హిస్టోప్లాస్మోసిస్ అంటే ఏమిటి?
హిస్టోప్లాస్మోసిస్ ను “డార్లింగ్ వ్యాధి” అని కూడా పిలుస్టార్. ఇది హిస్టోప్లాస్మా కాప్సులాటం అనబడే శిలీంద్రంవల్ల సంభవించే ఓ శిలీంధ్ర సంక్రమణం. ఇది మిస్సిస్సిప్పి మరియు ఒహియో నదీ లోయలు మరియు అమెరికా యొక్క ఈశాన్య ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపించి ఉన్న వ్యాధి. ఇది సెంట్రల్ అమెరికా మరియు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా మరియు ఆస్ట్రేలియా ప్రాంతాలలో కూడా ఉంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
సాధారణంగా, హిస్టోప్లాస్మోసిస్ వ్యాధిగ్రస్థులైనవాళ్లు హిస్టోప్లాస్మోసిస్ యొక్క లక్షణాలను కొద్దిగా అనుభవిస్తారు లేక ఎలాంటి వ్యాధి లక్షణాల్ని అనుభవించరు.
హిస్టోప్లాస్మోసిస్ సంకేతాలు మరియు లక్షణాలు:
- జ్వరం
- చలి పట్టడం (chills)
- కఫముతో కూడిన (ఉత్పాదక) దగ్గు
- తలనొప్పి
- ఆకలి లేకపోవడం
- శోషరస గ్రంధులను బాధించే లింఫాడెనోపతి
- కాలేయం లేదా ప్లీహము యొక్క విస్తరణ
- చర్మం కింద పెరిగే సబ్కటానియోస్ నోడ్యూల్స్
- చీముపట్టే కీళ్ళవాతం (suppurative arthritis)
- ఛాతీ మీద మచ్చలు లేదా గాయం మచ్చలు
ప్రధాన కారణాలు ఏమిటి?
హిస్టోప్లాస్మోసిస్ అనేది హిస్టోప్లాస్మా కాప్సులాటం అనే ఓ ఫంగస్ వల్ల సోకే సంక్రమణం. ఇది సాధారణంగా గాలిలో వచ్చే హిస్టోప్లాస్మా ఫంగస్ యొక్క బీజాంశాలని పీల్చుకోవడం ద్వారా సంభవిస్తుంది.
శుభ్రపరిచే సమయంలో తరచుగా పక్షి రెట్ట నుండి వచ్చే హిస్టోప్లాస్మా శిలీంద్రం యొక్క బీజాంశాలు గాలిద్వారా ఎగిరిపడొచ్చి మనుషులకు అంటువ్యాధిగా సోకుతుంది.
ప్రమాద కారకాలు:
- చెట్ల కోత మరియు కూల్చివేత పనిలో పాల్గొన్న రైతులు లేదా కార్మికులు ఈ వ్యాధిని పొందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే బీజాంశం సాధారణంగా నేలలో కూడా కనిపిస్తూ ఉంటుంది..
- మిసిసిపీ మరియు ఒహియో నదీ లోయలు మరియు ఈశాన్య (ఉత్తర-తూర్పు) యునైటెడ్ స్టేట్స్ ప్రాంతాలలో నివసించే ప్రజలు ఈ ప్రాంతాలలో నేల విస్తీర్ణంలో ఫంగస్ ఎక్కువగా ఉండటం వలన హిస్టోప్లాస్మోసిస్ ద్వారా సాధారణంగా బాధితులవుతుంటారు..
- బలహీన రోగనిరోధక వ్యవస్థ కల్గిఉన్న పసిపిల్లలు మరియు వయోజన ప్రజలు కూడా ఈ వ్యాధి యొక్క తీవ్ర రూపంతో బాధపడుతుంటారు.
హిస్టోప్లాస్మోసిస్ ను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
హిస్టోప్లాస్మోసిస్ వ్యాధి నిర్ధారణలో వైద్య చరిత్ర మరియు ప్రయాణ చరిత్ర, క్లినికల్ పరీక్ష మరియు ప్రయోగశాల పరిశోధనలతో పాటు వ్యాధి లక్షణాలను వైద్యుడు అంచనా వేస్తారు . .
దీనికి వైద్య పరిశోధనలు ఇలా ఉన్నాయి:
- హిస్టోప్లాస్మా యాంటిజెన్లను గుర్తించడానికి రక్తం మరియు మూత్ర పరీక్ష
- ఛాతీ ఎక్స్-రే మరియు CT స్కాన్లు
- ఈ సంక్రమణ పరీక్షకు కఫము సాగు (Sputum culture)
- ఊపిరితిత్తుల బయాప్సీ (Lung biopsy)
హిస్టోప్లాస్మోసిస్ చికిత్స మరియు చికిత్సకు పట్టే వ్యవధి వ్యాధి యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది.
ఈవ్యాధి స్వల్పమైన దశలో ఉంటే గనుక సాధారణంగా ఏ ప్రత్యేకమైన చికిత్స లేకుండానే దానంతటదే నయమై తగ్గిపోతుంది.
ఓ మోస్తరు నుండి తీవ్రమైన కేసులకు, మీ డాక్టర్ యాంటీ ఫంగల్ ఎజెంట్లను (మందులను) నోటిద్వారా కడుపుకు తీసుకోవదానికి ఇవ్వచ్చు లేదా నరాలద్వారా కూడా ఆ మందుల్ని తీసుకోవచ్చు.