి చిగురు వాపు (గ్యాంగ్విటిస్) ప్రమాదాన్ని పెంచే కారణాలు కింది విధంగా ఉన్నాయి:
- నోటి పరిశుభ్రతను సరిగా నిర్వహించకపోవడం
- ధూమపానం లేదా పొగాకు సేవనం
- గర్భధారణ
- పోషణ సరిగా లేకపోవడం
- ఒత్తిడి
- మధుమేహం , హెచ్ఐవి వైరస్ (హ్యూమన్ ఇమ్మ్యూనోడెఫిషియన్సీ వైరస్) వంటి వ్యాధులు - సంక్రమణలు మరియు క్యాన్సర్ వ్యాధి
- మూర్ఛ మందులు, క్యాన్సర్ మందులు, నోటిద్వారా తీసుకునే కాంట్రాసెప్టైవ్స్, మరియు స్టెరాయిడ్ మందుల వాడకం.
పంటి చిగురు వాపును ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మీ దంతవైద్యుని క్రమం తప్పకుండా (రెగ్యులర్గా) సంప్రదించడంవల్ల పరిస్థితిని ప్రారంభదశలోనే గుర్తించడం వీలవుతుంది, ఎందుకంటే సాధారణంగా పరిస్థితి నొప్పిలేకుండా ఉంటుంది కాబట్టి. చికిత్సలో ప్రత్యేకంగా పాచిని శుభ్రపరిచే పరికరాలను ఉపయోగించడం ద్వారా దంతాల నుండి పాచిని (ఫలకం) తొలగించడం జరుగుతుంది.
ఈ స్థితిలో మీరు నొప్పిని అనుభవిస్తే, మీనొప్పిని తగ్గించడానికి మీ దంతవైద్యుడు ఒక నొప్పినివారిణి (painkiller) మందును సిఫారసు చేస్తారు. కొన్ని సందర్భాల్లో, యాంటీబయాటిక్ మందులు కూడా సూచించబడుతాయి. అంటురోగం ఎక్కువ స్థాయిలో చిగుళ్ళను గనుక బాధించి ఉన్నట్లయితే దంత తొలగింపు (teeth removal) అవసరమవుతుంది.
ఇలాంటి సాధారణ స్వీయ రక్షణ చిట్కాల ద్వారా మీరు పంటి చిగురు వాపును నిరోధించవచ్చు:
- రోజుకు రెండుసార్లు మీ దంతాలను బ్రష్ చేయండి
- పళ్ళ సందులోని పదార్థాల్నిరోజుకు ఒకసారైనా (flossing) తొలగించడం
- క్రమం తప్పకుండా మౌత్ వాష్ను ఉపయోగించడం
- రంగులో ఏదైనా మార్పు గమనించేందుకు రోజూ మీ చిగుళ్ళను తనిఖీ చేయండి
- క్రమం తప్పకుండా దంత తనిఖీ (dental check-up)