ప్రసూతి మరియు కాన్పునొప్పులలో సమస్యలు - Labor and Delivery Complications in Telugu

Dr. Ayush Pandey

December 14, 2018

July 31, 2020

ప్రసూతి మరియు కాన్పునొప్పులలో సమస్యలు
ప్రసూతి మరియు కాన్పునొప్పులలో సమస్యలు

ప్రసూతి మరియు కాన్పునొప్పులలో సమస్యలు అంటే ఏమిటి?

గర్భధారణ మరియు శిశువుకు జన్మనివ్వడం అనేవి మహిళ యొక్క జీవితంలో ఒక ప్రత్యేక అనుభవాలు. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు సాధారణంగా ఈ పనికి భంగం కలిగిస్తాయి, కండరాల సంకోచా వ్యాకోచాలు బలహీనపడడం లేదా గర్భాశయ విస్తారణ (cervix dilation) సరిగ్గా లేకపోవడం వంటివి. అన్ని రకాల ప్రసూతి మరియు కాన్పునొప్పులలో సమస్యల కోసం ఉపయోగించే పదం 'ప్రసూతి సమస్యలు' (obstetric complications) అది తల్లి మరియు శిశువు ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు.

నీటి సంచి త్వరగా చీలిపోయినప్పుడు దానికి చికిత్స చేయకపోతే అది సంక్రమణకు కారణం కావచ్చు. ఇతర సమస్యలలో తల్లి సరైన పోషకాహార తీసుకోకపోవడం, చిన్న చిన్న శారీరక అసాధారణతలు మరియు జనన సమస్యలు వంటివి ఉంటాయి. ఈ సంక్లిష్టతలు/సమస్యలు శిశువుపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి మరియు భవిష్యత్తులో ప్రవర్తనా సంబంధ సమస్యలను కూడా కలిగిస్తాయి.

అదేవిధంగా, మొదటి డెలివరీ/ప్రసవంలో కాన్పునొప్పుల సమయం 20 గంటలు దాటినప్పుడు మరియు తరువాత డెలివరీలలో 14 గంటలు దాటినప్పుడు అది సమస్యగా పరిగణింపబడుతుంది. అందువల్ల, శిశువు మరియు తల్లి మీద హానికర ప్రభావాన్ని నివారించడానికి ఈ సమస్యల మరియు సంబంధిత లక్షణాల అవగాహన అనేది చాలా ముఖ్యం.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

నొప్పుల పురోగతి యొక్క రకం ఆధారంగా సమస్యలు/సంక్లిష్టతలు మారుతూ ఉంటాయి. అవి:

  • పెరినియల్ చీలిక (Perineal tear)
  • శిశువు యొక్క అసాధారణ హృదయ స్పందన రేటు
  • బొడ్డు తాడు సమస్యలు
  • ఉమ్మా నీటి సమస్యలు
  • శిశువు మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం
  • ప్రసవ సమయంలో భుజం ఇరుక్కుని ఉండిపోవడం
  • అధికమైన యోని రక్తస్రావం
  • రక్తంతో కూడిన శ్లేష్మస్రావం
  • గర్భస్రావం వలన సంభవించే సమస్యలు
  • ఎక్లమ్ప్సియా (Eclampsia) - అధిక రక్తపోటు మరియు గర్భధారణ సమయంలో మూత్రంలో ప్రోటీన్లు ఉండడం; ఇది ఒక వైద్య అత్యవసర పరిస్థితి (medical emergency)
  • గర్భాశయం చిరిగిపోవడం
  • ఎక్టోపిక్ గర్భం (గర్భాశయం వెలుపల పిండం అమరిక, ప్రత్యేకంగా ఫెలోపియన్ నాళాలలో)
  • చర్మ రంగు మారిపోవడం
  • బిడ్డ అడ్డం తిరగడం  
  • ఫైబ్రాయిడ్లు
  • శిశువు మరియు శిశువు తల పెద్ద పరిమాణంలో ఉండడం
  • యోని గోడల నుండి మాయ వేరవడంలో సమస్యలు

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ సమస్యల యొక్క ముఖ్య కారణాలు, వీటిని కలిగి ఉంటాయి:

  • తల్లికి పోషకాహార లోపం
  • ఆల్కాహాల్ వినియోగం లేదా మద్యపానం
  • చిన్న చిన్న శారీరక  సమస్యలు
  • జనన సమస్యలు
  • మునుపటి సిజేరియన్లు  
  • గర్భాధారణ  ప్రేరిత రక్తపోటు
  • ఊబకాయం

ఇతర సమస్యలు ఉంటాయి:

  • బొడ్డుతాడు సమస్యలు: కొన్ని సందర్భాల్లో, బొడ్డుతాడు శిశువు చేతుల్లో లేదా కాళ్ళలో చిక్కుకోవచ్చు. తీవ్రమైన సందర్భాలలో, తాడు శిశువు యొక్క మెడ చుట్టూ చిక్కుకోవచ్చు. దీనిని ఎదుర్కోవటానికి, మరణాన్ని నివారించడానికి సిజేరియన్ (శస్త్రచికిత్స) ప్రారంభించవచ్చు.
  • క్రమరహిత హృదయ స్పందన.
  • నొప్పులు రాకుండా నీరు ముందుగా స్రవించినట్లతే సమస్య తీవ్రం అవుతుంది.
  • గర్భాశయంలో చీలిక కారణంగా భారీ యోని రక్తస్రావం జరగడం లేదా గర్భాశయం సంకోచించడంలో (contract) అసమర్థత ఏర్పడడం. ఇది తల్లి మరణానికి కూడా దారితీయవచ్చు.
  • గర్భాధారణ సమస్యం 42 వారాల కంటే ఎక్కువగా ఉన్నా సమస్యలు తలెత్తుతాయి.
  • తల్లి వయస్సు ఎక్కువగా ఉంటే, అంటే 30 సంవత్సరాల పైన

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఫెటల్ డిస్ట్రెస్ (Foetal distress, పిండం అవస్థ పడడం) అనేది పిండం హృదయ స్పందన రేటు మరియు ఆక్సిజన్ స్థాయిలను ప్రభావితమయ్యే ఒక పరిస్థితి. దీని నిర్ధారణ ఫిటోస్కోప్ (fetoscope) లేదా కార్డియోటోకోగ్రఫీ (cardiotocography) సహాయంతో జరుగుతుంది.

పైన చెప్పిన సమస్యలకు చికిత్సా  విధానం తల్లి యొక్క ఆరోగ్య సమస్యలతో పాటు మారవచ్చు మరియు అవి వీటిని కలిగి ఉండవచ్చు:

  • తీవ్రమైన కేసుల్లో పూర్తీ విశ్రాంతి లేదా పర్యవేక్షణతో కూడిన విశ్రాంతి
  • రక్త మార్పిడి
  • తక్షణ సిజేరియన్ డెలివరీ
  • సాధారణ (యోని) ప్రసవానికి  సహాయంగా ఫోర్సెప్స్ (forceps) లేదా ఇదే పరికరాలను ఉపయోగించడం



వనరులు

  1. Eunice Kennedy Shriver National Institute of Child Health and Human Development. What are some common complications during labor and delivery?. US Department of Health and Human Services
  2. American Academy of Family Physicians. Labor, Delivery, and Postpartum Issues. [Internet]
  3. Women's health care physicians: The American College of Obstetricians and Gynecologists; Labor and birth
  4. Internation Scholarly Research Notices. Incidence of Obstetric and Foetal Complications during Labor and Delivery at a Community Health Centre, Midwives Obstetric Unit of Durban, South Africa. Volume 2011, Article ID 259308, 6 pages
  5. Encyclopedia on Earlychildhood Development. Aggression. University of Southern California, USA April 2003

ప్రసూతి మరియు కాన్పునొప్పులలో సమస్యలు వైద్యులు

Dr. Bhuvnesh kumar Ramakant Chaturvedi Dr. Bhuvnesh kumar Ramakant Chaturvedi General Physician
14 Years of Experience
Dr. Ravinder Kaur Dr. Ravinder Kaur General Physician
15 Years of Experience
Dr. Avijoy saha roy Dr. Avijoy saha roy General Physician
7 Years of Experience
Dr. Pallavi Patharwat Dr. Pallavi Patharwat General Physician
2 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

ప్రసూతి మరియు కాన్పునొప్పులలో సమస్యలు కొరకు మందులు

Medicines listed below are available for ప్రసూతి మరియు కాన్పునొప్పులలో సమస్యలు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.