చేతి నొప్పి అంటే ఏమిటి?
చేతిలో నొప్పి తేలికపాటిగా లేదా తీవ్రంగా ఉండవచ్చు మరియు కొన్నిసార్లు, వ్యక్తి తన రోజువారీ కార్యకలాలు చేసుకోలేంత తీవ్రంగా ఉండవచ్చు. చాలా సందర్భాలలో, ఈ నొప్పి ఏదైనా వ్యాధి యొక్క లక్షణం కావచ్చు, మరియు అంతర్లీన కారణానికి చికిత్స అందిస్తే సాధారణంగా ఈ నొప్పిని నివారించవచ్చు.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వాపు, గాయం, నరాలు దెబ్బతినడం, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు (లోపాలు, హైపర్యురిసెమియా [hyperuricemia] వంటివి), చేతిలో ఉండే కండరములు మరియు ఎముకలలో ఏదైన బెణుకు లేదా ఫ్రాక్చర్ వంటివి చేతి నొప్పికి దారితీస్తాయి. చేతి నొప్పి లక్షణాలు అనారోగ్య (వ్యాధి) రకం మరియు ప్రభావిత చేతి భాగాల బట్టి మారుతూ ఉంటాయి; ఏమైనప్పటికీ, చేతి నొప్పి యొక్క కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:
- నొప్పి (సలుపు, జలదరింపు, తిమ్మిరి లాంటిది)
- వాపు
- గట్టిదనం (దృఢత్వం)
- జలదరింపు లేదా తిమ్మిరి
- చేతి కదలికల్లో లేదా ప్రభావితన చేతితో కార్యకలాపాలు నిర్వహించడంలో అసమర్థత లేదా కఠినత
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఎముకలు, కీళ్ళు, స్నాయువులు (tendons), కనెక్టీవ్ టిష్యూ లేదా నరముల వంటి అంతర్లీన భాగాలలో సమస్యల (భాద) వలన చేతి నొప్పి కలుగుతుంది. చేతి నొప్పి యొక్క కొన్ని సాధారణ కారణాలు:
- కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ (Carpel tunnel syndrome)
- ఆస్టియోఆర్థరైటిస్
- రుమటాయిడ్ ఆర్థరైటిస్
- గౌట్
- విటమిన్ D లోపం
- బెణుకు
- స్నాయువుల వాపు (Tendonitis)
- గాంగ్లియోన్ సిస్ట్ (Ganglion cyst)
- డి క్వేర్వైన్స్ టెనోస్నియోవిటిస్ (De Quervain’s tenosynovitis)
- పెరిఫెరల్ న్యూరోపతి (Peripheral neuropathy)
- రేనాడ్స్ వ్యాధి (Raynaud’s disease)
- గాయం లేదా ఆకస్మిక గాయం
ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
సరైన ఆరోగ్య చరిత్ర మరియు సరైన వైద్య పరీక్షలు సంభావ్య రోగ నిర్ధారణకు సహాయం చేస్తాయి. కొన్ని రక్త పరీక్షలు మరియు రేడియోలాజికల్ పరీక్షలు ఖచ్చితమైన నిర్ధారణను అందించగలవు. ఈ పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి:
- రక్త పరీక్షలు:
- పూర్తి రక్త గణన (CBC, Complete blood count) తో పాటు ఎరిత్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ (ESR, erythrocyte sedimentation rate)
- సి-రియాక్టివ్ ప్రోటీన్లు
- రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్
- విటమిన్ D3 స్థాయిలు
- యూరిక్ యాసిడ్ స్థాయిలు
- ప్రభావిత చేతి మణికట్టు యొక్క ఎక్స్-రే
- నరాలలో సమస్యలను తనిఖీ చేయడం కోసం చేతి మణికట్టు యొక్క ఎంఆర్ఐ (MRI) స్కాన్
చేతి నొప్పికి చికిత్సా పద్ధతులు:
చేతి నొప్పి చికిత్స నొప్పి కారణం మీద ఆధారపడి ఉంటుంది, ఐన భౌతిక చికిత్స (physical therapy) తో పాటు కొన్ని మందులు ఈ నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి. చికిత్స పద్ధతులు ఈ విధంగా ఉంటాయి:
- మందులు - పారాసెటమాల్, అసెలోఫెనాక్, మరియు ఇబుప్రోఫెన్ వంటి నోటిద్వారా అనాల్జేసిక్ మందుల (నొప్పి నివరుణులు) ను నొప్పి తగ్గించడానికి ఉపయోగించవచ్చు
- ఐస్ ప్యాక్స్ - చేతి మీద ఐసు లేదా ఐస్ ప్యాక్లను ఉపయోగించడం వలన అది నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది
- భౌతిక చికిత్స (physical therapy) - సరైన భౌతిక చికిత్స చేతి నొప్పికి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది
- చికిత్సాపూర్వక అల్ట్రాసౌండ్ (Therapeutic ultrasound) న్యూరోజెనిక్ (neurogenic) లేదా జలదరింపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది