తట్టు (పొంగు) - Measles (Rubeola) in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 24, 2018

March 06, 2020

తట్టు
తట్టు

సారాంశం

తట్టు, అధిక సంక్రమణ గల వైరల్ వ్యాధి, ప్రపంచవ్యాప్తముగా పిల్లలు మరణించడానికి ఇది ప్రధాన కారణం, అయితే ఒక సురక్షిత టీకా, 40 సంవత్సరాలుగా సమర్థవంతముగా దీని నివారణకు అందుబాటులో ఉన్నది.  ఒకటి లేక రెండు వారాల ఇన్ఫెక్షన్ తరువాత తట్టు యొక్క లక్షణాలు అభివృద్ధి చెందుతాయి మరియు ఒక వారం లేక అంతకంటే ఎక్కువ రోజులు ఈ లక్షణాలు నిలిచిఉంటాయి.   లక్షణాలు అనునవి, దగ్గుతో పాటు జ్వరం, చీముడు ముక్కు (రొంఫ) మరియు బాధ కలిగించే ఎర్రని కళ్లు మరియు కాంతి సున్నితత్వము కలిగిన కళ్లను కలిగి ఉంటాయి.  ఇక్కడ నోటి లోపల కోప్లిక్ మచ్చలు అనునవి కనిపిస్తాయి (ముదురు గోధుమ రంగు ప్రాంతం చుట్టూ ఉన్న తెల్ల మచ్చలు) దీనితో పాటు చర్మముపైన అభివృధ్ధి చెందిన దద్దుర్లు, ఇవి తల భాగం నుండి ప్రారంభవుతాయి మరియు అక్కడి నుండి శరీరము  యొక్క మిగిలిన క్రింది భాగమునకు వ్యాపిస్తాయి.  ఈ వ్యాధి అనునది వ్యాధి సంక్రమించిన వ్యక్తితో నేరుగా పరిచయము కలిగి ఉన్నను వ్యాపిస్తుంది మరియు వ్యాధి సంక్రమించిన వస్తువులను హ్యాండ్లింగ్ చేయడం ద్వారా పరోక్షముగా కూడా వ్యాపిస్తుంది.

ఈ పరిస్థితిని నయం చేయడానికి ఎటువంటి మందులు లేవు, మరియు అధిక భాగం ప్రజలు 7-10 రోజులలో బాగా తిరిగి పుంజుకుంటారు.  మంధులు లక్షణాల నుండి, అనగా జ్వరం మరియు దగ్గు నుండి ఉపశమనము కొరకు సూచించబడ్డాయి. టీకా తీసుకోవడం అనునది ఈ వ్యాధిని నివారించడానికి సురక్షితమైన మార్గము, మరియు చిన్న పిల్లలు వారి యొక్క మొదటి టీకాను వారి మొదటి పుట్టినరోజు లోపల లేక తరువాత వెంటనే తీసుకోవాలి.  పూర్తి రక్షణ కొరకు రెండు డోసుల వ్యాక్సిన్ అనునది అవసరమవుతుంది.  తట్టు వలన సమస్యలు అనునవి సంభవిస్తాయి అయితే మరింత సాధారణముగా ఒక సంవత్సరం వయస్సుకంటే తక్కువ ఉన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు, పేలవమైన ఆహారమును తీసుకునే ప్రజలు, మరియు అభివృద్ది చెందని లేక రాజీపడే రోగ నిరోదక వ్యవస్థ కలిగిన ప్రజలలో ఈ సమస్యలు వస్తాయి.  

తట్టు (పొంగు) యొక్క లక్షణాలు - Symptoms of Measles in Telugu

ఇన్ఫెక్షన్ పెరిగేకొలదీ ఒక స్థిరమైన క్రమములో తట్టు యొక్క లక్షణాలు ఒకదాని తరువాత మరొకటి కనిపిస్తాయి మరియు ఒక వ్యక్తి వైరస్ కు గురిఅయిన తరువాత 7-14 రోజులలో ఈ లక్షణాలు వ్యక్తమవుతాయి (కనబడుతాయి).  ఈ కాలము ఇన్క్యుబేషన్ పీరియడ్ (పొదుగుకాలము) అని తెలుపబడుతుంది.

  • జ్వరము
    తట్టు యొక్క గుణాత్మక లక్షణము జ్వరము. జ్వరము అనునది ఇక్కడ ఇవ్వబడిన మూడు “ సి” (‘C’s’) లలో కనీసం ఏదైనా ఒకటి చేరడం ద్వారా వస్తుంది. 
  • కోప్లిక్ మచ్చలు
    జ్వరము వచ్చిన రెండు లేక మూడు రోజుల లోపల, చిన్న తెల్ల మచ్చలు అనగా కోప్లిక్ మచ్చలు అనునవి నోటి లోపల కనిపిస్తాయి.  ఇవి తట్టు ఇన్ఫెక్షన్ యొక్క ప్రారంభ సూచిక సంకేతాలు.
  • తట్టు రాష్
    ఒక రాష్ అనునది లక్షణాలు మొదట కనిపించిన మూడు నుండి ఐదు రోజుల తరువాత ముఖము పైన చుట్టూ ప్రారంభమవుతుంది. ఈ రాష్ అనునది వెంట్రుకలకు దగ్గరగా ముఖము పైన పలుచటి ఎర్రని మచ్చలు సంభవిస్తాయి. మరియు ముఖము క్రింది వైపుగా మెడ, భుజాలు, శరీరం, కాళ్లు, మరియు పాదాల వరకు వ్యాపిస్తుంది.  చిన్నగా పెరిగిన బొడిపెలు అనునవి ఎర్రని మచ్చలపైన కనిపిస్తాయి, మరియు మచ్చలు తరువాత కలిసిపోయి శరీరం అంతటా వ్యాపిస్తాయి.  రాష్ (దద్దుర్లు) అనునవి అధికముగా ఎక్కువ జ్వరము ద్వారా ఏర్పడతాయి.  దద్దుర్లు చివరకు కొద్ది రోజులలో తగ్గిపోతాయి మరియు జ్వరం తరువాత తగ్గిపోవడం ప్రారంబిస్తుంది.
  • ఇతర లక్షణాలు,  అనగా కాంతి సున్నితత్వం మరియు కండరాల నొప్పి, అనునవి కూడా ఉంటాయి.

ఒకవేళ మీరు జ్వరముతో పాటు ఇక్కడ ఉన్న మూడు (సి) ‘C’s’ లలో ఏదైనా ఒకటి చేర్చబడి తట్టు యొక్క అధిక ప్రభావముతో  రెండు వారాల పాటు అనేక ప్రదేశాలకు ప్రయాణించి వచ్చిన తరువాత, మీరు మీ డాక్టరును మీ ప్రయాణానికి సంబంధించి సంప్రదించడం మరియు మీ అనుమానాలు వివరించడం చాలా ముఖ్యమైనది.

తట్టు (పొంగు) యొక్క చికిత్స - Treatment of Measles in Telugu

తట్టుకు ఏ నిర్ధిష్టమైన చికిత్స లేదు మరియు పరిస్థితి తనంతట తానుగా 7-10 రోజులలో సాధారణముగా తగ్గిపోతుంది. తట్టు యొక్క లక్షణాల నుండి ఉపశమనమును అందించే లక్ష్యముతో మందులు ఇవ్వబడతాయి, అనగా, లక్షణాన్ని కనుగొనే చికిత్స.

ప్రజలు ఎవరికైతే వ్యాధి సంక్రమించినదో వారు ఇంటిలోపలే ఉండవలసినదిగా సూచించబడతారు మరియు స్కూలుకి, పనికి లేక ఇతర పబ్లిక్ ప్రదేశాలకు, తట్టు రాష్ మొదటగా కనిపించిన రోజు తరువాత నుండి కనీసం నాలుగు రోజులు ఈ ప్రదేశాలకు వెళ్లకుండా మానివేయాలి.  సులభముగా ఇన్ఫెక్షన్ కు గురి అయ్యే ప్రజలతో పరిచయాలను చేయకుండా ఉండాలి, అనగా పిల్లలతో మరియు గర్భిణీ స్త్రీలతో పరిచయాలను తగ్గించాలి.  లక్షణాన్ని కనుగొనే చికిత్స వీటిని కలిగి ఉంటుంది:

  • జ్వరము నియంత్రణ
    పారాసెటమాల్ లేక ఐబుప్రోఫెన్ అనునవి సాధారణముగా జ్వరమును తగ్గించడానికి డాక్టర్ల చేత సూచించబడతాయి మరియు శరీర నొప్పుల నుండి ఉపశమనము అందించడానికి కూడా సూచించబడుతుంది.
  • హైడ్రేషన్
    ద్రవాలను పుష్కలముగా త్రాగడం అనునది చాలా ముఖ్యమైనది మరియు డీహైడ్రేషన్ యొక్క ప్రమాదమును తొలగించడానికి జ్వరము సమయములో బాగా హైడ్రేషన్ కలిగిఉండేటట్లు చూసుకోవాలి.  తగినంత ద్రవాలను తీసుకోవడము కూడా దగ్గు కారణముగా ఏర్పడిన గొంతు నొప్పి నుండి ఉపశమనమును అందిస్తుంది.
  • కంటి సంరక్షణ
    కళ్లను శుభ్రముగా ఉంచుకోవడం మరియు కనురెప్పలు మరియు కళ్ల వెంట్రుకల చుట్టూ ఉన్న ఈ ప్రాంతాలను నీటిలో తడిపిన తాజా శుభ్రమైన కాటన్ బట్టతో  మెత్తగా తుడవడము ద్వారా ఉన్న వ్యర్థాలను తొలగించుకోవడము అనునది రికమెండ్ చేయబడుతుంది.  ఒకవేళ ఎక్కువ కాంతి కళ్లకు బాధను కలిగిస్తుంటే అస్పష్టత దీపాలు మరియు డ్రాయింగ్ కర్టెన్లు అనునవి సహాయపడతాయి.
  • దగ్గు మరియు జలుబు
    ఒకవేళ తట్టు అనునది  జలుబు మరియు దగ్గు చేత చేర్చబడిన లక్షణాలు కలిగియుంటే, మీ డాక్టరు ఆ పరిస్థితిని నయం చేయడానికి మందులను సూచిస్తాడు. ఆవిరి పట్టడం మరియు వెచ్చని పానీయాలు త్రాగడం అనునవి శ్లేష్మం నడిపించబడడానికి సహాయం చేస్తుంది మరియు ఉపశమనాన్ని అందిస్తుంది.
  • ఇతర చర్యలు
    సంకేతాల పైన ఒక దృష్టి నిలపండి, అనగా  శ్వాస ఆడకపోవడం, దగ్గడము వలన రక్తం రావడం, మగత, గందరగోళం, మరియు మూర్చ. ఒకవేళ మీరు ఈ లక్షణాలలో ఏదైనా గమనించి ఉంటే మీ డాక్టరును సంప్రదించండి మరియు హాస్పిటల్ యొక్క అత్యవసర విభాగమును దర్శించండి.   

తట్టు (పొంగు) అంటే ఏమిటి? - What is Measles in Telugu

తట్టు అనునది అధిక సంక్రమణ గల వైరల్ ఇన్‌ఫెక్షన్. ఒక వ్యాధి సోకిన వ్యక్తి తనకు దగ్గరగా వచ్చిన మొత్తం పదిమంది వ్యక్తులలో కనీసం తొమ్మిది మందికి ఈ వైరస్ ను బదిలీ చేస్తాడు. ఇది గాలి ద్వారా సంక్రమించే వ్యాధి, ఇది వ్యాధి సోకిన సూక్ష్-బిందువులను గాలి ద్వారా, ఆ వ్యక్తి శ్వాస తీసుకున్నప్పుడు, దగ్గినప్పుడు, లేక తుమ్మినప్పుడు వ్యాప్తి చేస్తాయి. ఆ తరువాత, వైరస్ అనునది వాతావరణములో రెండు గంటలపాటు యాక్టివ్ గా ఉంటుంది.

తట్టు అంటే ఏమిటి?

తట్టు, తీవ్రముగా సంక్రమించు ఒక అంటు వైరల్ వ్యాధి, ఇది ప్రపంచ వ్యాప్తముగా ఉన్న చిన్న పిల్లలు మరణించుటకు ప్రధాన కారణము. తట్టు యొక్క టీకా సమర్థత వలన అధికముగా అభివృధ్ధి చెందిన దేశాలలో ఇది అంత సర్వ సాధారణమైనది కాదు, ప్రజలు అనుకోకుండా వారి యొక్క దేశానికి వెళ్తున్నప్పుడు ఈ వ్యాధిని తీసుకెళ్తూ తక్కువ మొత్తములో ప్రజలను చంపివేస్తున్నది. తట్టు అనునది వయసుతో సంబంధం లేకుండా, ఏ వ్యక్తిలోనైనా సంభవిస్తుంది, ఒకవేళ అతడు/ఆమె టీకా తీసుకోకపోతే లేక ఇంతకు మునుపు ఈ వ్యాధిని కలిగియుంటే ఈ వ్యాధి వస్తుంది. అయితే, ఇది సాధారణముగా చిన్న పిల్లలలో వస్తుంది. ఒకసారి తట్టు ద్వారా ఇన్ఫెక్ట్ చేయబడియుంటే, ఆ వ్యక్తి, ఆ వైరస్ కు జీవితకాల రోగ నిరోధక శక్తిని అభివృధ్ధి చేస్తాడు.



వనరులు

  1. Robert T. Perry Neal A. Halsey. The Clinical Significance of Measles: A Review . The Journal of Infectious Diseases, Volume 189, Issue Supplement_1, 1 May 2004, Pages S4–S16; Published: 01 May 2004. [Internet] Infectious Diseases Society of America
  2. National Health Service [Internet]. UK; Measles
  3. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Measles (Rubeola)
  4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Signs and Symptoms
  5. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Measles.
  6. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Travelers' Health
  7. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Measles

తట్టు (పొంగు) కొరకు మందులు

Medicines listed below are available for తట్టు (పొంగు). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.