వడదెబ్బ అంటే ఏమిటి?
వడదెబ్బ అనేది తక్షణ వైద్య సహాయం అందవలసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో శరీరంలోని ఉష్ణోగ్రతక 40 డిగ్రీల సెంటిగ్రేడు అంతకంటే ఎక్కువ ప్రమాణానికి పెరుగుతుంది. ఎక్కువ వేడి కల్గిన ఎండకు వ్యక్తి గురికావడంవల్ల సదరు వ్యక్తి శరీరం సాధారణమైన ఉష్ణోగ్రతను తనకు తానుగా నిర్వహించుకోలేదు. సాధారణంగా మన శరీరం చెమటను బయటికి వెలువరించడం ద్వారా శరీరంలో ఉండే అధిక ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు చల్లబర్చుకుంటుంది, అయితే వేడి అధికంగా ఉండే (వేసవి) ఎండలో ఉండాల్సిన పరిస్థితి వచ్చినపుడు ఇలా చల్లబర్చుకోవడం శరీరానికి సాధ్యం కాకపోవచ్చు. ఈ ఉష్ణ-సంబంధమైన జబ్బు సాధారణంగా వేసవిలో పిల్లలు మరియు వృద్ధులనే ఎక్కువగా బాధించడం జరుగుతుంది, ఎందుకంటే ఎండకు ఎక్కువగా తిరగడమో లేక ఎండకు శరీరం బహిర్గతం కావడంవల్లనే. నీడపట్టు లేని ఇంటి వెలుపలప్రదేశాల్లో పని చేసే వ్యక్తులు కూడా వడదెబ్బకు లోనయ్యే అవకాశం ఉంది. వడదెబ్బకు గురైన తక్షణం ఉపశమనాదివైద్య ప్రక్రియలతో సరిగా ఆరోగ్య నిర్వహణ చేసుకోకపోతే, శరీరంలోని ఇతర అంతర్గత అవయవాల్ని ఇది దెబ్బ తీస్తుంది, తద్వారా మరణానికి దారి తీస్తుంది.
వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం వలన వడదెబ్బవల్ల చనిపోయేవారి మరణాల సంఖ్య పెరుగుతుందని భారతీయ సమాచారం తెలుపుతోంది.
వడదెబ్బ యొక్క ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వడదెబ్బకు గురైన వ్యక్తి కింద పేర్కొన్న పలు సాధారణ లక్షణాల్లో పెక్కింటిని అనుభవించవచ్చు:
- చమట పట్టకుండా చర్మం ఎరుపుదేలడం, వేడెక్కడం, పొడిబారిపోవడం జరుగుతుంది.
- శ్వాస తీసుకోవడం కష్టం
- స్పృహ కోల్పోవుట
- అలసట
- వికారం
- వాంతులు
- తలనొప్పి
- పెరిగిన గుండెస్పందన రేటు (మరింత సమాచారం: టాకీకార్డియా కారణాలు )
- గందరగోళం
- చిరాకు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
వడదెబ్బకు ప్రధాన కారణం వ్యక్తి శరీరం ఎండకు బహిర్గతమవడమే. ఎండలో విస్తారంగాను మరియు అవిస్తారంగాను పనులు, కార్యక్రమాలు నిర్వహించే వారు వడదెబ్బకు లోనవుతుంటారు. వడదెబ్బకు ఎక్కువగా గురయ్యే వ్యక్తులు ఎవరంటే:
- శిశువులు
- వృద్ధులు
- ఆరు బయట ఎండలో పనిచేసే కార్మికులు
- ఊబకాయం వ్యక్తులు (మరింత చదువు: ఊబకాయం చికిత్స)
- మానసిక అనారోగ్యాలతో బాధపడే వ్యక్తులు
- మద్యపాన వ్యసనపరులు (ఆల్కహాలిక్స్)
- తగినంతగా ద్రవాహారం తీసుకోనివారు, ఇలాంటి వారికి నిర్జలీకరణం కల్గుతుంది
దీనిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
వడదెబ్బకు గురైన వ్యక్తికి మీరు తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలు ఏవంటే, ఆ వ్యక్తిని ఎండ నుండి నీడలోకి లేదా నీడకల్గిన చల్లని వాతావరణంలోకి మార్చడం. అప్పుడు, మీరు తడి తువ్వాలను ఉపయోగించి లేదా గాలిని విసరడం ద్వారా ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రతని తగ్గిస్తారు. వీలైతే, చంకలకింద మరియు గజ్జ ప్రాంతాల్లో మంచు ప్యాక్లను పెట్టండి. ఈ ప్రాథమిక సంరక్షణ తరువాత, రోగిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి.
ఆసుపత్రిలో, వైద్యుడు రోగి యొక్క పరిస్థితికి అనుగుణంగా అవసరమైన చికిత్సను అందిస్తారు. ఉదాహరణకు శ్వాస తీసుకోవడంలో కష్టం ఉంటే, వైద్యుడు తక్షణమే జాగ్రత్త తీసుకుంటాడు. శరీర సాధారణ ఉష్ణోగ్రత (38° C) సాధించబడే వరకు వైద్యులు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు. వడదెబ్బకు ఇతర కారణాలను తోసిపుచ్చడానికి కొన్ని ప్రయోగశాల పరీక్షల్ని వైద్యులు నిర్వహిస్తారు.
వడదెబ్బ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కింది జాగ్రత్తలు తీసుకోండి
- నీరు పుష్కలంగా త్రాగటం ద్వారా సరైన జలీకరణాన్ని (హైడ్రేషన్) నిర్వహించండి
- కాంతివంతమైన మరియు వదులుగా ఉండే యుక్తమైన దుస్తులు ధరించాలి
- మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 3 గంటల సమయంలోని ఎండలో సాధ్యమైన తక్కువ సమయాన్ని గడపండి.
- ఎండలోకెళ్లేప్పుడు ఒక టోపీ లేదా కండువా వేసుకెళ్లండి లేదా ఓ గొడుగు ఉపయోగించండి.