ఇన్ఫలమేటరీ వ్యాధి (వాపు లేదా మంటకు సంబంధించినది) అంటే ఏమిటి?
వాపు లేదా మంట అనేది ఆకస్మిక గాయం లేదా గాయయానికి శరీరం యొక్క సహజ ప్రతిస్పందన . ఇది గాయం మానుతున్న ప్రక్రియ యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది; అయితే, ఇన్ఫలమేటరీ ప్రతిస్పందన నియంత్రణలో లేనప్పుడు, సాధారణ రక్షిత ప్రతిస్పందన (protective response) హానికరమై వ్యాధికి కారణమవుతుంది. ఇటువంటి వ్యాధిని ఇన్ఫలమేటరీ వ్యాధిగా సూచిస్తారు. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, అలెర్జీలు, ఉబ్బసం, హెపటైటిస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ వ్యాధి (IBD), మరియు గ్లోమెరులర్ నెఫ్రిటిస్ వంటి విస్తారమైన వ్యాధులు ఈ ఇన్ఫలమేటరీ వ్యాధిని కలిగి ఉంటాయి.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వాపు లేదా మంట (ఇన్ఫలమేషన్) శరీరం యొక్క రోగనిరోధక ప్రతిస్పందన. ఇది తీవ్రమైనదిగా లేదా దీర్ఘకాలికంగా ఉంటుంది. ఈ కింది సంకేతాలు గమనించబడతాయి:
- నొప్పి
- ఎర్రదనం
- వాపు
- జాయింట్ కదిలించలేకపోవడం
- కండరాల నొప్పి మరియు సంకోచాలు
- జ్వరం
- అలసట
- నోటి పుళ్ళు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఇన్ఫలమేటరీ వ్యాధులు అనియంత్రమైన ఇన్ఫలమేటరీ ప్రతిస్పందన కారణంగా సంభవించినప్పటికీ, అటువంటి అనియంత్ర ప్రతిస్పందనలకు కారణమయ్యే కారకాలు ఇన్ఫలమేటరీ వ్యాధులు యొక్క ప్రధాన కారణాలు. కొన్ని కారకాలు ఈ క్రింద పేర్కొనబడ్డాయి:
- గాయం
- అంటువ్యాధులు/సంక్రమణలు
- జన్యు కారకాలు
- ఒత్తిడి
- ధూమపానం, మద్యపానం లేదా మాదకద్రవ్యాల దుర్వినియోగం
- సిలికా మరియు ఇతర ఎలెర్జిన్లకు గురికావడం
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
సరైన నిర్ధారణ కోసం, వైద్యులు ముందుగా పూర్తి ఆరోగ్య చరిత్రను తెలుసుకుంటారు మరియు పైకి కనిపించే లక్షణాలను అధ్యయనం చేయడానికి క్షుణ్ణమైన భౌతిక పరీక్షను నిర్వహిస్తారు. వ్యాధి నిర్ధారణలో ఈ క్రింది పరీక్షలు ఉంటాయి:
- రక్త పరీక్ష
- కండరాల జీవాణుపరీక్ష (Muscle biopsy)
- చర్మపు కణజాలాల హిస్టోలొజికల్ (Histological) పరీక్ష
- ఎక్స్-రే, అల్ట్రాసౌండ్, సిటి (CT) మరియు ఎంఆర్ఐ (MRI) పరీక్షలు
ఆటోఇమ్మ్యూన్ వ్యాధుల లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలతో కలిసిపోవడం (ఓవర్ లేప్) వలన, బేధాదాత్మక నిర్దారణ (differential diagnosis) అనేది చాలా అవసరం. అందువల్ల, ఒక నిర్దిష్ట ఆటోఇమ్మ్యూన్ వ్యాధిని నిర్దారించడానికి ఆ వ్యాధి ఉనికిని సూచించే యాంటీబాడీలను గుర్తించడానికి ఇమ్యునోసోర్బెంట్ ఎసైలు (immunosorbent assays) నిర్వహిస్తారు.
ఇన్ఫలమేటరీ వ్యాధుల చికిత్స ప్రధానంగా ఇన్ఫలమేటరీ విధానం మీద లేదా వివిధ ప్రేరేపకాలకు రోగనిరోధక శక్తి యొక్క ప్రతి స్పందనల మీద దృష్టి పెడుతుంది. ఈ క్రింది చికిత్సను సూచించవచ్చు:
- మందులు
- నాన్-స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDs)
- స్టెరాయిడ్స్
- ఇమ్యూన్ సప్రెసెంట్స్ (Immune suppressants)
- కండరాలను సడలించేవి (Muscle relaxants)
- బయోలాజికల్ ఎజెంట్లు
-
కీళ్ళ యొక్క శస్త్రచికిత్స భర్తీ (Surgical replacement of joints)
ఇన్ఫలమేషన్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలను దీర్ఘకాలిక అనారోగ్యంగా పరిగణించకూడదు. యోగ మరియు ధ్యానం ఒత్తిడిని తొలగించడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరముగా ఉండటం, పోషకమైన ఆహారం తీసుకోవడం మరియు ఒత్తిడి నుండి దూరంగా ఉండటం వంటివి ఇటువంటి వ్యాధుల సంభావ్యతను తొలగిస్తాయి.