గ్రేవ్స్ వ్యాధి (డిసీజ్) అంటే ఏమిటి?
గ్రేవ్స్ వ్యాధి (డిసీజ్) థైరాయిడ్ గ్రంధిని ప్రభావితం చేసి థైరాయిడ్ హార్మోన్ల అధిక ఉత్పత్తికి దారితీస్తుంది. థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ ఇమ్యునోగ్లోబులైన్స్ (TSI, thyroid-stimulating immunoglobulins) అని పిలవబడే యాంటీబాడీలు సాధారణంగా బయటి పదార్దాల (foreign particles) పై పోరాడుతాయి, కానీ అవి థైరాయిడ్ గ్రంధి యొక్క కణాల మీద చర్య తీసుకోవడం మొదలుపెట్టి థైరాయిడ్ హార్మోన్ల అధిక విడుదలకు కారణమయ్యే ఈ ఆటోఇమ్మ్యూన్ రుగ్మతకు దారితీస్తాయి. థైరాయిడ్ గ్రంథి సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది అది మన మెడ ముందు భాగంలో కింద ప్రాంతంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంధి విడుదల చేసే హార్మోన్లు శరీరానికి శక్తిని అందించడానికి మరియు శరీర అవయవాల సరైన పనితీరుకు అవసరమైనవి.
భారతీయ గణాంకాల ప్రకారం, పురుషులు కంటే మహిళల్లో గ్రేవ్స్ వ్యాధి అధికంగా ఉంటుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
లక్షణాలను నిదానంగా ఏర్పడవచ్చు, లేదా హఠాత్తుగా కనిపించవచ్చు. గ్రేవ్స్ వ్యాధిలో కనిపించే సాధారణంగా లక్షణాలు:
- కళ్ళు ఉబ్బడం
- అకస్మాతిక బరువు తగ్గుదల
- హృదయ స్పందన వేగం పెరగడం
- చికాకు
- భయము
- చేతులు వణకడం
- వేడిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం
- మెడ వాపు
- నీళ్ల విరేచనాలు
- నిద్రించడంలో సమస్యలు
- జుట్టు రాలుట
రోగనిరోధక వ్యవస్థ కంటి కణాలను ప్రభావితం చేస్తే, ఈ క్రింది లక్షణాలను గమనించవచ్చు:
- కళ్ళు చుట్టూ వాపు
- కళ్ళు పొడిబారడం
- ఎరుపుదనం మరియు నొప్పి (మరింత సమాచారం: కళ్ళ ఎరుపుదనం చికిత్స)
- చికాకు
- కంటి చూపులో సమస్యలు
అరుదైన సందర్భాలలో, మందమైన, ఎరుపు మచ్చలు మోకాళ్ల క్రింద చర్మం మీద కనిపిస్తాయి కొన్నిసార్లు పాదాలలో కనిపిస్తాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఇది రక్తంలో ఉండే యాంటీబోడీలు థైరాయిడ్ కణాలపై చర్య చూపడం వలన థైరాయిడ్ హార్మోన్ను అధికంగా ఉత్పత్తి చేసే ఒక ఆటోఇమ్మ్యూన్ వ్యాధి. ఈ సమస్య ప్రధానంగా 30-50 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండే మహిళలను ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య యొక్క ఖచ్చితమైన కారణం తెలియలేదు.
గ్రేవ్స్ వ్యాధి అభివృద్ధి చెందే ప్రమాద కారకాలు:
- గ్రేవ్స్ వ్యాధి యొక్క కుటుంబ చరిత్రను కలిగి ఉండడం
- పొగత్రాగే వారు
- గర్భవతులు
- ఒత్తిడి ఉన్నవారు
- టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్నవారు
- రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
ముందుగా మెడలో ఏదైనా వాపును గుర్తించడానికి వైదులు భౌతిక పరీక్ష చేస్తారు తర్వాత థైరాయిడ్ హార్మోన్ల (T3, T4, మరియు TSH) స్థాయిలను యాంటీబాడీలను (TSI) గుర్తించడానికి రక్త పరీక్షలను నిర్వహిస్తారు. రేడియోఆక్టివ్ అయోడిన్ అప్టేక్ టెస్ట్ (RAIU, radioactive iodine uptake test) అని పిలవబడే ఒక ఇమేజింగ్ పరీక్షను వైద్యులు సిఫారసు చేయవచ్చు, ఒక నిర్దిష్ట సమయంలో థైరాయిడ్ గ్రంధి ఎంత అయోడిన్ తీసుకుంటుందో తెలుసుకోవడానికి ఈ పరీక్షను నిర్వహిస్తారు.
గ్రేవ్స్ వ్యాధికి అందుబాటులో ఉన్న చికిత్సలో యాంటీ-థైరాయిడ్ మందులు, రేడియో అయోడిన్ థెరపీ (radioiodine therapy) , మరియు థైరాయిడ్ శస్త్రచికిత్స వంటివి ఉన్నాయి. వైద్యులు రోగి పరిస్థితి ఆధారంగా తగిన చికిత్స విధానాన్ని సూచిస్తారు. రోగి గర్భవతి అయినప్పుడు, అలెర్జీ ప్రతిచర్యలు ఉన్నపుడు, యాంటీ-థైరాయిడ్ మందులు దుష్ప్రభావాలను చూపుతున్నపుడు లేదా థైరాయిడ్ గ్రంథులు చాలా పెద్దగా మారినప్పుడు చివరి పరిష్కారంగా థైరాయిడ్ శస్త్రచికిత్స (surgery) ను చేస్తారు.
శరీరంలోని థైరాయిడ్ స్థాయిలను క్రమంగా తనిఖీ చేయడం వలన అది చికిత్సకు సహాయపడుతుంది.