గర్భధారణ సమయంలో తలనొప్పి అంటే ఏమిటి?
గర్భధారణ సమయంలో చాలామంది గర్భవతులు సాధారణంగా నివేదించే ఫిర్యాదు ఏమంటే తలనొప్పి మరియు గర్భవతులకు తలనొప్పి రోజులో ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. అయితే, గర్భవతులకు తలనొప్పి అనేది మొదటి త్రైమాసికం మరియు మూడవ త్రైమాసికంలో చాలా సాధారణం. ఇతర వ్యాధి లక్షణాలు ఏవీ లేకపోయినట్లయితే, గర్భధారణ సమయంలో వచ్చే తలనొప్పి సాధారణంగా ప్రమాదకరమైనది కాదు.
ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
గర్భధారణ సమయంలో వచ్చే తలనొప్పి కణతల్లో (temples), తల వెనుక, లేదా కళ్ళ వెనుక ఒక నిస్తేజమైన, ఇంకా పోటుతో కూడిన నొప్పిగా అనిపించవచ్చు.
కొన్ని సార్లు, పార్శ్వపు తలనొప్పి కారణంగా గర్భధారణ తలనొప్పి మెడకిందికి కూడా విస్తరించవచ్చు, ఈ తలనొప్పి పదునైన నొప్పిగా ఉండవచ్చు.
గర్భధారణ సమయంలో గర్భవతుల్లో కింది వ్యాధిలక్షణాలు గనుక ఒకవేళ పొడజూపితే వెంటనే ఓ ఆరోగ్య సంరక్షణ ప్రదాత (health care provider)ని సంప్రదించాలి
- గర్భధారణలో వచ్చే తలనొప్పితో పాటు జ్వరం మరియు వాంతులు వస్తాయి
- గర్భధారణలో వచ్చే తలనొప్పి కొన్ని గంటలలోగానే పోదు, అదింకా మరింత తీవ్రమవుతుంది కూడా
- ఈ గర్భధారణ తలనొప్పి మసకబారిన దృష్టిని మరియు గందరగోళానికి కారణమవుతుంది
- ముక్కు లేదా కళ్ళ నుండి ఏదో ఒక ద్రవం స్రవిస్తుంది . (మరింత చదువు: ముక్కు నుండి రక్తస్రావానికి కారణాలు)
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
గర్భధారణ సమయంలో తలనొప్పికి దారితీసే హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి.
గర్భవతుల్లో తలనొప్పి గర్భధారణ ప్రారంభంలో సాధారణమే, ఈ సమయంలో, ప్రొజెస్టెరాన్ అనబడే లైంగిక హార్మోను తలలోని రక్త నాళాలు మరియు గర్భాశయంలోని కండరాల ఉపశమనానికి దారితీస్తుంది. దీని వలన నరాల్లోని రక్తం కొట్టుకుని అల్లకల్లోలానికి గురవుతుంది, తద్వారా తరచూ తలనొప్పి వస్తుంది.
తలనొప్పికి దారితీసే ఇతర కారకాలు కూడా ఉన్నాయి, ఇవి తలనొప్పికారకాలుగా పనిచేస్తాయి:
- అలసట
- ఆకలి
- దేహ్యాడ్రేషన్ (నిర్జలీకరణము)
- ఒత్తిడి
- మందకొడితనం (ఇనాక్టివిటీ)
- రక్తపోటులో మార్పులు
- నాశికాకోటరాల (సైనస్) రద్దీ
గర్భధారణ సమయంలో పార్శ్వపు (మైగ్రెయిన్) తలనొప్పి కూడా సంభవించవచ్చు. అయినప్పటికీ, గర్భధారణకు ముందు పార్శ్వపు తలనొప్పి ఉన్న కొందరు స్త్రీలలో, గర్భధారణ సమయంలో తలనొప్పి యొక్క తీవ్రత తగ్గిపోవచ్చు. మెదడులో ధమని నరం పగలడం లేదా అధిక రక్తపోటు వంటి కారణంగా కూడా తలనొప్పి రావచ్చు .
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
వ్యాధిలక్షణాల యొక్క సాధారణ వర్ణన ద్వారా తలనొప్పుల్ని మామూలుగా నిర్ధారిస్తారు. అయినప్పటికీ, తలనొప్పి ఇతర లక్షణాలతో పాటు సుదీర్ఘకాలంగా తెరపి లేకుండా కొనసాగుతూనే ఉంటే, వ్యక్తిలో అసాధారణతలను తనిఖీ చేయడానికి వైద్యుడు CT స్కాన్, MRI లేదా CT ఆంజియోగ్రఫీ వంటి ఇతర పరీక్షలను నిర్వహించవచ్చు. ఈ పరీక్షలు వ్యాధికి గల కారణాన్ని గుర్తించడానికి సహాయం చేస్తాయి.
గర్భధారణ సమయంలో వచ్చే తలనొప్పి సాధారణంగా గృహ చిట్కాల చికిత్సతోనే ఉపశమనం పొందవచ్చు. అలాంటి గృహచిట్కాలేవంటే:
- వెచ్చని కాపడం
- చల్లని కాపడం
- మసాజ్ (సున్నితంగా మర్దన చేయడం)
- పడక విశ్రాంతి
- తైలమర్ధనంతో అరోమా చికిత్స
తలనొప్పిని నివారించడానికి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని సేవించడాన్ని, యోగా మరియు ఇతర వ్యాయామాలు (ఒక నిపుణుడు పర్యవేక్షణలో) వంటి సాధారణ శారీరక కార్యకలాపాల్లో వ్యక్తి పాల్గొనాలని కూడా డాక్టర్ సిఫార్సు చేయవచ్చు.
డాక్టర్ ను సంప్రదించడానికి ముందు ఎలాంటి మందులు తీసుకోవద్దు. గర్భధారణ సమయంలో తీసుకోగల్గిన సురక్షితమైన నొప్పినివారణా మందుల్ని తీసుకోమని డాక్టర్ సలహా ఇస్తారు, లేదా రక్తపోటును తగ్గించే మందులిస్తారు.