ఓపియాడ్ (నల్లమందు) టాక్సిసిటీ అవడమంటే ఏమిటి?
మత్తుమందు (నల్లమందు) విషపూరితం (ఓపియాడ్ టాక్సిటిటీ) అవడం అనేది తెలిసో లేదా తెలియకుండానో అధిక మోతాదులో (ఓపియాయిడ్) మత్తుమందును తీసుకోవడంతో ఏర్పడే ప్రమాదకర పరిస్థితి. ఓపియాయిడ్స్ (నల్లమందు లేక మత్తుమందులు) అనేవి నొప్పి నివారణకు ఉపయోగించే మత్తు మందుల తరగతికి చెందినవి. మత్తుమందుల దీర్ఘకాలిక ఉపయోగం శరీరంలో సహనం లేదా ప్రతిఘటన అభివృద్ధికి కారణమవుతుంది. పెరిగిన సహనం కారణంగా, మందుల ప్రభావం చూపడానికిగాను ఎక్కువ మోతాదులో తీసుకోవడం అవసరం అవుతుంది. మత్తుమందుల అధిక మోతాదు సేవనం అనేక అవయవాలను దెబ్బ తీయచ్చు మరియు సరైన సమయంలో తీక్షణంగా (rigorously) చికిత్స చేయకపోతే మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది.
ఆసియాలో ఓపియాడ్ దుర్వినియోగం యొక్క ప్రాబల్యం 0.35%.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
మీరు క్రింద పేర్కొన్న అన్ని లక్షణాలను అనుభవిస్తున్నట్లైతే మీరు మత్తుమందుల అధిక మోతాదు ప్రభావాన్ని ఎదుర్కొంటున్నట్లే నిర్ధారించొచ్చు:
- పిన్పాయింట్ కనుపాప (కుంచించుకుపోయిన లేదా చిన్నదైన కనుపాప).
- స్పృహ కోల్పోవడం.
- శ్వాస తీసుకోవడంలో కష్టం.
- రక్తపోటు తగ్గుదల.
- తగ్గిన హృదయ స్పందన రేటు.
- పాలిపోయినట్లు కనబడటం
- తగ్గిన శరీర ఉష్ణోగ్రత.
- అసంపూర్ణ మూత్రవిసర్జన.
- అతిసారం లేదా మలబద్ధకం.
మత్తుపదార్థాల అధిక మోతాదు సేవనం మెదడులోని ఒక భాగాన్ని దెబ్బ తీస్తుంది, దెబ్బ తిన్న ఆ మెదడు భాగం ఊపిరితిత్తులు శ్వాసను నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది గనుక అధిక మోతాదులో మత్తుమందు సేవనం శ్వాసక్రియను తగ్గించి మరణాన్ని కలిగిస్తుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
అధిక మోతాదు యొక్క ముఖ్య కారణం మత్తుమందు (ఓపియాయిడ్)ను సేవించడమే. మీరు గనుక కింది లక్షణాల్ని అనుభవిస్తూ, పేర్కొన్న చర్యలు చేస్తున్నట్లైతే మీ శరీరంలో నల్లమందనే మత్తుమందు (ఓపియాయిడ్) యొక్క విషపూరిత ప్రమాదకరస్థితి అభివృద్ధి చెందుతున్నట్లే:
- సిఫారసు కన్నా ఎక్కువ మోతాదులలో నల్ల మందు మత్తుమందుల్ని (ఓపియాయిడ్లను) వాడుతుండడం.
- ఇతర మందులు లేదా సారాయితో కలిపి ఓపియాయిడ్లను కలిపి సేవించడం.
- శరీరంలోకి ఓపియాయిడ్ మందులను ఇంజెక్ట్ చేయడం.
- సహనం కోల్పోయే స్థితి (ఈ స్థితి ఓపియాయిడ్లు ఆపేసిన 3 లేక 4 రోజుల తర్వాత అభివృద్ధి చెందుతుంది).
- హెచ్ఐవి (HIV) సంక్రమణ, కుంగుబాటు, మూత్రపిండము లేదా కాలేయం పనిచేయకపోవడం.
- వయస్సు 65 సంవత్సరాలు, లేదా అంతకంటే ఎక్కువ కావడం.
దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
శ్వాసకోశ రేటు, హృదయ స్పందన రేటు మరియు రక్తపోటు మరియు కంటి పరీక్షల పరీక్షలు వంటి పరీక్షల ద్వారా మీ వైద్యులు ఓపియాయిడ్ టాక్సిటిని నిర్ధారిస్తారు. ప్రయోగశాల పరీక్షలు రక్తంలో ఓపియాయిడ్ స్థాయిలు మరియు ఇతర అవయవాల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి నిర్వహించబడతాయి.
వైద్యులు మొట్టమొదట చేసే చికిత్స ప్రాణవాయువు (ఆక్సిజన్) సరఫరా. ఈ ఆక్సిజన్ సరఫరాను శ్వాసమార్గానికి ఎలాంటి అవరోధం లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఆక్సిజన్ సరఫరా చేయడం జరుగుతుంది. దీని తరువాత, విషపూరితమైన మత్తుమందుకు విరుగుడుగా ఒక ఇంజక్షన్ ద్వారా లేదా నాసికా మార్గం ద్వారా విరుగుడుమందు ఇవ్వబడుతుంది. విరుగుడుమందును వెంటనే ఇస్తే విషపూరితమైన మత్తుమందు ప్రభావాన్ని వేగవంతమైన స్థాయిలో తిప్పికొట్టగలదు మరియు ప్రారంభంలోనే ఇచ్చినట్లయితే మరనాన్ని నివారించవచ్చు. మీ శరీరంలో ఓపియాయిడ్ స్థాయిని బట్టి విరుగుడుమందు మోతాదు మారుతూ ఉంటుంది.