భ్రాంతి (లేక హాలూసినేషన్) అంటే ఏమిటి?
భ్రాంతి అనేది సరిగ్గా ఒక వ్యాధి కాదు, కానీ ఒక ఊహాత్మక అనుభవాన్నికలిగి ఉండే ఒక లక్షణము. వాస్తవమైన బహిర్గత ప్రేరేపణ (లేక ఉద్దీపన) లేకుండా ఎవరైనా వినవచ్చు, వాసన చూడొచ్చు, అనుభూతి చెందవచ్చు లేదా ఇతర వ్యక్తుల ఉనికిని అనుభవించనూవచ్చు. ఇది చిత్తవైకల్యం మరియు భ్రమతో సహా పలు మానసిక మరియు వైద్య పరిస్థితులతో సంబంధం కలిగి ఉంటుంది. వృద్ధాప్యం ముదిరేప్రక్రియలో భాగంగా వృద్ధులైనవారు తరచుగా భ్రాంతికి గురి అవుతుంటారు.
హాలూసినేషన్ ఐదు రకాలుగా విభజించబడింది:
- శ్రవణ
- దృశ్య
- ఘ్రాణ
- జిహ్వ
- స్పర్శ
- శారీరక
భ్రాంతి అనేది, భ్రమ అనేది రెండూ ఒకటి కాదు. భ్రమ అనేది వాస్తవంగా జరుగుతున్న పరిస్థితిని తప్పుగా అర్థం చేసుకోవడం అవుతుంది. (మరి భ్రాంతి ఊహాత్మక అనుభవం మాత్రమే)
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
-
ధ్వని (ఆడిటరీ) భ్రాంతులు
ఈ రకమైన విషయంలో, రోగులు అసలు బాహ్య మూలం లేకుండానే ఒకటి లేదా ఎక్కువ స్వరాలను వినవచ్చు.
కొన్నిసార్లు, మీ గురించి మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తుల సంభాషణలను వింటున్న మూడవ వ్యక్తిలా మిమ్మల్ని మీరే భావిస్తారు. మీరు వినే ఈ స్వరాలు మీ తల లోపలే వినబడుతున్నట్టు లేదా బయట నుండి వినబడుతున్నట్టు ఉండవచ్చు. కొన్నిసార్లు, మీ స్వంత ఆలోచనను మీరు బిగ్గరగా వినవచ్చు.
-
దృష్టి భ్రాంతులు (లేక విజువల్ భ్రాంతులు)
మీరు ఒక వ్యక్తి యొక్క ఉనికిని లేదా కాంతి యొక్క ఆవిర్లను చూడవచ్చు.
-
వాసన భ్రాంతులు (లేక olfactory భ్రాంతులు)
అంతర్గత లేదా బాహ్య మూలం నుండి వస్తున్న వాసనను పీలుస్తున్నట్టు మీకు అనిపించవచ్చు. కొందరు రోగులు అధికంగా స్నానం చేయవచ్చు, పెర్ఫ్యూమ్లు లేదా డీయోడోరెంట్లను ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు లేదా ఇతరుల నుండి తమను తాము దూరంగా ఉంచుకుంటుంటారు, ఎందుకంటే, తన ఒంటి నుండి దుర్వాసన వెలువడుతూ ఉంటుందని భావిచడంవల్ల.
-
రుచి భ్రాంతులు (gustatory hallucinations)
మీరు రుచిలో మార్పును, పెరుగుతున్న దాహం, మరియు పెరిగిన లాలాజలమును అనుభవించవచ్చు.
-
స్పర్శ భ్రాంతులు (tactile or touch hallucinations)
కీటకాలు మీ చర్మం మీద లేదా చర్మం కింద నడుస్తున్నట్లు మీకు భావనలు కలగొచ్చు.
-
ఇంద్రియగోచర భ్రాంతులు (somatic or sensory hallucinations)
ఇతరుల ఉనికి లేకున్నా కూడా వారి శరీరాన్ని తాకడం ద్వారా వారి ఉనికిని అనుభూతి చెందినట్లుండేటువంటి అసాధారణ శారీరక భావాలను అనుభవించవచ్చు.
భ్రాంతికి ప్రధాన కారణాలు ఏమిటి?
భ్రాంతి యొక్క ఖచ్చితమైన కారణం తెలియదు. భ్రాంతులకు కారణమయ్యే సాధారణ పరిస్థితుల్ని కింద తెలుపుతున్నాం.
-
శబ్ద భ్రాంతులు (సౌండ్ హాలూసినేషన్స్)
- నాడీ వ్యవస్థ యొక్క క్రమరాహిత్యం
- చెవి వ్యాధి
- మానసిక రుగ్మతలు (మరింత చదువు: మతిభ్రమ లక్షణాలు)
- మందులు
- మత్తుపానీయాల ఉపసంహరణ
- మూర్ఛలు
- స్ట్రోక్
- ఆందోళన
-
వాసనభ్రాంతులు (స్మెల్ హాలూసినేషన్స్)
- కంటి రుగ్మత
- నరాల రుగ్మత (న్యూరోలాజికల్ డిజార్డర్)
- పార్శ్వపు తలనొప్పి (మైగ్రెయిన్)
- మందులు
- మానసిక రుగ్మత (సైకియాట్రిక్ డిజార్డర్)
- నాసికాద్వారాల్లో వాపు లేక సైనసిటిస్
- నిద్ర లేకపోవడం
-
రుచి భ్రాంతులు
-
నాసికాద్వారాల్లో వాపు లేక సైనసిటిస్
-
స్పర్శ భ్రాంతులు (టచ్ హాలూసినేషన్స్)
- మనసంతా నిండివుండే అణచుకోలేని కోరిక భ్రాంతి (అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్)
- కొన్ని ఔషధాల అధిక మోతాదు
- మనోవైకల్యం
-
శారీరకమైన (సోమాటిక్) భ్రాంతులు
-
నాడీ వ్యవస్థ రుగ్మత
భ్రాంతిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
మీ డాక్టర్ మొదట మతిభ్రమణ కారణాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు మరియు మీ పరిస్థితిపై ఆధారపడి అందుకు తగిన మందులను సూచిస్తారు. రక్తపరీక్షలు, మెదడు యొక్క CT స్కాన్, ఎలెక్ట్రోఆన్సెఫలోగ్రఫీ (EEG), మరియు MRI చేయవచ్చు. భ్రాంతి పరిస్థితిని గుర్తించడం అయింతర్వాత, చికిత్సలో భ్రాంతి కారణాన్ని పరిష్కరించడానికి కృషి ఉంటుంది.
చిత్తవృత్తి వ్యతిరేక-మందులతో (anti-psychotic medicines) సాధారణంగా భ్రాంతులకు చికిత్స చేయబడుతుంది. ఈ మందుల దుష్ప్రభావాల (side effects) కారణంగా మీరు భ్రాంతిని అనుభవిస్తున్నట్లయితే మీ వైద్యుడు మందుల మోతాదుని తగ్గించగలడు