ముక్కులో ద్రాక్షగుత్తులు (నేసల్ పాలిప్స్) అంటే ఏమిటి?
నేసల్ పాలిప్స్ అనేవి మృదువైన,నొప్పి లేని, సంచుల లాంటి క్యాన్సర్ కానీ పెరుగుదలలు, అవి ముక్కు లేదా సైనసస్ యొక్క పొరలలో వృద్ధి చెందుతాయి. అవి సాధారణంగా ప్రమాదకరం కావు, కానీ చికిత్స చేయకుండా వదిలేస్తే, అవి ముక్కును నిరోధించి, శ్వాస తీసుకోవడంలో కష్టానికి దారితీస్తాయి. ఈ పరిస్థితి సుమారు 4% జనాభాను ప్రభావితం చేసింది. నేసల్ పాలిప్స్ అభివృద్ధి చెందే అవకాశం 1,000 మంది వ్యక్తులకు 1 నుండి 20 వరకు ఉంటుంది మరియు 60 ఏళ్ళ తరువాత దీని సంభావ్యత తగ్గిపోతుంది.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
ముక్కులో ద్రాక్షగుత్తులు (నేసల్ పాలిప్స్) యొక్క లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
- ముక్కు యొక్క నిరోధం (మరింత సమాచారం: ముక్కు దిబ్బడ చికిత్స)
- ముక్కు కారడం
- తుమ్ములు
- వాసన శక్తి కోల్పోవడం
- రుచి భావన కోల్పోవడం
- సైనస్ ఇన్ఫెక్షన్ ఉంటే తలనొప్పి కూడా వస్తుంది
- సైనస్ లేదా పై పంటి ప్రాంతాలలో నొప్పి మరియు ఒత్తిడి భావన
- ముక్కునుండి రక్తస్రావం
- గురక
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
ఈ పరిస్థితి యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు, కానీ ఒక వ్యక్తి ఈ క్రింది సమస్యలతో బాధపడుతున్నట్లయితే నేసల్ పాలిప్స్ అభివృద్ధి చెందే ప్రమాదం అధికంగా ఉంటుంది:
- సిస్టిక్ ఫైబ్రోసిస్
- ఆస్తమా
- గవత జ్వరం (హే జ్వరం)
- అలర్జీలు
- దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్లు
- ఆస్పిరిన్ సున్నితత్వం (Aspirin sensitivity)
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
నేసల్ పాలిప్స్ యొక్క నిర్ధారణ ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది:
- ముక్కు ద్వారం యొక్క భౌతిక పరీక్ష. ముక్కు రంధ్రంలో ఈ అధిక పెరుగుదలల వాలే పాలీప్స్ బయటకు కనిపిస్తాయి.
- సైనసెస్ (sinuses) యొక్క సిటి (CT) స్కాన్ ఇది ముక్కు రంధ్రం యొక్క చిత్రాన్ని ఇస్తుంది. పాలిప్స్ ముద్దగా ఉండే మచ్చలు వాలె కనిపిస్తాయి. పెద్ద పాలిప్స్ కొన్నిసార్లు సైనసెస్ లోపల ఎముకల విచ్ఛినానికి దారితీయవచ్చు.
మందులు లక్షణాలకు ఉపశమనం కలిగిస్తాయి కానీ పరిస్థితి నయం కాదు. నేసల్ పాలిప్స్ యొక్క చికిత్సకు సాధారణంగా ఈ క్రింది మందులు సూచించబడతాయి:
- పాలిప్లను తగ్గించడానికి మరియు ముక్కును సరిచేయడానికి నేసల్ స్టెరాయిడ్స్ మరియు కార్టికోస్టెరాయిడ్ మాత్రలు లేదా ద్రవాలు (లిక్విడ్లు)
- అలెర్జీల కోసం మందులు
- అంటువ్యాధుల కోసం యాంటీబయాటిక్స్
మందులు ప్రభావవంతంగా లేనప్పుడు లేదా పాలిప్స్ పెద్దగా ఉన్నప్పుడు, లక్షణాల నుండి ఉపశమనం అందించడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (Endoscopic sinus surgery) ను సాధారణంగా నేసల్ పాలిప్స్ చికిత్స కోసం నిర్వహిస్తారు.