మూత్రపిండాల వాపు (నెఫ్రైటిస్) - Nephritis in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

December 11, 2018

July 31, 2020

మూత్రపిండాల వాపు
మూత్రపిండాల వాపు

మూత్రపిండాల వాపు (నెఫ్రైటిస్) అంటే ఏమిటి?

మూత్రపిండాల్లో ఒకటి లేదా రెండు మూత్రపిండాలూ వాపుదేలి మంటకు గురైనట్లైతే దాన్నే  “మూత్రపిండాల వాపు” వ్యాధిగా పేర్కొంటారు. మానవ శరీరంలో మూత్రపిండాలు ఒక కీలకమైన అవయవం. ఇతర వ్యర్ధ పదార్ధాలతో సహా అదనపు నీటిని తొలగించడంలో మరియు శరీరంలో ప్రోటీన్ వంటి అవసరమైన పదార్ధాలను అలాగే శరీరంలో నిల్వ ఉంచదానికి మూత్రపిండాలు సహాయపడతాయి. మానవ శరీరంలో మూత్రపిండాలకు దెబ్బ తగిల్తే శరీరం మూత్రం ద్వారా ప్రోటీన్ల వంటి అవసరమైన పోషకాలను కోల్పోవడానికి కారణమవుతుంది. మూత్రపిండాల వాపు వ్యాధి (నెఫ్రైటిస్) రెండు రకాలు:

 • గ్లోమెరులోనెఫ్రిటిస్, దీనిలో ’గ్లోమెరూలీ’ అనబడే రక్తనాళాలు ఎర్రబడుతాయి,  శరీరం నుండి వృధా పదార్థాల్ని మరియు నీటిని వడపోసే ప్రక్రియను దెబ్బ తీస్తుందిది.
 • ఇంటర్స్టీషియల్ నెఫ్రిటిస్ రకం మూత్రపిండాలవ్యాధిలో ఇంటర్స్టీషియం అంటే మూత్రపిండాలకుండే గొట్టాల మధ్య ఖాళీలు ఎర్రబడుతాయి, తద్వారా మూత్రపిండాల పనితీరును దెబ్బ తీస్తుందిది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మూత్రపిండాల వాపు (నెఫ్రైటిస్) యొక్క లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మూత్రపిండాలవాపు యొక్క ఖచ్చితమైన కారణాలు స్పష్టంగా తెలియనప్పటికీ, అవి మూత్రపిండాల వాపు రకం మీద ఆధారపడి ఉంటాయి.

గ్లోమెరులోనెఫ్రిటిస్ (Glomerulonephritis) కిందివాటివల్ల కలుగుతుంది:

 • రోగనిరోధక వ్యవస్థ పనిచేయకపోవడం
 • క్యాన్సర్ చరిత్ర
 • హైడ్రోకార్బన్ ద్రావకాలు బహిర్గతం కావటం
 • రక్తం లేదా శోషరస వ్యవస్థ యొక్క లోపాలు
 • వైరల్ ఇన్ఫెక్షన్లు, గుండె సంక్రమణ మరియు చీముతో కూడిన కురుపులు 
 • ముఖచర్మరోగంతో (లూపస్) కూడిన మూత్రపిండాలవాపు (నెఫ్రైటిస్) వ్యాధి
 • వడపోతకు కారణమయ్యే గ్లోమెరూలీ యొక్క బేసల్ పొరను దెబ్బతీసే రుగ్మతలు
 • నొప్పి నివారణమందుల యొక్క అధిక వినియోగం వలన కిడ్నీ వ్యాధులు

కింది కారణాలవల్ల మధ్యంతర మూత్రపిండాలవ్యాధి (నెఫ్రైటిస్) కలుగుతుంది:

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

గ్లోమెరులోనెఫ్రిటిస్ (Glomerulonephritis) రకం  మూత్రపిండావాపు వ్యాధిని కిందివాటి సహాయంతో నిర్ధారణ చేయవచ్చు:

 • పొత్తి కడుపు CT స్కానింగ్
 • ఛాతీ X- కిరణాలు
 • మూత్రపిండాలు అల్ట్రాసౌండ్ ఇమేజింగ్
 • ఇంట్రావెనస్ పైలెగోగ్రామ్
 • క్రియేటినైన్ క్లియరెన్స్, ప్రోటీన్, ఎర్ర రక్త కణాలు, యూరిక్ యాసిడ్ మొదలైనవాటిని గుర్తించడానికి మూత్ర పరీక్ష

కిందివాటి సహాయంతో ఇంటర్స్టీషియల్ నెఫ్రైటిస్ రకం మూత్రపిండాలవాపును నిర్ధారణ చేయబడవచ్చు:

 • రక్తంలో బున్ (BUN) మరియు క్రియాటినీన్ స్థాయిలు
 • పూర్తి రక్తగణన పరీక్ష
 • మూత్రపిండాల అల్ట్రాసౌండ్ ఇమేజింగ్
 • మూత్ర పరీక్ష
 • మూత్రపిండాల జీవాణు (కిడ్నీ బయాప్సీ) పరీక్ష

పేర్కొన్నరెండు రకాల మూత్రపిండాలవాపు (నెఫ్రైటిస్) వ్యాధికి చికిత్స ఆ వ్యాధికారకం మీద ఆధారపడి ఉంటుంది. కారణాలను నియంత్రించడం వ్యాధి యొక్క నిర్వహణలో సహాయపడుతుంది. మూత్రపిండాలవాపు వ్యాధి నిర్వహణలో సహాయపడే కొన్ని చర్యలు:

 • రక్తపోటు నిర్వహించడానికి ఉప్పు తీసుకోవడంలో పరిమితాన్ని పాటించడం
 • వ్యర్థాల ఉత్పత్తిని నియంత్రించడానికి ప్రోటీన్ జీవనాన్ని పరిమితం చేయడం
 • వాపు నిరోధక మందులు
 • అధిక రక్తపోటు నివారణా మందులు (మరింత సమాచారం: అధిక రక్తపోటు చికిత్స)
 • మూత్రపిండాల విషయంలో మూత్రపిండాల మార్పిడి లేదా డయాలసిస్ అవసరమవుతుందివనరులు

 1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Glomerulonephritis.
 2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Interstitial nephritis.
 3. Kidney Health Australia [Internet]: Melbourne Victoria; Nephritis – Glomerulonephritis.
 4. Center for Parent Information and Resources [Internet]: Newark, New Jersey; Nephritis.
 5. National Institute of Diabetes and Digestive and Kidney Diseases. [Internet]. U.S. Department of Health & Human Services; Lupus and Kidney Disease (Lupus Nephritis).

మూత్రపిండాల వాపు (నెఫ్రైటిస్) వైద్యులు

Dr. Anvesh Parmar Dr. Anvesh Parmar Nephrology
12 Years of Experience
DR. SUDHA C P DR. SUDHA C P Nephrology
36 Years of Experience
Dr. Mohammed A Rafey Dr. Mohammed A Rafey Nephrology
25 Years of Experience
Dr. Soundararajan Periyasamy Dr. Soundararajan Periyasamy Nephrology
30 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

మూత్రపిండాల వాపు (నెఫ్రైటిస్) కొరకు మందులు

Medicines listed below are available for మూత్రపిండాల వాపు (నెఫ్రైటిస్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.