కడుపులో పురుగులు అంటే ఏమిటి?
కడుపులో పురుగులు సంక్రమణ/ఇన్ఫెక్షన్ అనేది సాధారణమైన సంక్రమణ రకం ఇది సాధారణంగా పేద ఆర్థిక పరిస్థితులు మరియు అనారోగ్యకర జీవన పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. ఇది విప్వార్మ్ (whipworms), ఏలికపాము (టేప్వార్మ్స్), కొంకిపురుగు (హుక్స్వార్మ్స్) , నులిపురుగు (థ్రెడ్వార్మ్స్) మరియు రౌండ్వార్మ్స్ (roundworm) వంటివాటి వల్ల సంభవించవచ్చు. ఈ పరాన్నజీవులు (parasites) శరీరంలో ముఖ్యంగా ప్రేగులులో పునరుత్పత్తి అవుతాయి.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
కడుపులో పురుగుల సంక్రమణల/ఇన్ఫెక్షన్ల యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి:
- అలసట
- అధికంగా బరువు తగ్గిపోవడం
- జ్వరం
- వికారం
- ఉబ్బరం
- కడుపు తిమ్మిరి
- కామెర్లు
- మృదుగా, జిగురుగా ఉండే మలం లేదా నీళ్ళ అతిసారం
- రక్త విరేచనాలు (రక్తం మరియు శ్లేష్మంతో నీళ్ళ విరేచనాలు)
- పాయువు (మలద్వారం) చుట్టూ దురద
- పిల్లలు రాత్రిపూట నిద్రపోకుండా, చిరాకుగా లేదా తిక్కగా ఉంటారు
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
కడుపులో పురుగుల సంక్రమణకు కారణమయ్యే పరాన్నజీవులు వివిధ మార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశించవచ్చు. వ్యక్తికి సంక్రమణను కలిగించే సాధారణ కారకాలు:
- పరిశుభ్రత లేకపోవడం
- పచ్చి లేదా వండని ఆహారం తినడం
- కలుషిత ఆహార మరియు నీటి ఉపయోగం
- అనారోగ్యకరమైన ప్రాంతాలలో చెప్పులు లేకుండా నడవడం
- కలుషిత మట్టిని తాకడం
- ప్లేట్లు, తినే పాత్రలు, బొమ్మలు, టాయిలెట్ సీట్లు, పరుపులు మొదలైనటువంటి కలుషితమైన వస్తువులను తాకడం (సంబంధం కలిగి ఉండడం).
- దగ్గరగా ఉండడం వలన ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
రోగ నిర్ధారణ ప్రధానంగా రోగి యొక్క సంకేతాలు మరియు లక్షణాల ఆధారంగా ఉంటుంది మరియు వైద్యులు ఈ కింది పరీక్షలను ఆదేశిస్తారు/నిర్వహిస్తారు:
- స్టూల్ రొటీన్ (Stool routine) లేదా సంక్రమణ నిర్దారణ కోసం మల సాగు
- టేప్ పరీక్ష(Tape test): ఈ పరీక్షలో, పరాన్నజీవుల గుడ్లు యొక్క మైక్రోస్కోపిక్ పరీక్ష చేయబడుతుంది, అంటే పాయువు/మలద్వారం చుట్టూ ఉన్న చర్మంపై సెల్లోఫేన్ టేప్ను (cellophane tape) నొక్కిపెడతారు, తర్వాత మైక్రోస్కోప్ ద్వారా పరిశీలిస్తారు.
- విజువల్ పరీక్ష(Visual examination): పిల్లల పాయువు/మలద్వారం, లోదుస్తుల లేదా డైపర్లు పరిశీలించడం.
కడుపులో పురుగుల సంక్రమణ యొక్క నిర్వహణ:
- కడుపులో పురుగుల సంక్రమణ నిర్వహణకు తగిన పరిశుభ్రమైన విధానాలు పాటించడం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
- పాఠశాల పిల్లలు కోసం పారిశుధ్య పద్ధతులు మెరుగుపరచడం వారు చేతులు కడుగుకోవడాన్ని ప్రోత్సహించడం.
- ఆరోగ్యం మరియు పరిశుభ్రత వంటి ఆరోగ్యకరమైన నడవడికల గురించి తెలియజేయడం సంక్రమణల వ్యాప్తిని మరియు మళ్ళి సంక్రమణ సంభవించడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
- తగినంతగా పారిశుద్ధ్య సౌకర్యాలను అభివృద్ధి చేయడం.
- అప్పుడప్పుడు పొట్టలోని పురుగులను నిర్మూలించే (డివార్మింగ్) మాత్రలు ఉపయోగించడం కూడా సహాయపడుతుంది.
- ప్రీస్కూల్ పిల్లలకు విటమిన్ ఏ (A) తో పాటు అదనపు పోషకాలని అందించడం.
- అంత్హెల్మెంతిక్ (anthelminthic) మందులతో చికిత్సను అందించడం.