సెబోరిక్ కెరటోసిస్ అంటే ఏమిటి?
సెబోరిక్ కెరటోసిస్ రుగ్మత ఒక సాధారణమైన క్యాన్సర్ కాని (non-cancerous) చర్మం పెరుగుదల. ఇది సాధారణంగా ముసలివాళ్ళలో కనిపిస్తుంది. చాలా సందర్భాలలో ఇది ప్రమాదకరం కాదు గాని మనిషికి వికారమైన రూపాన్ని కలుగజేస్తుంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ఈ రకమైన పెరుగుదల ముఖం, వీపు, భుజాలు లేదా ఛాతీపై కనిపిస్తుంది. ఇది నెత్తిచర్మంపై తక్కువగా వస్తుంది.
- ఇది మైనంలా, ఉబ్బెత్తుగా ఉంటుంది మరియు పరిమాణంలో సాధారణంగా కొన్ని సెంటీమీటర్ల పరిమాణం పెరుగుతుంది.
- గుండ్రని లేదా అండాకారంలోని ఈ పెరుగుదల రంగు కమలిన రంగు, ముదురు గోధుమరంగు, కొన్నిసార్లు నలుపు రంగులో కూడా ఉండవచ్చు.
- సెబోరెక్టిక్ కెరాటోటిక్ పెరుగుదలలు సాధారణంగా "అతికించిన" రూపాన్ని కలిగి ఉండే పెరుగుదలలుగా వర్ణించబడ్డాయి.
- ఇవి అరుదుగా బాధను కల్గిస్తాయి, కానీ దురదగా ఉంటాయి, ముఖ్యంగా దుస్తులు లేదా ఉపకరణాదులతో ఇవి తాకబడినపుడు దురదపెడతాయి.
- పైకి కనిపించే రూపం ఆధారంగా, ఈ పెరుగుదలల్ని అనేక రూపనిర్మాణాలు కలవిగా వర్గీకరించవచ్చు.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ అరుదైన పరిస్థితికి ఖచ్చితమైన కారణం లేదు. అయితే, ముసలివాళ్ళు అతి సాధారణంగా ఈ రుగ్మతకు గురవుతుంటారు.
- సేబోర్హీక్ కెరటోసిస్ పెరుగుదలల చరిత్ర కల్గిన కుటుంబంలో జన్మించినవారికి ఈ రుగ్మత వచ్చే ప్రమాదముంటుంది.
- తరచుగా ఎండ (సూర్యరశ్మి) తగిలే వ్యక్తులకు ఈ రుగ్మత రావచ్చని చాలినంతగా లేని రుజువులు చెబుతున్నాయి.
- ఈ పెరుగుదల అంటువ్యాధి కాదు కాబట్టి ఒకర్నొకరు తాకడంవల్ల వ్యాధి సోకదు.
వ్యాధి ఎలా నిర్ధారణ చేయబడుతుంది మరియు దీనికి చికిత్స ఏమిటి?
డాక్టరు పాచెస్ చూడటం ద్వారానే పరిస్థితిని విశ్లేషించవచ్చు. అయినప్పటికీ, మెలనోమాను లేదా ఏదైనా ఇతర ప్రాణాంతకతను తోసిపుచ్చడానికి, కణజాలం యొక్క బయాప్సీ పరీక్షకు వైద్యుడిచే సలహా ఇవ్వబడుతుంది. సాధారణంగా, ఇతర విశ్లేషణ పరీక్షలు అవసరం లేదు.
సంప్రదాయబద్ధంగా, దీనికి చికిత్స అవసరం లేదు. ఇది దురద లేదా బాధాకరంగా మారితే తొలగునచేయవచ్చు. సౌందర్య కారణాల దృష్ట్యా, సిబోర్హీక్ కెరాటోసిస్ పెరుగుదలలను తొలగించబడవచ్చు. శస్త్రచికిత్సతో ఈ వృద్ధిని వివిధ మార్గాల ద్వారా తొలగించవచ్చు..
- వీటిని లేజర్ల సహాయంతో లేదా ద్రవ నత్రజనిని ఉపయోగించే క్రయోసర్జరీ ద్వారా తొలగించవచ్చు.
- విద్యుత్తు శస్త్రచికిత్స ఈవృద్ధిని వదిలించుకోవడానికి మరో పద్ధతి. ఇందులో కెరాటోసిస్ ను తొలగించడానికి కరెంటును ఉపయోగించడం జరుగుతుంది.
- దీనికున్న మరొక శస్త్రచికిత్సా విధానం “కురెట్టేజ్.” ఈ విధానం శస్త్రచికిత్సలో పెరుగుదలను తొలగించి తీసేయడం (scooping out) జరుగుతుంది.
ఒకే స్థలంలో పునరావృతమయ్యే అవకాశం లేనప్పటికీ, మీ శరీరం యొక్క ఇతర భాగంలో పెరుగుదల సంభవించవచ్చు.