హైడ్రాడెనిటిస్ సూపురటైవ - Hidradenitis Suppurativa in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 29, 2018

March 06, 2020

హైడ్రాడెనిటిస్ సూపురటైవ
హైడ్రాడెనిటిస్ సూపురటైవ

హైడ్రాడెనిటిస్ సూపురటైవ అంటే ఏమిటి?

హైడ్రాడెనిటిస్ సూపురటైవ, దీనిని యాక్నే ఇన్వెర్సా (acne inversa) అని కూడా పిలుస్తారు, ఇది స్వేద గ్రంధులకు చీముపట్టే ఒక అరుదైన సంక్రమణం. ఈ ఇన్ఫెక్షన్/సంక్రమణ  దీర్ఘకాలికంగా, తీవ్రమైనదిగా మరియు పునరావృతమయ్యేదిగా ఉంటుంది. ఇది సాధారణంగా చంకలు, గజ్జలు లేదా మలద్వారా ప్రాంతాల్లో కాలిన బొబ్బల వలె మొదలవుతుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

  • ప్రారంభ సంకేతాలు మరియు లక్షణాలు:
    • మొటిమల వలె కనిపించే ఒకటి లేదా ఎక్కువ బొడిపెలు ఏర్పడడం.
    • ఈ బొడిపెలు చర్మం మీద అలాగే ఉండిపోతాయి లేదా తగ్గిపోతాయి.
    • ఒకదానికి ఒకటి రాసునేటువంటి శరీర భాగాలైన  చంకలు, పిరుదులు, ఛాతీ మరియు ఎగువ తొడల ఇవి మరింత అధికంగా ఉంటాయి.
  • తర్వాతి సంకేతాలు మరియు లక్షణాలు:
    • బొబ్బలు లేదా బొడిపెలు నొప్పిని కలిగిస్తాయి  మరియు అవి నయం కావచ్చు , కానీ మళ్ళీ తిరిగి ఏర్పడతాయి.
    • కొన్నిసార్లు బొబ్బలు పగిలి చెడు వాసనతో కూడిన ద్రవాన్ని స్రవింపజేయవచ్చు.
    • ప్రభావిత చర్మ భాగంలోని మచ్చలు మందంగా మారతాయి.
    • చర్మం మీద లోతైన గొట్టం మచ్చలు ఏర్పడి చర్మం మెత్తగా కనిపిస్తుంది; సాధారణంగా ఆ గొట్టాలకి రెండు చివరల చర్మం కింద చిన్న గడ్డలను గమనించవచ్చు.
    • తీవ్ర సంక్రమణం/ఇన్ఫెక్షన్.
    • చర్మ క్యాన్సర్.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

హైడ్రాడెనిటిస్ సూపురటైవకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. బ్యాక్టీరియా మరియు ఇతర పదార్ధాలు జుట్టు ఫోల్లికాల్ లోపల చిక్కుకున్నప్పుడు ఈ వ్యాధి ప్రారంభమవుతుంది.

జన్యుపరమైన మరియు పర్యావరణ కారకాలు ఈ పరిస్థితితో ముడిపడి ఉండవచ్చు.

ప్రమాద కారకాలు:

  • బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ.
  • ఊబకాయం.
  • ధూమపానం.
  • లిథియం తీసుకోవడం.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

హైడ్రాడెనిటిస్ సూపురటైవను నిర్ధారణ చేయడానికి వైద్యులు రోగి యొక్క ఆరోగ్య చరిత్రను తెలుసుకుంటారు మరియు సంకేతాలు మరియు లక్షణాలను జాగ్రత్తగా అంచనా వేస్తారు.

పరీక్షలు వీటిని కలిగి ఉండవచ్చు:

  • ఇతర సంక్రమణలను గుర్తించడానికి రక్త పరీక్షలు.
  • ఇతర సంక్రమణల సంభావ్యతను తొలగించటానికి చీము నుండి శ్వాబ్ తీసి పరీక్షించవచ్చు.

చర్మవ్యాధి నిపుణులు (dermatologist) లక్షణాల చికిత్స కోసం నొప్పి నివారణలు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎజెంట్లను సిఫారసు చేయవచ్చు.

వైద్యులు స్టెరాయిడ్లతో పాటు కొన్ని యాంటీబయాటిక్స్ను కూడా సూచిస్తారు.

హైడ్రాడెనిటిస్ సూపురటైవ చికిత్సలో హార్మోన్ల చికిత్స ఉత్తమమైనదని నిరూపించబడింది.

తీవ్ర సందర్భాల్లో శస్త్రచికిత్స అవసరం కావచ్చు.



వనరులు

  1. The Hidradenitis Suppurativa Foundation. The Hidradenitis Suppurativa Foundation, Inc. (HSF) is a 501(c)(3) nonprofit public benefit corporation, dedicated to improving research, education, and the quality of life and care for individuals and families affected by Hidradenitis Suppurativa (HS).. [Internet]
  2. National Institutes of Health. Hidradenitis suppurativa . U.S Department of Health and Human Services; [Internet]
  3. American Academy of Dermatology. Hidradenitis suppurativa. [Internet]
  4. Gregor Jemec, Jean Revuz, James J. Leyden. hidradenitis suppurativa. Springer Science & Business Media, 2006; 204 pages
  5. American Academy of Dermatology. Hidradenitis suppurativa. [Internet]

హైడ్రాడెనిటిస్ సూపురటైవ వైద్యులు

Dr. Pritish Singh Dr. Pritish Singh Orthopedics
12 Years of Experience
Dr. Vikas Patel Dr. Vikas Patel Orthopedics
6 Years of Experience
Dr. Navroze Kapil Dr. Navroze Kapil Orthopedics
7 Years of Experience
Dr. Abhishek Chaturvedi Dr. Abhishek Chaturvedi Orthopedics
5 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు