పెరిఫెరల్ న్యూరోపతి - Peripheral Neuropathy in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

December 14, 2018

March 06, 2020

పెరిఫెరల్ న్యూరోపతి
పెరిఫెరల్ న్యూరోపతి

పెరిఫెరల్ న్యూరోపతి  అంటే ఏమిటి?

పెరిఫెరల్ నాడీ వ్యవస్థ అనేది మెదడు మరియు వెన్నెముకతో కూడిన కేంద్రీయ నాడీ వ్యవస్థ మరియు శరీరం యొక్క ఇతర భాగాల మధ్య సంకేతాల మార్పిడిని కలిగి ఉన్న మన శరీరంలోని సమాచార వ్యవస్థ. ఈ సంకేతాలు చల్లని చేతుల్ని తెలిపేటువంటి జ్ఞానసందేశాలు, శరీర కదలికలో సహాయపడే కండరాల సంకోచానికి తోడ్పడే సంకేతాలు, మరియు ఇతరజ్ఞాన సందేశాలను కలిగి ఉంటాయి. పరిధీయ నరాల వ్యవస్థకు దెబ్బ తగలడాన్నే “పరిధీయ నరాల వ్యాధి” లేదా “పెర్ఫెరల్ నరాలవ్యాధి” అని అంటారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఏ నరం దెబ్బ తిన్నది  అన్నదాన్నిబట్టి సంకేతాలు మరియు లక్షణాలు మారవచ్చు.

  • మోటార్ నరాలకు నష్టం
    ఇది కండరాల తిమ్మిరి, కండరాల బలహీనత, కండరాల మెలికలు మరియు కండరాల కృంగతీతకు  కారణమవుతుంది.
  • ఇంద్రియ జ్ఞాన నరాలకు నష్టం
    ఇది స్పర్శ, నొప్పి మరియు ఉష్ణోగ్రత మార్పులు వంటి అనుభూతులను అనుభవించే నరాల అసమర్థతకు కారణమవుతుంది. మరియు నడక (వాకింగ్), చొక్కాకు బొత్తాములు పెట్టుకోవడం వంటి మోటారు సమన్వయంలో కష్టం కల్గిస్తుందీ నరాల నష్టం.
  • స్వతంత్ర నరాలకు నష్టం
    ఇది మారుతున్న చెమట, వేడి అసహనం మరియు అంతర్గత అవయవాలకు సంబంధించిన ఇతర సమస్యలకు కారణమవుతుంది.

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

పెరిఫెరల్ న్యూరోపతి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన కారణం మధుమేహం. ఇతర కారణాలలో క్రింద ఇవ్వబడిన ఆరోగ్య రుగ్మతలు ఉన్నాయి:

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

పెరిఫెరల్ న్యూరోపతి  నిర్ధారణ క్రింది విధంగా ఉంటుంది:

  • మధుమేహం లేదా విటమిన్ లోపం గుర్తించడంకోసం  రక్త పరీక్ష.
  • నరాల ప్రసరణ పరీక్షలు.
  • ఎక్స్- రే, సిటి(CT) స్కాన్ మరియు మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI) పరీక్ష వంటి ఇమేజింగ్ పద్ధతులు.
  • ఎలెక్ట్రోమయోగ్రఫి.
  • నరాల బయాప్సీ.

పెరిఫెరల్ న్యూరోపతి  చికిత్స వ్యాధి కారకాన్ని అలాగే వ్యాధి లక్షణాలను నిర్వహించడం ద్వారా జరుగుతుంది. చికిత్సకు సాధారణంగా ఉపయోగించే పద్ధతులు ఈ క్రింది విదంగా ఉంటాయి:

  • మధుమేహం చికిత్స మరియు నిర్వహణ.
  • ఇంజెక్షన్లు లేదా విటమిన్లు యొక్క మౌఖిక పదార్ధాలు.
  • ఒక ఔషధం యొక్క తీసుకోవడం ఆపడం, ఇది కారణం ఉంటే.
  • కార్టికోస్టెరాయిడ్స్.
  • ఇమ్యునోగ్లోబులిన్ సూది మందులు.
  • ప్రతిరక్షా నిరోధకాలు.
  • నరాల నొప్పి చికిత్సకు మందులు వంటి మందులు.
  • అన్నివేళలా బూట్లు-సాక్స్ ధరించడంవల్ల కాళ్లకు గాయాల్ని (తగ్గిన సంవేదనాల కారణంగా) నిరోధించడానికి సహాయపడుతుంది.  



వనరులు

  1. National Institute of Neurological Disorders and Stroke [internet]. US Department of Health and Human Services; Peripheral Neuropathy Fact Sheet.
  2. National Health Service [Internet]. UK; Peripheral neuropathy.
  3. The Foundation for Peripheral Neuropathy [Internet]: Buffalo Grove, IL; What Is Peripheral Neuropathy?
  4. National Health Service [Internet]. UK; Causes.
  5. National Health Service [Internet]. UK; Diagnosis.

పెరిఫెరల్ న్యూరోపతి వైద్యులు

Dr. Hemant Kumar Dr. Hemant Kumar Neurology
11 Years of Experience
Dr. Vinayak Jatale Dr. Vinayak Jatale Neurology
3 Years of Experience
Dr. Sameer Arora Dr. Sameer Arora Neurology
10 Years of Experience
Dr. Khursheed Kazmi Dr. Khursheed Kazmi Neurology
10 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

పెరిఫెరల్ న్యూరోపతి కొరకు మందులు

Medicines listed below are available for పెరిఫెరల్ న్యూరోపతి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.