అధిక లిపోప్రొటీన్ అంటే ఏమిటి?
లిపోప్రొటీన్లు రక్తంలో కొలెస్ట్రాల్ను మోసే ఏజెంట్లు. ముఖ్యంగా రెండు రకాలైన లిపోప్రొటీన్లు ఉన్నాయి, అవి తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు లేదా లో డెన్సిటీ లిపోప్రొటీన్లు (LDL) దీనినే చెడు కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు మరియు అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ హై డెన్సిటీ లిపోప్రొటీన్ (HDL) దీనిని మంచి కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. ఎల్.డి. ఎల్ (LDL) స్థాయిలు అధికంగా ఉంటే గుండె జబ్బు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి, అయితే హెచ్.డి.ఎల్ (HDL) అధిక స్థాయిలు వాటి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. లిపోప్రొటీన్ ఏ (Lipoprotein a [LP a]) ఎల్.డి. ఎల్ (LDL) కొలెస్ట్రాల్ మాదిరిగానే ఉంటుంది మరియు దీని స్థాయి పెరుగుదల కూడా హృదయ వ్యాధులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ కొలెస్ట్రాల్లా యొక్క స్థాయిలు అధికమవ్వడం వలన అవి ధమనులలో (ఆర్టరీ) చేరి (పోగుపడి) మరియు ఆర్టరీలను ఇరుకుగా మార్చి అడ్డంకులు ఏర్పడేలా చేస్తాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
అధిక లిపోప్రొటీన్ స్థాయిలు కలిగిన వ్యక్తి ఎటువంటి లక్షణాలు లేకుండా సాధారణ జీవితాన్ని గడుపుతాడు. ఈ అధిక లిపోప్రొటీన్లు గుండె మరియు మెదడుకు సరఫరా అయ్యే రక్త నాళాలలో చేరిపోతాయి (పోగుపడతాయి). తర్వాత ఈ రక్త నాళాలు నిరోధించబడతాయి, మరియు ఆ అవయవాలకు రక్తం తగినంతగా సరఫరా జరగక గుండెపోటుకు లేదా స్ట్రోకు దారితీయవచ్చు. చాలామంది వ్యక్తులలో లిపోప్రొటీన్ల యొక్క అధిక స్థాయిలు ఈ ప్రాణాంతక సంఘటనలు జరిగినప్పుడు లేదా సాధారణ వైద్య పరీక్షల సమయంలో మాత్రమే గుర్తించబడతాయి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అధిక లిపోప్రొటీన్ స్థాయిలకు కొన్ని కారణాలు ఈ క్రింద ఉన్నాయి:
- అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉండే సరిలేని ఆహార విధానం.
- ఊబకాయం.
- శారీరక శ్రమ లేకపోవడం.
- జన్యు సిద్ధత.
- ఒత్తిడి.
- అధిక రక్త పోటు.
- ధూమపానం.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
వ్యాధి నిర్ధారణలో ఇవి ఉంటాయి:
- ఆరోగ్య చరిత్ర మరియు కుటుంబ చరిత్రను తెలుసుకోవడం.
- శారీరక పరిక్ష.
- థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను తనిఖీ చేయడానికి రక్త పరీక్షలు. ఎందుకంటే, అధిక థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు కూడా కొలెస్ట్రాల్ స్థాయి పెంచుతాయి.
- చర్మ జీవాణుపరీక్ష (బయాప్సీ).
- అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగించే పాలిసిస్టిక్ అండాశయ సిండ్రోమ్ ( polycystic ovary syndrome) సంభావ్యతను నిర్మూలించడానికి పెల్విక్ అల్ట్రాసౌండ్ను నిర్వహించడం.
అదనపు కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి వైద్యులు ఈ క్రింది చికిత్సా విధానాలను సిఫార్సు చేస్తారు:
- సాధారణ బిఎంఐ (BMI) పరిధికి చేరడానికి క్రమమైన వ్యాయామం.
- ధూమపానాన్ని విడిచిపెట్టడం.
- లిపోప్రొటీన్ అఫెరిసిస్ (Lipoprotein apheresis), దీనిలో రక్తం నుండి లిపోప్రొటీన్ ఫిల్టర్ చేయబడి తర్వాత తొలగించబడుతుంది.
- కొలెస్ట్రాల్ వినియోగాన్ని తగ్గించే విధంగా ఆహార నిర్వహణ.
- ఒత్తిడి నిర్వహణ.
- వ్యక్తికీ సరిపోయే/తగిన కొలెస్ట్రాల్-తగ్గించే మందుల వాడకం.