హైపోవోలెమియా - Hypovolemia in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 03, 2018

July 31, 2020

హైపోవోలెమియా
హైపోవోలెమియా

హైపోవోలెమియా అంటే ఏమిటి?

హైపోవొలెమియా అంటే రక్తం, ప్లాస్మా మరియు / లేదా ప్లాస్మా నీరులో నష్టం కారణంగా శరీరంలో రక్తం యొక్క పరిమాణం తగ్గిపోతుంది, తీవ్రమైన డీహైడ్రేషన్ (నిర్జలీకరణ) లేదా రక్త నష్టం సంభవించినప్పుడు ఇది ఏర్పడుతుంది. ఇది చివరికి రక్తనాళాలలో రక్త శాతం తగ్గిపోవడానికి మరియు కణజాలాలలోకి రక్త సరఫరా కూడా తగ్గిపోయేలా చేస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే అది ప్రాణాంతకం కావచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

హైపోవోలెమియా యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:

  • బలహీనత
  • చర్మం పాలిపోవడం
  • చల్లగా, జిడ్డుగా ఉండే చర్మం లేదా చెమట, తేమ చర్మం
  • వేగవంతమైన శ్వాస
  • ఆందోళన
  • అల్పరక్తపోటు (హైపోటెన్షన్)
  • మూత్రం ఉత్పత్తి తక్కువ కావడం లేదా అసలు లేకపోవడం
  • గందరగోళం స్థితి
  • స్పృహ కోల్పోవడం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

హైపోవొలెమియా వీటి వలన కలుగవచ్చు:

  • వీటి కారణంగా శరీర ద్రవాల నష్టం కలుగవచ్చు:
    • తీవ్రమైన నిరంతర అతిసారం మరియు వాంతులు
    • విస్తృతమైన కాలిన గాయాలు
    • అధికంగా చెమట పట్టుట
    • డైయూరేటిక్ల  యొక్క ఉపయోగం
    • మూత్రపిండ వ్యాధుల వలన మూత్ర విసర్జన పెరగడం  
  • వీటి కారణంగా రక్త నష్టం కలుగవచ్చు:

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

సంకేతాలు మరియు లక్షణాలు మరియు పూర్తి భౌతిక పరీక్ష ఆధారంగా వైద్యులు రోగ నిర్ధారణ చేస్తారు. ఈ క్రింది పరీక్షల ఆధారంగా మరింత విశ్లేషణ జరుగుతుంది:

  • మూత్రపిండాల పనితీరు, పూర్తి రక్త గణన (complete blood count, CBC) మరియు గుండె కండరాల నష్టాన్ని పరీక్షించడానికి రక్త పరీక్ష
  • ఎక్స్-రే
  • అల్ట్రాసౌండ్
  • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్
  • ఎండోస్కోపీ
  • ఎఖోకార్డియోగ్రామ్ (Echocardiogram)
  • రైట్ హార్ట్ కాథెటరైజేషన్ (Right heart catheterisation)
  • మూత్రాశయ కాథరిటరైజేషన్ (Urinary catheterisation)

హైపోవోలెమియా చికిత్స వీటిని కలిగి ఉంటుంది:

  • చికిత్సలో మొదటి విధానం రక్తం మరియు ద్రవ పదార్ధాలను భర్తీ చేయడానికి వాటిని కొలుస్తారు,  తర్వాత వాటిని వివిధ ఓరల్ (నోటి ద్వారా తీసుకునే) రీహైడ్రేటింగ్ ద్రవాల ద్వారా ఇస్తారు లేదా  హైపోవోలెమియా యొక్క కారణం మీద ఆధారపడి ఇంట్రావీనస్ (IV - నరాల ద్వారా) రక్తం లేదా ద్రవాలను ఎక్కిస్తారు. ఇంకా, హైపోథెర్మియాను నివారించడానికి, వ్యక్తిని సౌకర్యవంతంగా మరియు వెచ్చగా ఉంచాలి.
  • అలెర్జీ కారణంగా ఐతే, యాంటీ-అలెర్జిన్స్ ను ఇవ్వాలి.
  • తీవ్రమైన సందర్భాల్లో, రక్తపోటును మరియు కార్డియాక్ అవుట్పుట్ (గుండె నుంచి ప్రసరించబడిన రక్తం)ను పెంచడానికి, నోర్పిన్ఫ్రైన్ (norepinephrine), డోపామైన్ (dopamine), ఎపినఫ్రైన్ (epinephrine) లేదా డోబ్యుటమైన్ (dobutamine)వంటి మందులు ఇవ్వవచ్చు.



వనరులు

  1. MedlinePlus Medical: US National Library of Medicine; Hypovolemic shock
  2. Mohanchandra Mandal. Ideal resuscitation fluid in hypovolemia: The quest is on and miles to go!. Int J Crit Illn Inj Sci. 2016 Apr-Jun; 6(2): 54–55. PMID: 27308250
  3. Agency of Clinical innovation. Management of Hypovolaemic Shock in the Trauma Patient. Government of New South Wales. [internet].
  4. Clinical Trials. Hypertonic Saline With Dextran for Treating Hypovolemic Shock and Severe Brain Injury. U.S. National Library of Medicine. [internet].
  5. Clinical Trials. Autonomic Challenges From Mild Hypovolemia and Mechanical Ventilation. U.S. National Library of Medicine. [internet].

హైపోవోలెమియా వైద్యులు

నగర వైద్యులు Hematologist వెతకండి

  1. Hematologist in Surat