లిస్టిరియాసిస్ అంటే ఏమిటి?
లిస్టిరియాసిస్ రుగ్మత “లిస్టెరియా మోనోసైటోజెనస్” అనే సూక్ష్మజీవి కారణంగా సంభవించే అతి తీవ్రమైన బాక్టీరియల్ సంక్రమణం. కొన్నిసార్లు, ఈ వ్యాధిని 'లిస్టిరియా' అని పిలుస్తారు. రుగ్మతకు కారణమైన సూక్ష్మజీవి (బాక్టీరియం) యొక్క పేరు మీద దీనికా పేరు వచ్చింది. ఈసంక్రమణ మూలం ఆహారములో ఉంటుంది, అందువలన, బ్యాక్టీరియా మొదట ప్రేగులను బాధిస్తుంది. సంక్రమణ సాధారణంగా గర్భిణీ స్త్రీలను మరియు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కల్గిన వ్యక్తులను బాధిస్తుంది. ఎలాంటి వారినంటే:
- సీనియర్ పౌరులు (వయస్సు ≥ 65 సంవత్సరాలు పైబడ్డవారు)
- క్యాన్సర్ , మూత్రపిండ వ్యాధి, లేదా డయాబెటిస్ రోగులు
- హెచ్ఐవి (HIV) సోకినవారు లేదా ఎయిడ్స్ (AIDS) రోగులు
- కొత్తగా పుట్టిన శిశువులు
దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
హానికర లిస్టిరియాసిస్ వ్యాధి విషయంలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పేగుల పరిధులను అతిక్రమించి వ్యాపిస్తుంది, అందుకే, సంబంధిత వ్యాధి లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతుంటాయి.
గర్భిణీ స్త్రీలు: ఈ రుగ్మతతో ఉండే కాబోయే తల్లులు జ్వరము మరియు ఫ్లూజ్వరాన్ని ను ఎదుర్కొంటారు. అయితే దీనికి చికిత్స చేయించుకోకుండా వదిలేస్తే, సంక్రమణ గర్భంలోని పిండానికి హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఈ రుగ్మత గర్భస్రావం మరియు అకాల ప్రసూతి (డెలివరీ) ప్రమాదాన్ని కూడా పెంచుతుంది . (మరింత సమాచారం: గర్భధారణ సమయ సంరక్షణ)
అయితే, సగటు రోగికి, సంక్రమణ ఈ క్రింది లక్షణాలకు కారణమవుతుంది:
- తలనొప్పి
- గందరగోళం
- మూర్ఛలు
- జ్వరం (ఫీవర్)
- మెడ పెడసరం
- వాంతులు
- అతిసారం
ఈ హానికర సంక్రమణ ప్రారంభమైన తరువాత 1-4 వారాల వ్యవధిలో లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
లిస్టిరియా బ్యాక్టీరియ ద్వారా కలుషితమైన ఆహారమే సంక్రమణ యొక్క సాధారణ మూల కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, సంక్రమణ చాలా అరుదైనది, ఇంకా ఇది ప్రాణానికే ప్రమాదకరమైనది. అందువల్ల, క్రింది ఆహార వనరులు ఈ రుగ్మత యొక్క బ్యాక్టీరియా యొక్క వాహకాలు కావచ్చు:
- దీర్ఘకాలంపాటు నిల్వ (shelf life) ఉన్న ఆహారం
- ముడి ఆహారాలు
- శీతలీకరణం చేయకుండా పాలు నుండి తయారు చేయబడిన పాల ఉత్పత్తులు
- మాంసం
- తినడానికి సిద్ధంగా తయారు చేసిన చల్లని ఆహారం
- డెలి మాంసం (కత్తిరించి ఉంచిన మాంసం)
అంతేకాకుండా, గర్భిణీ స్త్రీలలో, మాయ (placenta) ద్వారా తల్లి నుండి పుట్టని బిడ్డకు సంక్రమణ రావచ్చు.
చికిత్స చేయకుండా వదిలేస్తే, సెప్సిస్ మరియు మెనింజైటిస్ లాంటి ప్రాణాంతక పరిస్థితులకు సంక్రమణ వృద్ధి చెందుతుంది. మెదడు దెబ్బతినడానికి మరియు లోపల ఏర్పడే కురుపులకు లిస్టెసియోసిస్ కూడా కారణమవుతుంది .
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
ఒక రక్త పరీక్ష బ్యాక్టీరియా సంక్రమణ యొక్క ఉనికిని నిర్ధారిస్తుంది. మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) స్కాన్ను ఏదేని మెదడు కణాల నష్టంను తోసిపుచ్చడానికి ఉపయోగించవచ్చు.
యాంటీబయాటిక్ థెరపీ అంటువ్యాధి మరియు బ్యాక్టీరియా పెరుగుదలను ఎదుర్కొనేందుకు చేయబడవచ్చు.
అదేవిధంగా, రుగ్మత యొక్క లక్షణాలు కొనసాగితే లేదా కింద తెల్పిన జబ్బుల కారణంగా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థను కలిగి ఉన్నాసరే మీరు తక్షణమే వైద్యుని సంప్రదించండి. బలహీనమైన రోగోనిరోధక వ్యవస్థ కింది వ్యాధులవల్ల, చికిత్సవల్ల కల్గుతుంది:
- చక్కర వ్యాధి (డయాబెటిస్)
- కీమోథెరపీ
- ఎయిడ్స్
ఈ రుగ్మతను బాగానే నివారించుకోవచ్చు. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మరియు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం మూలంగా దీన్ని నివారించవచ్చు. నివారణ చర్యలు ఇలా ఉంటాయి:
- భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవటం.
- వంట వినియోగాయోనికి ముందు, పళ్ళను తినడానికి ముందు పళ్ళు మరియు కూరగాయలను బాగా కడిగి శుభ్రం చేయాలి.
- గడువు తేదీ మించిన ఆహారాలను తినకపోవడం.
- పచ్చి మాంసం మరియు చేపలు తినకుండా ఉండడం.
- రిఫ్రిజిరేటర్లో 2 రోజుల కన్నా ఎక్కువ కాలం నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకోకండి.
- రిఫ్రిజిరేటర్లో సూక్ష్మజీవులు లేకుండా నివారించడానికి రిఫ్రిజిరేటర్ని, అందులో ఒలికిన ద్రవపదార్తాది మరకల్ని, వ్యర్ధాలను తరచుగా శుభ్రం చేస్తుండాలి.
- సముద్రం నుండి లభించే ఆహారాల్ని (సీఫుడ్) మరియు కూరగాయలను వండిన ఆహారపదార్థాలతోపాటు కాకుండా వేరుగా భద్రపరచండి.