క్లోమవాపు (పాంక్రియాటైటిస్) - Pancreatitis in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

January 09, 2019

July 31, 2020

క్లోమవాపు
క్లోమవాపు

క్లోమవాపు (ప్యాంక్రియాటిస్) అంటే ఏమిటి?

జీర్ణ రసాయనికామ్లద్రవాలు (ఎంజైములు) మరియు హార్మోన్లు క్లోమము ద్వారా స్రవిస్తాయి. కొన్నిసార్లు, జీర్ణ రసాయనికామ్లద్రవాలు (జీర్ణ ఎంజైములు) నొప్పి, మంటకు కారణమయ్యే క్లోమం యొక్క అంతర్గత గోడలకు హాని కలిగిస్తాయి, నొప్పికారకమైన ఈ రోగలక్షణ పరిస్థితినే క్లోమశోథ లేక ప్యాంక్రియాటైటిస్ గా పిలువబడుతుంది. క్లోమ శోథ తీవ్రమైనదిగా  లేదా దీర్ఘకాలికంగా ఉంటుంది. జీర్ణాశయ వ్యాధుల్లో క్లోమశోథ (పాంక్రియాటిటిస్) చాలా సాధారనమైన రుగ్మత కాదు, అందువలన దీనికి ఆసుపత్రిలో తక్షణ వైద్య చికిత్స అవసరం అవుతుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణ చిహ్నాలు మరియు లక్షణాలు కొన్ని:

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

ప్యాంక్రియాటైటిస్ యొక్క సాధారణ కారణాలు:

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

క్లోమశోథ (ప్యాంక్రియాటైటిస్)లో 2 రకాలున్నాయి - తీవ్రమైన క్లోమ వాపు/శోథ మరియు దీర్ఘకాలిక క్లోమ వాపు/శోథ అనేవే ఆ రెండు రకాలు. పొత్తికడుపులో ఆకస్మికంగా తీవ్రమైన గాయం అయినప్పుడు తీవ్రమైన క్లోమ శోథ (పేట్రియాటిస్ ఏర్పడుతుంది. ఇది గుండె లేదా మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. దీర్ఘకాలిక క్లోమ శోథ (క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్) మితి మీరిన మద్యపానం వల్ల సంభవిస్తుంది. క్లోమశోధ చాలా కాలం పాటు సంభవిస్తుంది మరియు మెరుగుదల మరియు మానే అవకాశాలు సాధారణంగా తక్కువగా ఉంటాయి. రోగ నిర్ధారణను ధృవీకరించడానికి శారీరక పరీక్ష వరుస వైద్య విచారణల ద్వారా జరుగుతుంది.

క్లోమశోధ (ప్యాంక్రియాటైటిస్) యొక్క రోగనిర్ధారణను కిందివాటి ద్వారా చేయవచ్చు:

 • ఎంఆర్ఐ (MRI) స్కాన్ - దీని ద్వారా నాళాల యొక్క చిత్రాలను గమనించిన తర్వాత వ్యాధి యొక్క అసలు కారణం గురించి ఇది వైద్యులకు సమాచారాన్ని అందిస్తుంది.
 • పొత్తి కడుపు యొక్క అల్ట్రాసౌండ్ - ఇది పిత్తాశయంలోని రాళ్ళను గుర్తించడంలో సహాయపడుతుంది.
 • సిటి (CT) స్కాన్ - ఇది గ్రంధి యొక్క 3-D చిత్రాలను తీసుకోవడంలో సహాయపడుతుంది.
 • ప్యాంక్రియాటైటిస్ నిర్ధారణకు ఎక్స్-రే, మరియు అమలేస్ స్థాయి రక్త పరీక్షలు వంటి మరి కొన్ని పరీక్షలు జరుగుతాయి.

రోగనిర్ధారణ తరువాత, దీనిని కింద పేర్కొన్నటువంటి వివిధ పద్ధతులు ద్వారా చికిత్స చేస్తారు:

 • శస్త్రచికిత్స - సాధారణంగా, రాళ్ళను గుర్తించిన తర్వాత పిత్తాశయం తొలగించబడుతుంది. అలాగే, క్లోమములో గాయపడిన భాగాల్ని వీలైతే తీసివేయబడతాయి.
 • ఎండోస్కోపీ - పిత్తాశయంలో రాళ్ళను తొలగించడానికి.
 • ఇంట్రవీనస్ (నరాలకు ఎక్కించే) ద్రవాలు - ఇవి వాపును పరిష్కరించడానికి సహాయపడుతాయి.
 • నొప్పి నివారణ కోసం నొప్పి నివారణలు (analgesics) (నొప్పి నివారణలు).

ఆసుపత్రిలో చికిత్స ద్వారా తీవ్రమైన క్లోమం వాపు మంట (ప్యాంక్రియాటైటిస్) వ్యాధి నియంత్రించబడిన తర్వాత  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక కింద సూచించిన జీవనశైలి (లైఫ్స్టయిల్) మార్పులు పాటించడం తప్పనిసరి.

 • మద్యపానం మానివేయడం
 • కొవ్వు పదార్ధాలను తినకుండా విసర్జించడం.వనరులు

 1. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Pancreatitis.
 2. National Institute of Diabetes and Digestive and Kidney Diseases. [Internet]. U.S. Department of Health & Human Services; Pancreatitis.
 3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Pancreatitis.
 4. National Institute of Diabetes and Digestive and Kidney Diseases. [Internet]. U.S. Department of Health & Human Services; Symptoms & Causes of Pancreatitis.
 5. National Institutes of Health; [Internet]. U.S. National Library of Medicine. Enhanced Recovery in Acute Pancreatitis.

క్లోమవాపు (పాంక్రియాటైటిస్) వైద్యులు

Dr. Paramjeet Singh Dr. Paramjeet Singh Gastroenterology
10 Years of Experience
Dr. Nikhil Bhangale Dr. Nikhil Bhangale Gastroenterology
10 Years of Experience
Dr Jagdish Singh Dr Jagdish Singh Gastroenterology
12 Years of Experience
Dr. Deepak Sharma Dr. Deepak Sharma Gastroenterology
12 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

క్లోమవాపు (పాంక్రియాటైటిస్) కొరకు మందులు

Medicines listed below are available for క్లోమవాపు (పాంక్రియాటైటిస్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.