ఇనుము లోపం ఏమిటి?
శరీరంలోని ఇనుము స్థాయిలు సాధారణంగా పురుషుల్లోని రక్తంలో 13.5 నుండి 17.5 గ్రా / dL మరియు మహిళల్లోని రక్తంలో 12.0 నుండి 15.5 g / dL వరకు ఉంటుంది. ఈ స్థాయిలకు తక్కువగా రక్తంలో ఇనుము ఉంటే ఆ వ్యక్తికి ఇనుము లోపం ఉందని చెప్తారు. ఇనుము తన యొక్క ఇతర విధులు నిర్వహించడంతోపాటు, రక్తంలో ఉండే హేమోగ్లోబిన్ లో ఓ ప్రధాన భాగంగా ఉంటుంది.
ఇనుము లోపం ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఇనుము లోపం రుగ్మత తరచుగా ఇలాంటి సంకేతాలు, లక్షణాల్ని కల్గి ఉంటుంది:
- తక్కువ హిమోగ్లోబిన్ కారణంగా రక్తహీనత మరియు రక్త కణాలు ఇనుము లోపం కారణంగా అసంపూర్ణంగా ఉంటాయి
- ఆయాసం మరియు అలసట
- రోగనిరోధకత తగ్గడం, తద్వారా వ్యక్తి అంటురోగాలకు గురి కావడం
- పాలిపోయిన చర్మం
- జుట్టు ఊడుట
- ఎరుపెక్కి, వాపుదేలిన నాలుక
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఇనుము లోపం యొక్క ప్రధాన కారణాలలో ఒకటి ఇనుము యొక్క అపశోషణం. ఇనుము సాధారణంగా శాకాహారులు మరియు వారి ఆహారంలో ఉండదు. అలాగే కాల్షియం ఇనుము శోషణతో జోక్యం చేసుకోగలదు; అందువలన, ఇనుము పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలను (ఐరన్-రిచ్ ఫుడ్ను) పాలు లేదా పాల ఉత్పత్తులతో తీసుకోకూడదు. కొన్ని రుగ్మత పరిస్థితులకు ఎక్కువ మొత్తంలో ఇనుము తీసుకోవడం అవసరం, ఉదాహరణకు, గర్భధారణ సమయంలో ఇనుము ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి. పెద్ద మొత్తంలో రక్తం నష్టాన్ని కలిగించే ఏదైనా ఆకస్మిక గాయం లేదా శస్త్రచికిత్స అనంతరం వ్యక్తి ఇనుము లోపాన్ని ఎదుర్కోవచ్చు. అందువలన శిశుజననం తర్వాత మహిళల్లో ఇనుము లోపం కూడా గమనించవచ్చు. ఋతుస్రావరక్త నష్టం అనేది మహిళల్లో ఇనుము లోపం యొక్క అధిక ప్రాబల్యానికి దోహదపడే మరో అంశం.
ఇనుము లోపం రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ఇనుము లోపం యొక్క నిర్ధారణ క్లినికల్ పరీక్షతో ప్రారంభమవుతుంది. రక్తం పరీక్ష మరియు హేమోగ్లోబిన్ మరియు హేమటోక్రిట్ పరీక్ష సాధారణంగా ఇనుము లోపం రుగ్మత నిర్ధారణ కోసం సరిపోతాయి. ఇనుము అధికంగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం మరియు ఐరన్సప్లిమెంట్ మందులసేవనం చికిత్సలో భాగంగా ఉంటుంది. ఐరన్ మాత్రలు ఔషధాల అంగళ్లలో “ఓవర్ ది కౌంటర్” గా అందుబాటులో ఉన్నాయి; అయినప్పటికీ, వ్యక్తి వీటిని సేవించేటపుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీటిని సేవించినపుడు మలబద్దకం ఏర్పడే అవకాశం ఉంది. పాలుతో పాటుగా ఐరన్సప్లిమెంట్లను సేవించడం నివారించండి ఎందుకంటే పాలు ఇనుము యొక్క శోషణకు అడ్డు తగులుతుంది కాబట్టి. తీవ్రమైన రక్తనష్టం కారణంగా ఇనుము లోపం రుగ్మత సంభవించినట్లయితే, రక్త మార్పిడి అవసరం కావచ్చు.