లైంగికవాంఛ తగ్గిపోవడం అంటే ఏమిటి?
లైంగిక వాంఛ (లిబిడో) అంటే సెక్స్/శృంగారం కోసం కోరిక ఉండడం. లైంగికవాంఛ తగ్గిపోవడం అనేది పురుషులు మరియు స్త్రీలలో కనిపించే ఒక సమస్య, ఇది సెక్స్ కోరిక లేకపోవడం లేదా సెక్స్/శృంగార ఆశ తగ్గిపోవడంగా వివరించవచ్చు. అధిక లేదా తక్కువ లైంగిక వాంఛ నిర్వచించే పరిమితులు లేనప్పటికీ, అది భాగస్వామితో ఉండే సంబంధాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు లైంగికవాంఛ తగ్గిపోవడం అనేది సమస్యగా మారినట్టు (వ్యక్తికీ) తెలుస్తుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
వివిధ లక్షణాలు లైంగికవాంఛ తగ్గిపోవడాన్ని సూచిస్తాయి; వాటిలో కొన్ని సాధారణమైనవి:
- లైంగిక ఆలోచనలు మరియు కల్పనలు (fantasies) ఉండవు.
- ముద్దులు, శరీరాన్ని తాకడం మరియు ఫోర్ ప్లే వంటి శృంగార కార్యకలాపాలు మరియు హస్త ప్రయోగానికి కూడా ఆసక్తి లేకపోవడం.
- లైంగిక డ్రైవ్ లేకపోవడంతో ఆందోళన.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
లైంగికవాంఛ తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిని క్రింది రకాలుగా వర్గీకరించవచ్చు:
- వయసు - వయసు పెరగడంతో పాటు లైంగిక హార్మోన్ స్థాయిలు తగ్గిపోవడం వలన పురుషులు మరియు మహిళలు ఇద్దరిలోను లైంగిక వాంఛ తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా, ఇద్దరిని ప్రభావితం చేసే ఇతర సమస్యలు కదలికలు పరిమితం కావడం, ఆరోగ్య సమస్యలు మరియు వయసు సంబంధిత సమస్యలు.
- లైంగిక సమస్యలు - ఇవి పురుషులు మరియు స్త్రీలు ఇద్దరిలోను ఉండవచ్చు మరియు అవి లైంగికవాంఛ యొక్క మార్గానికి అడ్డుపడవచ్చు. ఈ సమస్యలలో అంగస్తంభన లోపం, అసహజ యోని పరిస్థితులు, క్లైమాక్స్ లో అసమర్థత లేదా ఆర్గాసం లేకపోవడం లేదా సెక్స్ సమయంలో నొప్పి వంటివి ఉంటాయి.
- బాంధవ్యం (రేలషన్ షిప్) లో సమస్యలు - భాగస్వాముల మధ్య సమస్యలు కూడా తరచూ సెక్స్ లో ఆసక్తి లేకపోవడానికి మరియు లైంగికవాంఛ తగ్గిపోవడానికి దారితీస్తుంది. నమ్మకం, మాట్లాడుకోవడం మరియు కొన్ని అలవాట్లు వంటి సమస్యలు కూడా సెక్స్ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
- భావోద్వేగ మరియు మానసిక సమస్యలు - ఒత్తిడి, అలసట, నిరాశ మరియు ఆందోళన వంటి పరిస్థితులు మానసికంగా ప్రభావితం చేస్తాయి మరియు అవి లైంగికవాంఛను తగ్గిస్తాయి.
- ఆరోగ్య సమస్యలు - శారీరక రుగ్మతల కూడా లైంగికవాంఛ మీద ప్రభావాన్ని కలిగిస్తాయి. గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్, థైరాయిడ్ మరియు మధుమేహం వంటివి లైంగికవాంఛను తగ్గించగల మరియు సెక్స్ జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని రోగాలు.
- మందులు మరియు చికిత్సలు - మందులు, చికిత్సలు లేదా మద్యపాన వ్యసనం లేదా మాదకద్రవ్యాల వ్యసనం వంటివి ఏవైనా లైంగికవాంఛను మార్చగలవు మరియు సెక్స్ డ్రైవ్ను తగ్గించగలవు.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
నిర్ధారణ వ్యక్తికి తన లైంగిక శక్తి లేక కోరిక తగ్గిపోతుందన్న భావన కలిగినప్పుడు ప్రారంభమవుతుంది. ఇది ఆందోళన కలిగిస్తున్నపుడు, సాధారణంగా ప్రాధమిక నిర్ధారణ పూర్తయినట్లే. వైద్యులు సాధారణంగా ఆరోగ్య సమస్యలు మరియు వ్యక్తి వేరేవాటి కోసం ఉపయోగిస్తున్న మందులను గురించి తెలుసుకుంటారు అంతేకాక, మూల కారణాన్ని గుర్తించేందుకు ముందుగా వ్యక్తి యొక్క భావోద్వేగ మరియు మానసిక స్థితిని కూడా పరిశీలిస్తారు. ఇది ఒక సంక్లిష్ట పరిస్థితి కాబట్టి, ఒకే ఒక్క మూల కారణాన్ని గుర్తించడం కష్టం అవుతుంది.
తరచుగా చికిత్స లైంగికవాంఛ తగ్గిపోవడానికి గల కారణం మీద ఆధారపడి ఉంటుంది. వైద్యులు సాధారణంగా మెరుగైన ఆహారం విధానాలు, వ్యాయామం, క్రమమైన నిద్ర మరియు ఒత్తిడి నిర్వహణ వంటి కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులను సిఫార్సు చేస్తారు. రిలేషన్ షిప్ (Relationship counselling) కౌన్సెలింగ్ మరియు కపుల్ థెరపీ కూడా కొన్ని సమస్యల పరిష్కారానికి సహాయం చేస్తాయి. డీయడిక్షన్ (వ్యసనాలను మాన్పిచడం) ను కూడా సూచించవచ్చు. లైంగిక హార్మోన్లు తక్కువగా ఉన్న సందర్భాల్లో హార్మోన్ చికిత్స అవసరం కావచ్చు. చాలా సందర్భాల్లో లైంగికవాంఛను పునరుద్ధరించడానికి, మందుల దుష్ప్రభావాలను తగ్గించడానికి మందులలో మార్పులు సూచించవచ్చు.