కండరాల తిమిర్లు - Muscle Cramps in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

December 08, 2018

July 31, 2020

కండరాల తిమిర్లు
కండరాల తిమిర్లు

కండరాల తిమ్మిర్లు  అంటే ఏమిటి?

కండరాల తిమ్మిరి అనేది శరీరంలోని ఒకటి లేదా అనేక శరీర కండరాలలో ఆకస్మికంగా, అనియంత్ర మరియు బాధాకరమైన సంకోచాలు సంభవించడం. ఈ కండర సంకోచాలు అంత సులభంగా పోవు (విశ్రాంతినివ్వవు) మరియు సాధారణంగా వ్యాయామం తర్వాత ఈ కండర తిమిర్లు సంభవిస్తాయి. కాలి యొక్క కండర తిమ్మిరి చాలా సాధారణ రకాలైన తిమ్మిరినొప్పులలో ఒకటి. ఇది కాకుండా, పాదాలు, చేతులు, అరచేతులు, కడుపు, తొడలలో కూడా కండరాల తిమ్మిరి నొప్పులు సంభవిస్తుంటాయి. కండరాల తిమ్మిరికి ఎక్కువ మంది వృద్ధులు, ఊబకాయంగల వ్యక్తులు, క్రీడాకారులు (అథ్లెట్లు), గర్భిణీ స్త్రీలు మరియు నరాల రుగ్మతలు మరియు థైరాయిడ్ రుగ్మతలు గలవారు లోనవుతుంటారు.

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వ్యాధిలక్షణాలు తిమ్మిరి తీవ్రతను బట్టి మారుతుంటాయి, ఉదాహరణకు, ఇది వేదనతో కూడిన నొప్పి కావచ్చు. తిమ్మిర్లు అనేవి చర్మం కింద నులిపెట్టి వచ్చే నొప్పిలా కనిపిస్తుంది, అయితే సరిగ్గా ఎక్కడ నొప్పెడుతోందో సరిగ్గా సూచించడం కష్టంగా ఉంటుంది. తిమిర్లు సాధారణంగా కొన్ని సెకన్ల పాటు కొనసాగుతారు, కానీ చాలా నిమిషాల వరకూ కూడా తిమిరినొప్పులు కొనసాగొచ్చు. తిమిర్లు పూర్తిగా కనుమరుగయ్యేందుకు ముందుగా అనేకసార్లు మరల మరల వస్తూ పోతూ ఉండవచ్చు. కండరాల తిమ్మిరికి చెమట పట్టడానికి, స్థానిక గాయం లేదా ఇతర సంకేతాలతో సంబంధం ఉండవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కొన్నిసార్లు కండరాల తిమ్మిరికి గల కారణం గుర్తించబడదు. అయితే, క్రింద కనబరిచినవి కండరాల తిమ్మిరి యొక్క సాధారణమైన మరియు అందరికీ తెలిసిన కారణాలు:

 • కండరాల్లో బెణుకు (strain in the muscles)
 • డీహైడ్రేషన్ (నిర్జలీకరణము)
 • మెగ్నీషియం, సోడియం, కాల్షియం మరియు పొటాషియం వంటి ఎలెక్ట్రోలైట్స్ యొక్క తగ్గించబడిన స్థాయిలు
 • కండరాలకు తగ్గిన రక్తం సరఫరా
 • డయాలసిస్
 • కొన్ని మందులు
 • గర్భం
 • ప్రమాదం లేదా గాయం కారణంగా సంకోచానికి గురైన నరాలు
 • అధికశ్రమ

దీనిని ఎలా నిర్ధారణ చేయవచ్చు మరియు దీనికి చికిత్స ఏమిటి?

తిమిర్లకు కారణమవుతున్న అంతర్లీన రోగకారకాన్ని నిర్ధారించేందుకుగాను రోగనిర్ధారణ జరుగుతుంది. ఇది సాధారణంగా కింది పరీక్షల్ని కల్గిఉంటుంది:

 • శారీరక పరిక్ష
 • కండరాల జీవాణు పరీక్ష
 • ఎలెక్ట్రోమాయోగ్రామ్ పరీక్ష
 • నరాల ప్రసరణ గురించిన అధ్యయనాలు
 • క్రియేటినిన్ కైనేజ్ రక్త పరీక్ష

సాధారణంగా, కండరాల తిమ్మిరికి నిర్దిష్ట చికిత్స అవసరం లేదు మరియు కింది చర్యలద్వారా ఉపశమనం పొందవచ్చు

 • కండరాల మర్దన (ఒత్తడం లేదా మసాజ్ చేయడం) లేదా కండారాల్ని సాగదీయడం
 • మీరు నిర్జలీకరణకు గురైనారని భావిస్తే ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవడం మరియు లవణాలను శరీరానికి భర్తీ చేయడం

బిగదీసిన కండరాలపై వేడి కాపడం పెట్టడం నొప్పెడుతున్న కండరాలపై మంచు ప్యాక్స్ ను అద్దడం చేసేది.  వేడిని వర్తింపచేయడం

కండరాల తిమ్మిరికి కారణమయ్యే కొన్ని అంతర్లీన పరిస్థితులు ఉంటే మీ వైద్యుడు కొన్ని మందులను సూచించవచ్చు. మీరు కండరాలను సాగదీయడం (stretching) మరియు ద్రవాహారాల్ని పుష్కలంగా త్రాగడం ద్వారా కండరాల తిమ్మిరిని నిరోధించవచ్చు.వనరులు

 1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Muscle Cramps.
 2. Orthoinfo [internet]. American Academy of Orthopaedic Surgeons, Rosemont IL. Muscle Cramps.
 3. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Muscle cramp.
 4. American Association of Neuromuscular & Electrodiagnostic Medicine [Internet] Rochester Minnesota; Types of Tests.
 5. Jansen PH,Gabreëls FJ,van Engelen BG. Diagnosis and differential diagnosis of muscle cramps: a clinical approach. J Clin Neuromuscul Dis. 2002 Dec;4(2):89-94. PMID: 19078696

కండరాల తిమిర్లు కొరకు మందులు

Medicines listed below are available for కండరాల తిమిర్లు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.